raghu babu
-
జగన్ పాలన ఎక్స్ట్రార్డినరీ... అంతే!
తెలుగు నేలకు తేజస్సు వచ్చింది అంటున్నారు ప్రముఖ సినీ నటుడు రఘుబాబు. ‘జగన్ ప్రభుత్వ పరిపాలన గురించి సింపుల్‌గా చెప్పాలంటే ఎక్స్ట్రార్డినరీ అంతే. అంతకు మించి చెప్పడానికి మరో మాట నా దగ్గర లేదు.’ అంటూ కుండబద్దలు కొట్టేశారాయన. తాను ప్రస్తు తం రాజకీయాల్లో లేననీ ఏ పార్టీతోనూ ఎటువంటి సంబంధాలు లేవనీ. ఏ అవసరం కోసమైనా అ బద్ధాలు చెప్పాల్సిన అవసరం తనకు లేదంటున్న ఆయన తన సొంత ఊరి లోని తన ఇంట్లో పనిచేసే పనివారి జీవితాల్లో వచ్చిన మార్పే ప్రస్తుత పాలనకు నిదర్శ నం అన్నారు. ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే... అనూహ్యమైన పాలన ఇది.. నిజంగా జగన్ పరిపాలన ఈ స్థాయిలో ఉంటుందని గత ఎన్నికల ముందు నేను ఏ మాత్రం ఊహించలేదు. ఈ రకమైన అద్భుతమైన మార్పుల్ని నేను ముందుగా ఊహించలేదనేది నిజం. రాష్ట్రంలో మూలాల నుంచి మార్పును జగన్ కోరుకుంటున్నారనేది నాకు అనిపిస్తోంది. ఇప్పుడు మారుమూల ఊళ్లలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు చూస్తుంటే విదేశాల్లోని స్కూల్స్ గుర్తొస్తున్నాయి. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం అంటే అవమానంగా భావించేవారు. ఆ దశ పోయి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు దొరకడం లేదని బోర్డులు పెట్టడం అంటే వాటి గొప్పతనం తెలుస్తుంది. అవి కార్పొరేట్ స్కూల్స్‌కు దీటుగా మారడంతో అంతకు ముందు 20, 30శాతం కూడా విద్యార్ధులు కనిపించని పరిస్థితి నుంచి ఇప్పుడు 100శాతం ఆక్యుపెన్సీ నేను గమనించాను. మా సొంత ఊళ్లో... ఎంత మార్పో ! మాది ప్రకాశం జిల్లాలోని రావినూతల గ్రామం. తరచుగా మా ఊరుకు వెళుతుంటాం. దాంతో ఆ గ్రామంలో వచ్చిన మార్పులు ఎన్నో మాకు తెలుస్తున్నాయి. గ్రామ సచివాలయాలు కావచ్చు, వలంటీర్లు ఇళ్లకు రావడం... ప్రభుత్వ పథకాలు, ప్రతీదీ ఇంటికి తీసుకొచ్చి అందించడం గొప్పగా అనిపిస్తోంది. అక్కడ మా ఇంట్లో పనిచేసే పనివాళ్ల పిల్లలు కూడా ప్రభుత్వ పథకాల ప్రయోజనాల్ని ఉపయోగించుకుని దర్జాగా రాజమండ్రిలోని ఇంజినీరింగ్ కాలేజ్‌లో చదువుకోగలుగుతున్నారు. ఇది మేం ఊహించని మార్పు. మేం వాళ్లు చేసే పనికి తగ్గ జీతాలు ఇచ్చినా... అడపాదడపా అదనంగా ఆర్థిక సాయం చేసినా కూడా వాళ్ల జీవితాల్ని సమూలంగా మార్చలేం. ఇప్పుడు అమలవుతున్న ప్రభుత్వ పథకాల వల్ల వాళ్ల జీవితాలు మారిపోతున్నాయి. పిల్లలు బాగా చదువుకోగలగడం వల్ల ఎన్నడూ చూడనంత ఆత్మవిశ్వాసం వారిలో కనిపిస్తోంది. ఇది మాకు చాలా ఆనందాన్ని అందిస్తోంది. ఈ పథకాలు ఇలాగే కొనసాగాలని, ఈ పాలన పేదలకు మరింత కాలం మేలు కలుగజేయాలని కోరుకుంటున్నాను. –సత్యార్థ్ -
సెంటిమెంట్.. యాక్షన్
శ్రీ కల్యాణ్, శశి జంటగా గేదెల రవిచంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మెగా పవర్’. అడబాల నాగబాబు, సాయినిర్మల, ఇల్లా అభిషేక్, సత్యమూర్తి గేదెల నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల హైదరాబాద్‌లో జరిగాయి. హీరో కిరణ్ అబ్బవరం కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు రఘుబాబు క్లాప్ ఇచ్చారు. తొలి సన్నివేశానికి పృథ్వీరాజ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ– ‘‘మదర్ సెంటిమెంట్‌తో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది’’ అని అన్నారు. -
రఘుబాబు కూతురి ఎంగేజ్మెంట్లో స్టార్ల సందడి
-
కమెడియన్ కూతురి నిశ్చితార్థంలో తారల సందడి
కమెడియన్ రఘుబాబు కూతురు నిశ్చితార్థం హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే కదా!. ఆదివారం రాత్రి జరిగిన ఈ వేడుకకు టాలీవుడ్‌లోని పలువురు సెలబ్రిటీలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. క్రాక్ హీరో రవితేజ, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, గోపీచంద్, డైలాగ్ కింగ్ మోహన్‌బాబు, కమెడియన్ బ్రహ్మానందం, మంచు లక్ష్మీ, మంచు విష్ణు, అనసూయ భరద్వాజ్, ప్రకాశ్‌రాజ్, ఉదయభాను, బ్రహ్మాజీ సహా పలువురు తారలు ఈ ఎంగేజ్మెంట్కు విచ్చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇక