సినిమా రివ్యూ: జంప్ జిలాని
సినిమా రివ్యూ: జంప్ జిలాని
Published Thu, Jun 12 2014 2:56 PM | Last Updated on Tue, Sep 18 2018 8:13 PM
నటీనటులు: అల్లరి నరేశ్, ఇషా చావ్లా, స్వాతి దీక్షిత్, రావు రమేశ్, పోసాని కృష్ణ మురళి, వేణుమాధవ్, హేమ, రఘుబాబు, కోట శ్రీనివాసరావు
దర్శకత్వం: సత్తిబాబు
నిర్మాత: అంబికా రాజు
సంగీతం: విజయ్ ఎబెనెజెర్
ప్లస్ పాయింట్స్:
పర్వాలేదనిపించే క్లైమాక్స్
మైనస్ పాయింట్స్:
కథ, కథనం,
సినిమా లెంగ్త్
ఎడిటింగ్
మ్యూజిక్
గతంలో తనదైన స్టైల్ తో కామెడీ స్టార్ గుర్తింపు తెచ్చుకున్న 'అల్లరి' నరేశ్ ను ఫ్లాఫ్ లు వెంటాడుతున్నాయి. ఇటీవల విడుదలైన 'లడ్డూబాబు' ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. లడ్డూబాబు తర్వాత ఓ తమిళ చిత్రం 'కలకలప్పు' రీమేక్ మలిచి తెలుగులో 'జంప్ జిలాని' చిత్రంగా ప్రేక్షకులకు అందించారు. సత్తిబాబు దర్శకత్వంలో అల్లరి నరేశ్ సరసన ఇషా చావ్లా, స్వాతి దీక్షిత్ లు నటించిన ఈ చిత్రం జూన్ 12 తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత కొద్దికాలంగా పరాజయాల బారిన పడిన అల్లరి నరేశ్ కు 'జంప్ జిలాని' ఎలాంటి టాక్ సంపాదించుకుందో తెలుసుకోవాలంటే ఓసారి కథలోకి వెళ్లాల్సిందే.
సత్తిబాబు, రాంబాబు(అల్లరి నరేశ్) ఇద్దరు కవల పిల్లలు. సత్తిబాబు దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ అయితే, రాంబాబు చిల్లర దొంగతనాలు, పేకాటతో జల్సా చేసే ఓ పోకిరి లాంటోడు. సత్తిబాబు సోదరులకు నిడుదవోలులో ఒకప్పుడు గొప్పగా పేరు చెప్పుకునే సత్యనారాయణ కాఫీ విలాస్ అనే హోటల్ ఉండేది. అయితే కాలక్రమేణ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్ల సంస్కృతి పెరగడంతో హోటల్ నష్టాల్లో కూరుకుపోతుంది. ఎలాగైనా తన వంశానికి గొప్ప పేరు తెచ్చిన హోటల్ కు పూర్వవైభవాన్ని సంపాదించే పట్టుదలతో ఉన్న సత్తిబాబు.. మాధవి(ఫుడ్ ఇన్స్ పెక్టర్)తో ప్రేమలో పడుతాడు. తమ హోటల్ లోనే పనిచేసే తన మరదలు(స్వాతి దీక్షిత్)ను రాంబాబు ప్రేమిస్తుంటాడు. కథ ఇలా సాగుతుండగా.. మాధవి ప్రేమను దక్కించుకోవడానికి సత్తిబాబు రాయలసీమలోని ఓ ప్రాంతానికి వెళ్లాల్సివస్తుంది. అయితే రాయలసీమకు వెళ్లిన సత్తిబాబు విలన్ గ్యాంగ్ వెంటాడుతుంటారు. సత్తిబాబును విలన్ గ్యాంగ్ ఎందుకు వెంటాడుతారు?. సత్తిబాబు, రాంబాబు తమ ప్రేమ వ్యవహారాన్ని పెళ్లి పీటలు ఎక్కించారా? తమ హోటల్ కు పూర్వ వైభవం తెప్పించడంలో సఫలమయ్యారా? అనే ప్రశ్నలకు సమాధానమే 'జంప్ జిలానీ'
గతంలో ఎన్నో కామెడి పాత్రలతో ఆలరించిన అల్లరి నరేశ్ సత్తిబాబు, రాంబాబు పాత్రలతో ద్విపాత్రభినయం చేశారు. అయితే గతంలో పోషించిన పాత్రలతో పోల్చితే సత్తిబాబు, రాంబాబుల పాత్రలు విభిన్నమైనవనే ఫీలింగ్ కలుగదు. అల్లరి నరేశ్ రోటిన్ పాత్రలతో ప్రేక్షకులను సంతృప్తి పరించేందుకు ప్రయత్నం చేశారు.
