మా ఇంట్లో పనివారి జీవితాలే అందుకు సాక్ష్యం
ప్రస్తుతం నేను రాజకీయాల్లో లేను...
ఏ పార్టీతోనూ నాకు సంబంధాలు లేవు...
నేను గమనించిన విషయం చెప్తున్నానంతే...
ప్రముఖ సినీ నటుడు రఘుబాబు
తెలుగు నేలకు తేజస్సు వచ్చింది అంటున్నారు ప్రముఖ సినీ నటుడు రఘుబాబు. ‘జగన్ ప్రభుత్వ పరిపాలన గురించి సింపుల్‌గా చెప్పాలంటే ఎక్స్‌ట్రార్డినరీ అంతే. అంతకు మించి చెప్పడానికి మరో మాట నా దగ్గర లేదు.’ అంటూ కుండబద్దలు కొట్టేశారాయన. తాను ప్రస్తు తం రాజకీయాల్లో లేననీ ఏ పార్టీతోనూ ఎటువంటి సంబంధాలు లేవనీ. ఏ అవసరం కోసమైనా అ బద్ధాలు చెప్పాల్సిన అవసరం తనకు లేదంటున్న ఆయన తన సొంత ఊరి లోని తన ఇంట్లో పనిచేసే పనివారి జీవితాల్లో వచ్చిన మార్పే ప్రస్తుత పాలనకు నిదర్శ నం అన్నారు. ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే...
అనూహ్యమైన పాలన ఇది..
నిజంగా జగన్ పరిపాలన ఈ స్థాయిలో ఉంటుందని గత ఎన్నికల ముందు నేను ఏ మాత్రం ఊహించలేదు. ఈ రకమైన అద్భుతమైన మార్పుల్ని నేను ముందుగా ఊహించలేదనేది నిజం. రాష్ట్రంలో మూలాల నుంచి మార్పును జగన్ కోరుకుంటున్నారనేది నాకు అనిపిస్తోంది. ఇప్పుడు మారుమూల ఊళ్లలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు చూస్తుంటే విదేశాల్లోని స్కూల్స్ గుర్తొస్తున్నాయి. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం అంటే అవమానంగా భావించేవారు. ఆ దశ పోయి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు దొరకడం లేదని బోర్డులు పెట్టడం అంటే వాటి గొప్పతనం తెలుస్తుంది. అవి కార్పొరేట్ స్కూల్స్‌కు దీటుగా మారడంతో అంతకు ముందు 20, 30శాతం కూడా విద్యార్ధులు కనిపించని పరిస్థితి నుంచి ఇప్పుడు 100శాతం ఆక్యుపెన్సీ నేను గమనించాను.
మా సొంత ఊళ్లో... ఎంత మార్పో !
మాది ప్రకాశం జిల్లాలోని రావినూతల గ్రామం. తరచుగా మా ఊరుకు వెళుతుంటాం. దాంతో ఆ గ్రామంలో వచ్చిన మార్పులు ఎన్నో మాకు తెలుస్తున్నాయి. గ్రామ సచివాలయాలు కావచ్చు, వలంటీర్లు ఇళ్లకు రావడం... ప్రభుత్వ పథకాలు, ప్రతీదీ ఇంటికి తీసుకొచ్చి అందించడం గొప్పగా అనిపిస్తోంది. అక్కడ మా ఇంట్లో పనిచేసే పనివాళ్ల పిల్లలు కూడా ప్రభుత్వ పథకాల ప్రయోజనాల్ని ఉపయోగించుకుని దర్జాగా రాజమండ్రిలోని ఇంజినీరింగ్ కాలేజ్‌లో చదువుకోగలుగుతున్నారు. ఇది మేం ఊహించని మార్పు.
మేం వాళ్లు చేసే పనికి తగ్గ జీతాలు ఇచ్చినా... అడపాదడపా అదనంగా ఆర్థిక సాయం చేసినా కూడా వాళ్ల జీవితాల్ని సమూలంగా మార్చలేం. ఇప్పుడు అమలవుతున్న ప్రభుత్వ పథకాల వల్ల వాళ్ల జీవితాలు మారిపోతున్నాయి. పిల్లలు బాగా చదువుకోగలగడం వల్ల ఎన్నడూ చూడనంత ఆత్మవిశ్వాసం వారిలో కనిపిస్తోంది. ఇది మాకు చాలా ఆనందాన్ని అందిస్తోంది. ఈ పథకాలు ఇలాగే కొనసాగాలని, ఈ పాలన పేదలకు మరింత కాలం మేలు కలుగజేయాలని కోరుకుంటున్నాను.
–సత్యార్థ్
Comments
Please login to add a commentAdd a comment