రఘుబాబు సినిమాల విషయానికొస్తే... కేవలం ఎక్స్‌ప్రెషన్స్‌తోనే నవ్వించగల ఘనుడాయన. కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే టాలెంట్‌తో తక్కువ కాలంలోనే తెలుగు ఇండస్ట్రీలో మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. పాత్ర డిమాండ్ మేరకు కొన్నిసార్లు విలనిజం ఉన్న పాత్రల్లోనూ నటించి మెప్పించాడు. ఈ మధ్యే వచ్చిన జాంబీరెడ్డిలోనూ కనిపించిన రఘుబాబు ప్రస్తుతం ఏ1 ఎక్స్‌ప్రెస్, సన్ ఆఫ్ ఇండియా, గాలి సంపత్ సినిమాల్లో నటిస్తున్నాడు. చదవండి: నెట్టింట్లో సినీతారలు: స్టైల్‌గా ల్యాండైన లైగర్ అవసరమైతే వేడుకుంటారు.. అవసరానికి వాడుకుంటారు..! -
సినీ పరిశ్రమ అభివృద్ధికి జగన్ ముందుంటారు
‘‘వేదికపై ఉన్న అలీ, రఘుబాబు మా పార్టీలో (వైఎస్సార్సీపీ) ఉన్నారు. వారందరి సూచనలతో ఆంధ్రప్రదేశ్‌లో సినిమా ఇండస్ట్రీని అభివృద్ధి చేయడానికి మా సీఎం జగన్మోహన్ రెడ్డిగారు సుముఖంగా ఉన్నారు’’ అని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డ్ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. సత్యదేవ్, ఈషా రెబ్బ, శ్రీరాం, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రల్లో శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. శ్రీనివాస్ కానూరు నిర్మించిన ఈ సినిమా నవంబరులో విడుదల కానుంది. రఘు కుంచె సంగీతం అందించారు. ఈ చిత్రంలోని హీరోయిన్ ఇంట్రడక్షన్ ‘నారాయణతే నమో నమో..’ లిరికల్ వీడియో సాంగ్‌ని హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో వై.వి.సుబ్బారెడ్డి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘శ్రీనివాస్ రెడ్డి 20 ఏళ్లుగా నాకు మంచి స్నేహితుడు. వెంకటేశ్వర స్వామివారి కీర్తన పాటని నాతో ఎందుకు రిలీజ్ చేయించారో పాట చూశాక అర్థం అయింది. పాటని చక్కగా చిత్రీకరించారు. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘నా దైవం, పితృ సమానులు సుబ్బారెడ్డిగారితో నా అనుబంధం 20 ఏళ్లుగా కొనసాగుతోంది. దివంగత నేత వై.యస్. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఆ కుటుంబానికి, పార్టీకి న్నెముకగా ఉండి ఎన్నో సేవలందిస్తున్నారు సుబ్బారెడ్డిగారు. యస్వీబీసీ (శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్) బోర్డ్ డైరెక్టర్ పదవీ బాధ్యతలు నాకు అప్పగించారు. ఆయన నాపై పెట్టిన నమ్మకానికి నిజాయతీగా పని చేస్తా’’ అన్నారు. ‘‘రామానాయుడుగారు, ‘దిల్’ రాజుగారి స్ఫూర్తితో ఇండస్ట్రీకి వచ్చాను. శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఈ సినిమా నిర్మించడం సంతోషంగా ఉంది’’ అన్నారు శ్రీనివాస్ కానూరు. సంగీత దర్శకుడు రఘు కుంచె, పాటల రచయిత శ్రీమణి, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, ఎడిటర్ తమ్మిరాజు, నటుడు రవి ప్రకాష్, కెమెరామేన్ అంజి, లైన్ ప్రొడ్యూసర్ యమ్‌యస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎర్రచీర సస్పెన్స్
శ్రీకాంత్ కీలక పాత్రలో బేబి సాయి తేజస్విని, కారుణ్య చౌదరి, రఘుబాబు ముఖ్య తారలుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎర్రచీర’. సత్య సుమన్‌బాబు దర్శకత్వంలో బేబీ ఢమరి సమర్పణలో శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతోంది. సత్యసుమన్ బాబు మాట్లాడుతూ– ‘‘హారర్, యాక్షన్ సస్పెన్స్ ప్రధానంగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ప్రస్తుతం హైదరాబాద్‌లో హీరోయిన్ ప్రియాంక అగస్టీన్–రఘుబాబు– ఫిష్ వెంకట్‌లపై ప్రత్యేక పాట చిత్రీకరిస్తున్నాం. ఇందులో చేజింగ్ సీన్స్, హారర్, కామెడీ హైలైట్‌గా నిలుస్తాయి. త్వరలో క్లయిమాక్స్ చిత్రీకరణ పూర్తి చేయనున్నాం. మరోవైపు నిర్మాణానంతర పనులు కూడా జరుగుతున్నాయి. శ్రీకాంత్, కమల్ కామరాజు, అజయ్, శ్రీరాం, అలీ పాత్రలు ఆకట్టుకుంటాయి’’ అన్నారు. ‘‘ఆగస్టు చివరి నాటికి అన్ని పనులు పూర్తి చేసి, సెప్టెంబర్ 20న సినిమా విడుదల చేస్తాం’’ అని ఎగ్జిక్యూటివ్ నిర్మాత తోట సతీష్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: చందు. -
ఎంత పని చేశావు తల్లీ..?
