
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హీట్ నడుస్తోంది. అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష పార్టీలు ప్రచారం, నామినేషన్ల హడావుడిలో ఉన్నాయి. మరోవైపు హీరో విశాల్ లాంటి వాళ్లు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి తమ మద్ధతు తెలుపుతున్నారు. మరోసారి అధికారంలోకి రాబోయేది వైసీపీనే అని అభిప్రాయపడుతున్నారు. తాజాగా 'కేజీఎఫ్' నటుడు రామచంద్రరాజు అదే చెప్పుకొచ్చారు. వైసీపీకే తన మద్ధతు అని ప్రకటించారు.
(ఇదీ చదవండి: చిరు, పవన్ సినిమాల వల్ల అన్యాయం.. ప్రముఖ నటుడు ఆవేదన)
కన్నడ నటుడు యశ్ దగ్గర పనిచేసిన రామచంద్రరాజు.. 'కేజీఎఫ్' సినిమాలో గరుడ అనే విలన్ పాత్రతో నటుడిగా మారాడు. ఆ తర్వాత తెలుగులోనూ పలు సినిమాలు చేశారు. తాజాగా ఈయన.. ఆంధ్రప్రదేశ్ లోని రైల్వే కోడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోరముట్ల శ్రీనివాసులు నామినేషన్ సందర్భంగా కనిపించారు. తనకు ఈయన అన్నలాంటి వాడని చెప్పుకొచ్చారు. అలానే వైసీపీ పాలనపైనా తన మనసులోని మాటల్ని బయటపెట్టారు.
'నామినేషన్‌కి ఇంతమంది జనాలు వస్తారని అనుకోలేదు. దాదాపు 20-30 వేల మెజరిటీతో నా స్నేహితుడు ఎన్నికల్లో గెలుస్తారని అనిపిస్తుంది. జగన్ పాలన చూస్తే నాకు ముచ్చటేస్తోంది. వైసీపీకే నా మద్ధతు. విద్య, వైద్య రంగాల్లో చాలా అభివృద్ధి చేశారు. నిస్పక్షపాతంగా ప్రజాసేవ చేస్తున్నారు. దీనికి నేను హ్యాట్సాఫ్ చెబుతాను' అని నటుడు రామచంద్రరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు.
(ఇదీ చదవండి: ఈమె స్టార్ హీరోయిన్‌కి అక్క.. ఆర్మీలో 12 ఏళ్లుగా దేశసేవ.. గుర్తుపట్టారా?)
Read this article in English : KGF Actor Hails CM Jagan's Rule and AP's Development