ఇషా చావ్లా కొంత ప్రాధాన్యత ఉన్న పాత్ర లభించినా.. ఆ స్థాయిని చేరుకోలేదనే చెప్పవచ్చు. గ్లామర్ తో కూడా ఆకట్టుకోవడంలో ఇషా విఫలమైంది. స్వాతి దీక్షిత్ పాత్ర కేవలం గ్లామర్ కే పరిమితమైంది. రాయలసీమలో ఫ్యాక్షన్ నేతగా పోసాని కృష్ణమురళి తనదైన శైలిలో నటించారు. పాత్రల పరిధి మేరకు రావు రమేశ్ విలనిజంతో కూడిన కామెడీ పండించడంలోనూ తన మార్కును సొంతం చేసుకోలేకపోయారు. రఘుబాబు, వేణుమాధవ్ పాత్రలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
విశ్లేషణ:
'హలో బ్రదర్' లాంటి కాన్సెప్ట్ తో మాస్, క్లాస్ కాంబినేషన్ తో ఈవీవీ చేసిన ప్రయోగాన్ని స్పూర్తిగా తీసుకుని రూపొందించిన సత్తిబాబు, రాంబాబు పాత్రలు ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది. కథ లో పస లేకపోవడం, దానికి తోడుగా కథనం కూడా పేలవంగా ఉండటంతో అంతా గందరగోళంగా మారింది. వేణుమాధవ్, రఘుబాబు పాత్రలు సహజంగా హస్యాన్ని పండించలేకపోగా.. సన్నివేశాల మధ్య అవసరం లేకునా దూరిన ఫీలింగ్ కనిపించింది. ఇక చిత్ర నిడివి కూడా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టడం ఖాయం. తొలిభాగం, ద్వితీయ భాగం ఫ్లాట్ గా నడిపించి... కైమాక్స్ తో మేనెజ్ చేస్తామని ప్లాన్ అంతగా వర్కవుట్ కాలేకపోయింది. ఈ చిత్ర అధిక భాగం విసిగించే రీతిలో సాగిన కొంతలో కొంత క్లైమాక్స్ ప్రేక్షకుడికి కొంత ఊరట కలిగించే అంశం. ఇక మ్యూజిక్ అంశానికి వస్తే తెలుగు నేటివిటి స్పష్టంగా మిస్సయిందనే చెప్పవచ్చు. విజయ్ ఎబెనెజెర్ సంగీతం తెలుగు ప్రేక్షకుల టేస్ట్ కు దూరంగా ఉంది. మారుతున్న ప్రేక్షకుల అభిరుచి అంచనా వేయడంలో సత్తిబాబు తడబాటు గురయ్యారు. పాత చింతకాయ పచ్చడినే 'జంప్ జిలాని' అనే ప్యాక్ అందించారే తప్ప.. పక్కా హస్యాన్ని పంచలేకపోయారు. ఓవరాల్ గా చిత్ర విజయం ఏంటనే ప్రశ్న వేసుకుంటే... బీ, సీ సెంటర్లలో ప్రేక్షకుల ఆదరణ పొందితే తప్ప అల్లరి నరేశ్ ఖాతాలో సక్సెస్ చేరుతుంది.
ట్యాగ్: ప్రేక్షకులు 'జంప్ జిలాని'
Advertisement
Advertisement