- పరస్త్రీ వ్యామోహంలో భర్త - తనను, బిడ్డలను నిర్లక్ష్యం చేస్తున్నాడన్న మనస్తాపం - జీవితంపై విరక్తితో బిడ్డలకు ఉరేసి, తానూ బలవన్మరణానికి పాల్పడిన అభాగ్యురాలు - ఇదే విషయమై నాలుగేళ్ల కిందటా ఆత్మహత్యాయత్నం బిడ్డల మీద ప్రేమకంటే భర్తపై కోపమే ఆమెకు ఎక్కువైంది.. పిల్లల మీద ఆశైనా ఆమె ఆవేశాన్ని అణచలేకపోయింది. ముద్దులొలికే బిడ్డలను చంపడానికి ముందు మొద్దుబారిన ఆ మనసు ఎంత ఏడ్చిందో.. సర్వస్వమనుకున్న భర్తే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తమను నిర్లక్ష్యం చేయడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది.. భర్తను ప్రశ్నించింది.. నిలదీసింది.. అయినా ఆ కామాంధుడిలో మార్పు రాలేదు. ఇక తను బతికి ప్రయోజనం లేదనుకుందో, ఏమో ఆ పిచ్చితల్లి.. తాను చస్తే బిడ్డల ఆలనాపాలనా ఎవరు చూస్తారనుకుందో ఏమో... తొలుత బంగారం లాంటి పిల్లలిద్దరినీ ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసి చంపేసింది. వారి ప్రాణాలు పోయాయని నిర్ధారించుకున్నాక.. తానూ ఊయల కోసం వేసిన ఇనుప కొక్కీకి చీరతో ఉరేసుకుని తనువు చాలించింది. ఈ విషాద ఘటన గుత్తిలో మంగళవారం చోటుచేసుకుంది. గుత్తి(అనంతపురం) : గుత్తికి చెందిన రఘుబాబు భార్య నేత్రావతి(28) తన ఇద్దరు కుమారులైన మురారి(6), ముఖేశ్(4)ను ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసి చంపేసింది. ఆ తరువాత తానూ ఇంట్లోనే ఉరేసుకుని తనువు చాలించింది. బెంగళూరుకు చెందిన నేత్రావతి వివాహం గుత్తి మున్సిపల్ పరిధిలోని చెట్నేపల్లికి చెందిన రఘుబాబుతో ఎనిమిదేళ్ల కిందట అయింది. వారికి ఇద్దరు మగపిల్లలు. వివాహేతర సంబంధం వద్దన్నా... హాయిగా సాగిపోతున్న నేత్రావతి, రఘుబాబు జీవితంలోకి గుత్తి ఆర్ఎస్కు చెందిన ఓ మహిళ ప్రవేశించింది. ఈ విషయం తన చెవిలో పడినా నేత్రావతి నమ్మలేకపోయింది. భర్త కదలికలపై నిఘా పెట్టింది. చివరకు తన భర్త అసలు రూపం తెలుసుకుంది. వివాహేతర సంబంధం మంచిది కాదని, తనతో పాటు పిల్లలను బాగా చూసుకోవాలని భర్తను కోరింది. అతనిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నించింది. అయినా ఆ కామాంధుడు మారలేకపోయాడు. భార్యా పిల్లలకంటే ఉంపుడుగత్తే తనకు ప్రధానంగా భావించాడు. ఇక ఇలాగైతే కుదరదునుకున్న నేత్రావతి నేరుగా భర్తను నిలదీసింది. ఈ విషయంలో వారి మధ్య తరచూ గొడవలు ప్రారంభమయ్యాయి. ‘నువ్వు మారకపోతే పిల్లలను చంపి, నేనూ చస్తా’నంటూ ఆమె హెచ్చరించింది. ఈ విషయాన్ని అతను తేలిగ్గా తీసుకున్నాడు. ఒకసారి ఆమె ఆత్మహత్యాయత్నం చేసినా అతనిలో మార్పు రాలేదు. మొదట పిల్లలకు ఉరేసి.. నేత్రావతి ఇంట్లోనే ఫ్యాన్‌కు రెండు చీరలను వేలాడదీసి వాటి సహాయంతో కుమారులు మురారి, ముఖేశ్‌కు ఉరేసింది. అనంతరం ఆమె కూడా ఊయల కోసం వేసిన ఇనుప కొక్కీకి చీరతో ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికొచ్చిన రఘుబాబు తలుపులు వేసి ఉండటంతో భార్యను పిలిచాడు. ఎంతసేపైనా పలకలేదు. అనుమానంతో తలుపును బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా భార్య, పిల్లలు ఫ్యాన్‌కు వేలాడుతుండటం గమనించి గట్టిగా కేకలు వేశాడు. ఇరుగుపొరుగు వారు వచ్చి వారిని కిందకు దింపారు. అప్పటికే ముగ్గురూ మృతి చెంది ఉన్నారు. ప్రాణం ఉందేమోనని హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే వారు మరణించినట్లు నిర్ధారించారు. మురారి గుత్తి ఆర్ఎస్లోని సెయింట్ మెరీస్ పాఠశాలలో ఒకటో తరగతి, ముఖేశ్ చందమామ పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నారు. పోలీసులకు తప్పుడు ఫిర్యాదు కేసు నుంచి బయటపడేందుకు భర్త రఘుబాబు పోలీసులకు మరోలా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తన భార్య బెంగళూరులో కాపురం పెట్టాలని తరచూ తనతో గొడవ పడుతుండేదని, అందుకు తాను అంగీకరించకపోవడం తో ఇలా చేసుకుం దని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇప్పటికీ జాంపండు అని పిలుస్తుంటారు
కొవ్వూరు : కామెడీ, విలన్, క్యారెక్టర్ పాత్రలతో 300 సినిమాల మైలు రాయిని దాటేశానని సినీ నటుడు రఘుబాబు అన్నారు. కొవ్వూరు మండలం నందమూరులో ‘చుట్టాలబ్బాయి’ సినీ షూటింగ్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ప్రశ్న: జనంలోకి వచ్చినపుడు మీరు నటించిన సినిమాలో పేరుతో పిలిస్తే ఎలా ఉంటుంది ? రఘుబాబు : చాలా ఆనందంగా ఉంటుంది. పాత్ర అంతగా ప్రేక్షకులను మెప్పించిందని చెప్పవచ్చు. ఇప్పటికీ తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో జాంపండు అని పిలుస్తుంటారు. ప్రశ్న: మీ తండ్రి గిరిబాబు సినీ వారసత్వం పనిచేసిందా..? రఘుబాబు : వారసత్వం అనేది నేను ఎవరు అని చెప్పడానికే పనికి వస్తుంది. టాలెంట్ ఉంటేనే ఇక్కడ రాణించగలం. ఒక్క మాట చెప్పాలి. నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో మా అమ్మగారు నాన్నతో వాడు ఏదో సినిమాల్లో చేస్తున్నాడుగా, మీరు ఎవరికైనా రికమెండు చెయ్యండి అన్నారు. నాకు ఎవరు రికమెండు చేశారు అని నాన్న ఎదురు ప్రశ్న వేశారు. ప్రశ్న: మీ ఫిజిక్కు చేసే పాత్రలకు సంబంధం ఉందా ? రఘుబాబు : దర్శకులను గాని నిర్మాతలను గాని ఫలానా పాత్ర ఇవ్వండి అని నేను ఎవ్వరినీ అడగలేదు. రఘబాబు ఏ పాత్రకు నప్పుతాడు అని వారు భావించి ఇచ్చిన పాత్రలను చేసుకుంటూ వెళుతున్నా. ఎప్పటికైనా ఫుల్ లెంగ్త్ ఎమోషన్, పాజిటివ్ పాత్రల్లో నటించాలని ఉంది. ప్రశ్న : ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు ? రఘుబాబు : చుట్టాలబ్బాయి, సర్ధార్ గబ్బర్‌సింగ్, సుప్రీం, బాబు బంగారం, లచ్చి, మావూరి రామాయణం, టైటానిక్‌తో పాటు తెలుగు, కన్నడంలో మాజీ ప్రధాని దేవగౌడ మనవడు నిఖిల్‌గౌడ్ హీరోగా నటిస్తున్న చిత్రంలో నటిస్తున్నా. ఇప్పటి వరకు 300 సినిమాలు పూర్తిచేశాను. -
ఆశ.. దోసె.. అప్పడం.. వడ...
హిట్ క్యారెక్టర్ చిత్రం : టాటా-బిర్లా-మధ్యలో లైలా (2006) డెరైక్ట్ చేసింది : శ్రీనివాస్‌రెడ్డి సినిమా తీసింది : బెక్కెం వేణుగోపాల్ (గోపి) మాటలు రాసింది : బ్రహ్మం దర్శించండి! తరించండి! ఆదో అవ స్వామివారు నగరమునకు వేంచేసియున్నారు. ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకూ భక్తులకు తన దివ్య హస్తములతో ఆశీస్సులు అందజేస్తారు. నగరం నడిబొడ్డున ఆదో అవ స్వామి పేరుతో పెద్ద పెద్ద బేనర్లు వెలిశాయి. ఆదో అవ స్వామిని చూడడం కోసం జనాలు తండోపతండాలుగా విచ్చేస్తున్నారు. కొత్త ఎప్పుడూ వింతే కదా! స్వామీజీలు ఎంత మందొచ్చినా భక్తులు తమ విశాల హృదయంలో వాళ్లకు టపీమని చోటిచ్చేస్తారు. ఆదో అవ స్వామి విషయంలోనూ అంతే. ఆదో అవ స్వామి అంటే... ఆశ.. దోసె.. అప్పడం.. వడ... స్వామి అని అర్థం. ఆదో అవ స్వామివారు సుఖాసనంలో కూర్చుని ధ్యానముద్రలో ఉన్నారు. భక్తులంతా ఆయన దివ్యారవిందాన్ని కనులారా వీక్షిస్తూ... ఎప్పుడెప్పుడు కళ్లు తెరుస్తారా, తమపై వరాల జల్లు కురిపిస్తారా అని చూస్తున్నారు. కాసేపటికి స్వామి కళ్లు తెరిచి ‘జై తుస్’ అన్నాడు.భక్తులంతా పరమానందభరితులైపోయారు. స్వామివారు అనుగ్రహ భాషణం చేయడం మొదలుపెట్టారు. ‘‘మానవుడు ఆశాజీవి. అన్యాయాలూ అక్రమాలూ జరుగుతున్నది ఆ ఆశ వల్లనే. అయినా సరే ఆ ఆశలోనే బతుకుతున్నాడు... ఆ ఆశలోనే చస్తున్నాడు. ఈ ఆశ ఎలాంటిదంటే - పొద్దున్నే పెరుగన్నం, ఆవకాయతో కడుపు నింపుకోవచ్చు. కానీ మనం హోటల్‌కెళ్లి వేడివేడిగా దోసె తినాలనుకుంటాం. ఆశ. అంతటితో ఊరుకుంటామా? పక్కనే వేడివేడిగా నూనెలో వడలు వేస్తూ ఉంటారు. ఆ వడలు తినాలనుకుంటాం. ఆశ. ఇలా ఆశపడిపోతూ ఉంటే జీవితం ఏమైపోతుంది? ఏదో ఒక రోజు అప్పడంలా పగిలిపోతుంది. అందుకే ఆ భగవాన్ చెప్పాడు. ఆశ దోసె అప్పడం వడ.’’ స్వామి వారి ప్రసంగం పూర్తి కాగానే భక్తులు పులకించిపోయారు. ‘ఆశ.. దోసె.. అప్పడం.. వడ’ అంటూ స్వామివారు రాగయుక్తంగా పాడటం మొదలుపెట్టారు. భక్తులు కూడా ఆ రాగంలో రాగం కలిపారు. ఓ భక్తుడు స్వామివారి ముందు మోకరిల్లి ‘‘ఈమధ్య నాకేమీ కలిసి రావడం లేదు. కొంచెం నా జాతకం చూసి దారి చూపించండి స్వామి’’ అంటూ తన జాతకాన్ని అందించాడు. స్వామి జాతకాన్ని అటూ ఇటూ తిరగేశాడు. ‘‘మీ నాన్న పేరు పెంటయ్య. వయసు 60 సంవత్సరాలు’’ అని స్వామి చెప్పగానే, ఈ భక్తుడు షాక్.‘‘మీ అమ్మ పేరు సుబ్బమ్మ. వయసు 58 సంవత్సరాలు’’ అనగానే, భక్తుడు డబుల్ షాక్. ‘‘నీకు ముగ్గురు పిల్లలు’’... భక్తుడు త్రిబుల్ షాక్. ‘‘ఈ నెల ఐదో తారీఖున 10 కిలోల బియ్యం, ఐదు కిలోల పంచదార, రెండు లీటర్ల కిరోసిన్ తీసుకున్నావ్’’ అని స్వామి చెబుతుంటే, ఆ భక్తుడు పులకించిపోతూ ‘‘ఆహా... స్వామీ ఎలా చెప్పారు?’’ అనడిగాడు.‘‘రేషన్ కార్డు తెచ్చి జాతకం చెప్పమంటావా ఎదవ సన్నాసి. నీ కళ్లకెలా కనిపిస్తున్నానురా పాపీ!’’ అని ఆ రేషన్ కార్డును విసిరి కొట్టాడు. అతగాడు క్షమించమన్నాడు. దూరంగా నిలబడ్డ ఇద్దరిని స్వామి చూశాడు.‘‘నాయనా! తాడి తాతరాజు... అలియాస్ టాటా. బొద్దూరి రామలింగం అలియాస్ బిర్లా. రండి నాయనలారా!’’ అని పిలిచేసరికి వాళ్లిద్దరూ ఉబ్బితబ్బిబైపోయారు. ‘‘స్వామీ! మా పూర్తి పేర్లు ఎలా తెలిశాయ్?’’ అని ఆశ్చర్యంగా అడిగాడు బిర్లా. ‘‘మీ పేర్లే కాదు నాయనా... మీ జాతకాలు కూడా తెలుసు’’ అనేసరికి ఆ ఇద్దరూ కంగారుపడిపోయారు. బిర్లా వెంటనే తేరుకుని ‘‘జాతకాలొద్దులేండి... లైలాతో నా ప్రేమ ఫలిస్తుందో లేదో చెప్పండి’’ అనడిగాడు. దానికి స్వామి చిద్విలాసంతో ‘‘దేవదాసు ప్రేమలో న్యాయముంది. మజ్నూ ప్రేమలో అర్థముంది. నీ ప్రేమలో ఏముంది నా తుస్సు. అయినా నువ్వొక దొంగవి...’’ అనగానే, బిర్లా బిక్కమొహం పెట్టాడు. స్వామి కొంచెం గ్యాప్ ఇచ్చి ‘‘నువ్వు ప్రేమ దొంగవి. నీ బాడీకి తలుపులు పగలగొట్టడం, చువ్వలు వంచడం తప్ప లవ్వు ఒంటపట్టదు నాయనా’’ అని చెబుతూ, తన కమండలంలో ఉన్న తీర్థాన్ని నోట్లో పోసుకున్నాడు. టాటా ఆ కమండలం వంక అనుమానంగా చూస్తూ ‘‘ఇదేంటి? తీర్థం... బ్రాందీ వాసనొస్తోంది?’’ అన్నాడు. వెంటనే స్వామి ఉలిక్కిపడి మళ్లీ తేరుకున్నాడు. ‘‘అర్భకుడా! మొన్న మేం హిమాలయాలకు వెళ్లి తెచ్చిన క్వార్టర్ వాటర్ అది.... వెళ్లండి’’ అని వాళ్లిద్దర్నీ అక్కడ నుంచీ తొందరగా పంపించేశాడు స్వామి. టాటా, బిర్లా పార్కులో షికారుకెళ్లి కారు దగ్గరకొచ్చారు. హడావిడిలో కారు లాక్ చేయలేదు. కారు డోర్ తీసి చూస్తే... లోపల ఆదో అవ స్వామి. వీళ్లిద్దరూ దణ్ణాలు పెట్టేశారు. కానీ స్వామి కంగారులో ఉన్నాడు. ‘‘ఒరేయ్! నేను రా దొరబాబుని!’’ అంటూ మీసాలూ గడ్డాలూ తీసి పారేశాడు. టాటా, బిర్లా కళ్లు విప్పార్చి మరీ చూశారు. నిజంగానే దొరబాబే. తమ ఊరివాడే. ‘‘ఏంట్రా ఈ వేషం?’’ అడిగాడు బిర్లా. ‘‘మన బ్యాచ్‌లో అందరూ పాలిటిక్స్‌లోనూ, రియల్ ఎస్టేట్‌లోనూ సెటిలైపోయారు. నాకవి సరిపోక ఇందులో సెటిలయ్యా’’ చెప్పాడు దొరబాబు ఉరఫ్ ఆదో అవ స్వామి.‘‘ఈ ప్రొఫెషన్ బానే ఉందిగా... మరెందుకు ఇక్కడ దాక్కున్నావ్?’’ టాటా క్వశ్చన్ చేశాడు. ‘‘నా భక్తురాళ్లలో ఒకరికి కడుపైంది. అందరికీ నేనని తెలిసిపోయింది. కొట్టడానికి వస్తే ఇలా దాక్కున్నా’’ అంటూ దొరబాబు అసలు సీక్రెట్ చెప్పేశాడు. ‘‘ఓర్నీ... ఎంత పని చేశావురా. ఇప్పుడు నీ పరిస్థితేంటి?’’ ఆందోళనగా అడిగాడు టాటా. ‘‘ఇప్పటివరకూ అందరి భవిష్యత్తులూ నేను చెప్పాను. ఇప్పుడు నా భవిష్యత్తు మీ ఇద్దరి చేతుల్లో ఉంది’’ అంటూ వాళ్లను వాటేసుకుని బోరుమన్నాడు దొరబాబు. టాటాకో ఐడియా వచ్చింది. ‘‘మా ఇంటి ఓనర్ నీకు పరమ భక్తురాలు. అక్కడ తిష్ఠవేద్దువు గానీ’’ అన్నాడు. దొరబాబు మొహం వెలిగిపోయింది. ‘‘మీ ఓనర్ యంగేనా?’’ అనడిగాడు. టాటా, బిర్లా ‘‘బొంగేం కాదు’’ అంటూ దొరబాబు జబ్బ మీద ఒక్కటిచ్చారు. ఆదో అవ స్వామికి ఆ ఇంట్లో వాళ్లంతా ఫ్లాట్. ఒకటే పూజలూ పునస్కారాలు.పెద్దాయన పద్మనాభం ఓ ధర్మసందేహం వెలిబుచ్చాడు. ‘‘స్వామీ! చెట్టు ముందా? విత్తు ముందా?’’ మామూలుగా ఇంకెవరైనా అయితే కంగారుపడేవారు. దొరబాబు ముదురు టెంక కదా! అతని దగ్గర ఆన్సర్ రెడీగా ఉంది. ‘‘కోడి ముందా? గుడ్డు ముందా? అంటే ఏం చెప్పగలం. అంతా ఆ సర్వేశ్వరుడి లీల’’ అని చెప్పాడు. ‘‘స్వామీ అజ్ఞానులం. తెలుసుకోలేకపోతున్నాం. ఈ సృష్టి రహస్యం ఏమిటి?’’ అంటూ పద్మనాభం ఇంకో ధర్మ సందేహం. ‘‘ఏముంది పద్మనాభం... అంతా సర్వనామం’’ అని సింపుల్‌గా చెప్పేశాడు స్వామి. ‘‘ఆహా... ఎంత గొప్పగా సెలవిచ్చారు’’ అంటూ ‘ఆశ.. దోసె.. అప్పడం.. వడ...’ అని పాట అందుకున్నాడు పద్మనాభం. ఇలా ఆ ఇంట్లోఅందరికీ అద్భుతంగా పంగనామాలు పెట్టేశాడు ఆదో అవ స్వామి. సారీ దొరబాబు.టాటా, బిర్లాలకు దొరబాబు ట్యాలెంట్ అర్థమైపోయింది. వీడికి చీమ దూరే సందిస్తే ఏనుగునే పెట్టే స్తాడని!ఈ స్వామి రూపంలో ఉన్న దొరబాబు తన ప్రేమను సూపర్‌హిట్ చేస్తాడని బిర్లా బోలెడంత ఆశ పెట్టేసుకున్నాడు. ‘‘ఎలాగైనా నన్నూ, లైలానూ కలిపి పుణ్యం కట్టుకో’’ అని లైలాను తీసుకు రావడానికి వెళ్లాడు బిర్లా.ఈ గ్యాప్‌లో మన దొరబాబు, పళ్లు తీసుకొచ్చిన ఆ ఇంటి పనిమనిషికి లైనేసేయడం మొదలుపెట్టాడు. ‘‘బాలా! ఈ పనులు నీకేలా? ఏది నీ చెయ్యి ఇలా ఇవ్వు. నీ తలరాత మారుస్తా’’ అంటూ ఆమె అరచేతిని తన చేతితో రాస్తూ తెగ ఇదైపోతున్నాడు. ఈలోగా టాటా, బిర్లా, మధ్యలో లైలా ఎంటరయ్యారు. లైలాను చూడగానే స్వామి కళ్లల్లో ఏదో కలవరం. సేమ్ ఫీలింగ్ లైలాలో కూడా! ‘‘మా పెళ్లి ఎప్పుడు జరుగుద్ది’’ అడిగాడు బిర్లా. ‘‘జరగదు... ఈ జన్మలోనే కాదు. ఏ జన్మలోనూ జరగదు’’ అని చాలా కటువుగా చెప్పేశాడు దొరబాబు. ‘‘ఏం ఎందుకు జరగదు! నా లైలా మీద నువ్వు కన్నేశావా ఏంటి?’’ అంటూ బిర్లా ఆక్రోశించాడు. దొరబాబు అగ్గిమీద గుగ్గిలమైపోయాడు. ‘‘ఏంట్రా.. నీ ఎదవ టేస్టూ నువ్వూ.. ప్రేమించడానికి ఇంకెవరూ దొరకలేదా నీకు. పోయి పోయి మగాణ్ణి ప్రేమిస్తావా? అది లైలా కాదు. మస్తాన్. మన సీనియర్’’ అని దొరబాబు చెప్పగానే బిర్లాకు పాపం ఫ్యూజ్ కొట్టేసినట్టయిపోయింది. దొరబాబు ను పట్టుకుని కుయ్యో మొర్రోమని విలపించాడు బిర్లా. ‘‘అందుకేరా... ఆశ పడకూడదు. దోసెతో సరిపెట్టుకోక, వడ కోసం ఎగిరిపడ్డావ్. చివరకు నీ జీవితం అప్పడమైపోయింది’’ అంటూ హితబోధ చేశాడు దొరబాబు. ఆహా... ఎంత మంచి జీవిత సత్యం.క్వార్టర్తోనే ఫుల్ కిక్కిచ్చే జీవిత సత్యం. దీన్ని ఎవరు పాటిస్తే, వాళ్ల లైఫ్... జై తుస్! కృష్ణ భగవాన్ సృష్టించిన పాత్ర ఇది దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డికి కృష్ణభగవాన్, అలీ, నేను అంటే చాలా ఇష్టం. మేం ముగ్గురం లేకుండా అతను దాదాపుగా ఏ సినిమా తీయడు. ‘టాటా-బిర్లా-మధ్యలో లైలా’ సినిమాలో మొదట నాకు పాత్ర లేదు. కానీ ఎలాగైన నాకు పాత్ర క్రియేట్ చేయాలని శ్రీనివాస్‌రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. ఆ రోజు సిట్టింగ్స్‌లో రైటర్స్‌తో పాటు సరదాగా కృష్ణభగవాన్ కూడా కూర్చున్నాడట. తను ‘ఆశ.. దోసె.. అప్పడం.. వడ...’ అంటూ ఓ దొంగ స్వామీజీ కేరెక్టర్ గురించి చెప్పాడట. హీరో శివాజీ, దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డిలకు ఆ పాత్ర బాగా నచ్చేసి, ఈ సినిమాలో వాడాలని డిసైడైపోయారు. అలా ఆ పాత్ర నాకొచ్చింది. ఈ పాత్ర కారణంగా గ్రామీణ ప్రేక్షకులకు కూడా నేను బాగా సుపరిచితం అయిపోయాను. రెండో తరగతి, మూడో తరగతి చదివే చిన్న చిన్న పిల్లలు కూడా నేను కనబడితే నాతో ఫొటో దిగాలని ఆసక్తి చూపిస్తుంటారు. నేనెవరో తెలుసా? అనడిగితే, ‘ఆశ.. దోసె.. అప్పడం.. వడ...’ అని చెబుతుంటారు. చానల్స్‌లో కామెడీ బిట్స్ ద్వారా వాళ్లకి అలా నేను గుర్తుండిపోయాను. ఏది ఏమైనా ఈ పాత్ర నా లైఫ్‌లో కీలకమైన మలుపు. - రఘుబాబు -
కెరీర్ ప్లస్ విత్ రఘుబాబు
-
రెండు నెలలు చలిలో షూటింగ్ చేశాం : రమ్యశ్రీ
నటి రమ్యశ్రీ దర్శకురాలిగా మారి తీసిన తొలి చిత్రం ‘ఓ మల్లి’. టైటిల్ రోల్ ఆమే పోషించారు. ఆర్.ఎ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బి.ప్రశాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆకాశ్, రఘుబాబు, శ్రీధర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని నవీన్‌యాదవ్ ఆవిష్కరించి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, జ్యోతిరెడ్డిలకు అందించారు. ఈ సందర్భంగా రమ్యశ్రీ మాట్లాడుతూ -‘‘ఈ సినిమా కోసం అరకులో దాదాపు రెండు నెలల పాటు చలిలో కష్టపడ్డాం. దీనికి చాలా మంచి పాటలు కుదిరాయి’’ అని తెలిపారు. ఈ సినిమా చేయడానికి మంచి కథే కారణమని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి సునీల్‌కశ్యప్, కృష్ణమూర్తి స్వరాలందించారు. -
'గాల్లో తేలినట్టుందే' స్టిల్స్
-
సినిమా రివ్యూ: జంప్ జిలాని
నటీనటులు: అల్లరి నరేశ్, ఇషా చావ్లా, స్వాతి దీక్షిత్, రావు రమేశ్, పోసాని కృష్ణ మురళి, వేణుమాధవ్, హేమ, రఘుబాబు, కోట శ్రీనివాసరావు దర్శకత్వం: సత్తిబాబు నిర్మాత: అంబికా రాజు సంగీతం: విజయ్ ఎబెనెజెర్ ప్లస్ పాయింట్స్: పర్వాలేదనిపించే క్లైమాక్స్ మైనస్ పాయింట్స్: కథ, కథనం, సినిమా లెంగ్త్ ఎడిటింగ్ మ్యూజిక్ గతంలో తనదైన స్టైల్ తో కామెడీ స్టార్ గుర్తింపు తెచ్చుకున్న 'అల్లరి' నరేశ్ ను ఫ్లాఫ్ లు వెంటాడుతున్నాయి. ఇటీవల విడుదలైన 'లడ్డూబాబు' ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. లడ్డూబాబు తర్వాత ఓ తమిళ చిత్రం 'కలకలప్పు' రీమేక్ మలిచి తెలుగులో 'జంప్ జిలాని' చిత్రంగా ప్రేక్షకులకు అందించారు. సత్తిబాబు దర్శకత్వంలో అల్లరి నరేశ్ సరసన ఇషా చావ్లా, స్వాతి దీక్షిత్ లు నటించిన ఈ చిత్రం జూన్ 12 తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత కొద్దికాలంగా పరాజయాల బారిన పడిన అల్లరి నరేశ్ కు 'జంప్ జిలాని' ఎలాంటి టాక్ సంపాదించుకుందో తెలుసుకోవాలంటే ఓసారి కథలోకి వెళ్లాల్సిందే. సత్తిబాబు, రాంబాబు(అల్లరి నరేశ్) ఇద్దరు కవల పిల్లలు. సత్తిబాబు దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ అయితే, రాంబాబు చిల్లర దొంగతనాలు, పేకాటతో జల్సా చేసే ఓ పోకిరి లాంటోడు. సత్తిబాబు సోదరులకు నిడుదవోలులో ఒకప్పుడు గొప్పగా పేరు చెప్పుకునే సత్యనారాయణ కాఫీ విలాస్ అనే హోటల్ ఉండేది. అయితే కాలక్రమేణ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్ల సంస్కృతి పెరగడంతో హోటల్ నష్టాల్లో కూరుకుపోతుంది. ఎలాగైనా తన వంశానికి గొప్ప పేరు తెచ్చిన హోటల్ కు పూర్వవైభవాన్ని సంపాదించే పట్టుదలతో ఉన్న సత్తిబాబు.. మాధవి(ఫుడ్ ఇన్స్ పెక్టర్)తో ప్రేమలో పడుతాడు. తమ హోటల్ లోనే పనిచేసే తన మరదలు(స్వాతి దీక్షిత్)ను రాంబాబు ప్రేమిస్తుంటాడు. కథ ఇలా సాగుతుండగా.. మాధవి ప్రేమను దక్కించుకోవడానికి సత్తిబాబు రాయలసీమలోని ఓ ప్రాంతానికి వెళ్లాల్సివస్తుంది. అయితే రాయలసీమకు వెళ్లిన సత్తిబాబు విలన్ గ్యాంగ్ వెంటాడుతుంటారు. సత్తిబాబును విలన్ గ్యాంగ్ ఎందుకు వెంటాడుతారు?. సత్తిబాబు, రాంబాబు తమ ప్రేమ వ్యవహారాన్ని పెళ్లి పీటలు ఎక్కించారా? తమ హోటల్ కు పూర్వ వైభవం తెప్పించడంలో సఫలమయ్యారా? అనే ప్రశ్నలకు సమాధానమే 'జంప్ జిలానీ' గతంలో ఎన్నో కామెడి పాత్రలతో ఆలరించిన అల్లరి నరేశ్ సత్తిబాబు, రాంబాబు పాత్రలతో ద్విపాత్రభినయం చేశారు. అయితే గతంలో పోషించిన పాత్రలతో పోల్చితే సత్తిబాబు, రాంబాబుల పాత్రలు విభిన్నమైనవనే ఫీలింగ్ కలుగదు. అల్లరి నరేశ్ రోటిన్ పాత్రలతో ప్రేక్షకులను సంతృప్తి పరించేందుకు ప్రయత్నం చేశారు. ఇషా చావ్లా కొంత ప్రాధాన్యత ఉన్న పాత్ర లభించినా.. ఆ స్థాయిని చేరుకోలేదనే చెప్పవచ్చు. గ్లామర్ తో కూడా ఆకట్టుకోవడంలో ఇషా విఫలమైంది. స్వాతి దీక్షిత్ పాత్ర కేవలం గ్లామర్ కే పరిమితమైంది. రాయలసీమలో ఫ్యాక్షన్ నేతగా పోసాని కృష్ణమురళి తనదైన శైలిలో నటించారు. పాత్రల పరిధి మేరకు రావు రమేశ్ విలనిజంతో కూడిన కామెడీ పండించడంలోనూ తన మార్కును సొంతం చేసుకోలేకపోయారు. రఘుబాబు, వేణుమాధవ్ పాత్రలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. విశ్లేషణ: 'హలో బ్రదర్' లాంటి కాన్సెప్ట్ తో మాస్, క్లాస్ కాంబినేషన్ తో ఈవీవీ చేసిన ప్రయోగాన్ని స్పూర్తిగా తీసుకుని రూపొందించిన సత్తిబాబు, రాంబాబు పాత్రలు ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది. కథ లో పస లేకపోవడం, దానికి తోడుగా కథనం కూడా పేలవంగా ఉండటంతో అంతా గందరగోళంగా మారింది. వేణుమాధవ్, రఘుబాబు పాత్రలు సహజంగా హస్యాన్ని పండించలేకపోగా.. సన్నివేశాల మధ్య అవసరం లేకునా దూరిన ఫీలింగ్ కనిపించింది. ఇక చిత్ర నిడివి కూడా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టడం ఖాయం. తొలిభాగం, ద్వితీయ భాగం ఫ్లాట్ గా నడిపించి... కైమాక్స్ తో మేనెజ్ చేస్తామని ప్లాన్ అంతగా వర్కవుట్ కాలేకపోయింది. ఈ చిత్ర అధిక భాగం విసిగించే రీతిలో సాగిన కొంతలో కొంత క్లైమాక్స్ ప్రేక్షకుడికి కొంత ఊరట కలిగించే అంశం. ఇక మ్యూజిక్ అంశానికి వస్తే తెలుగు నేటివిటి స్పష్టంగా మిస్సయిందనే చెప్పవచ్చు. విజయ్ ఎబెనెజెర్ సంగీతం తెలుగు ప్రేక్షకుల టేస్ట్ కు దూరంగా ఉంది. మారుతున్న ప్రేక్షకుల అభిరుచి అంచనా వేయడంలో సత్తిబాబు తడబాటు గురయ్యారు. పాత చింతకాయ పచ్చడినే 'జంప్ జిలాని' అనే ప్యాక్ అందించారే తప్ప.. పక్కా హస్యాన్ని పంచలేకపోయారు. ఓవరాల్ గా చిత్ర విజయం ఏంటనే ప్రశ్న వేసుకుంటే... బీ, సీ సెంటర్లలో ప్రేక్షకుల ఆదరణ పొందితే తప్ప అల్లరి నరేశ్ ఖాతాలో సక్సెస్ చేరుతుంది. ట్యాగ్: ప్రేక్షకులు 'జంప్ జిలాని' -
ప్రేమ...పగ....
మానస్ హీరోగా సేవియర్ సెల్యులాయిడ్, సంధ్యా మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం పాటల రికార్డింగ్ హైదరాబాద్‌లో మొదలైంది. వెంకటస్వామి దర్శకత్వంలో ఎస్. రవికిషోర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రవిశేషాలను దర్శక, నిర్మాతలు చెబుతూ - ‘‘లవ్, సస్పెన్స్, రివెంజ్, హారర్ సమాహారంతో ఈ చిత్రం ఉంటుంది. ఈ నెల 24న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఇద్దరు నూతన నాయికలు నటించనున్న ఈ చిత్రంలో ఓ మాజీ హీరో విలన్ పాత్ర చేయబోతున్నారు’’ అని చెప్పారు. ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, బెనర్జీ, సూర్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: హనుకాకా, సంగీతం: సాకేత్ నాయుడు.