Ramachandra Raju
-
వైఎస్సార్సీపీకే నా మద్ధతు.. 'కేజీఎఫ్' నటుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హీట్ నడుస్తోంది. అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష పార్టీలు ప్రచారం, నామినేషన్ల హడావుడిలో ఉన్నాయి. మరోవైపు హీరో విశాల్ లాంటి వాళ్లు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి తమ మద్ధతు తెలుపుతున్నారు. మరోసారి అధికారంలోకి రాబోయేది వైసీపీనే అని అభిప్రాయపడుతున్నారు. తాజాగా 'కేజీఎఫ్' నటుడు రామచంద్రరాజు అదే చెప్పుకొచ్చారు. వైసీపీకే తన మద్ధతు అని ప్రకటించారు.(ఇదీ చదవండి: చిరు, పవన్ సినిమాల వల్ల అన్యాయం.. ప్రముఖ నటుడు ఆవేదన)కన్నడ నటుడు యశ్ దగ్గర పనిచేసిన రామచంద్రరాజు.. 'కేజీఎఫ్' సినిమాలో గరుడ అనే విలన్ పాత్రతో నటుడిగా మారాడు. ఆ తర్వాత తెలుగులోనూ పలు సినిమాలు చేశారు. తాజాగా ఈయన.. ఆంధ్రప్రదేశ్ లోని రైల్వే కోడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోరముట్ల శ్రీనివాసులు నామినేషన్ సందర్భంగా కనిపించారు. తనకు ఈయన అన్నలాంటి వాడని చెప్పుకొచ్చారు. అలానే వైసీపీ పాలనపైనా తన మనసులోని మాటల్ని బయటపెట్టారు.'నామినేషన్‌కి ఇంతమంది జనాలు వస్తారని అనుకోలేదు. దాదాపు 20-30 వేల మెజరిటీతో నా స్నేహితుడు ఎన్నికల్లో గెలుస్తారని అనిపిస్తుంది. జగన్ పాలన చూస్తే నాకు ముచ్చటేస్తోంది. వైసీపీకే నా మద్ధతు. విద్య, వైద్య రంగాల్లో చాలా అభివృద్ధి చేశారు. నిస్పక్షపాతంగా ప్రజాసేవ చేస్తున్నారు. దీనికి నేను హ్యాట్సాఫ్ చెబుతాను' అని నటుడు రామచంద్రరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు.(ఇదీ చదవండి: ఈమె స్టార్ హీరోయిన్‌కి అక్క.. ఆర్మీలో 12 ఏళ్లుగా దేశసేవ.. గుర్తుపట్టారా?)Read this article in English : KGF Actor Hails CM Jagan's Rule and AP's Development -
Ramachandra Raju-Jeest : తిరుమలలో కేజీఎఫ్ విలన్, బెంగాలీ స్టార్ నటుడు సందడి (ఫోటోలు)
-
ఒక వ్యక్తి.. మూడు పదవులు
నూజివీడు: టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒకే వ్యక్తి మూడు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇప్పటికీ ఆ మూడింటినీ నిర్వహిస్తూనే ఉన్నారు. ఆయన ఎవరో కాదు.. రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయా (ఆర్జీయూకేటీ)నికి వైస్ చాన్స్‌లర్‌గా పని చేస్తున్న ఆచార్య వేగేశ్న రామచంద్రరాజు. ఆయన ఆర్జీయూకేటీ వీసీగా పనిచేస్తుండగానే గత అక్టోబర్ నెలలో ఆర్జీయూకేటీ చాన్సలర్‌గా ఉన్న ఆచార్య డి.రాజ్‌రెడ్డి పదవీకాలం ముగియడంతో రామచంద్రరాజుకే ఇన్చార్జ్ చాన్స్‌లర్ (ఎఫ్ఏసీ)గా బాధ్యతలను అప్పగించింది టీడీపీ ప్రభుత్వం. తరువాత కృష్ణా వర్సిటీ వీసీ పదవి ఖాళీ కావడంతో ఆయననే ఆ యూనివర్సిటీకి కూడా ఇన్చార్జ్ వీసీగా గత ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆర్జీయూకేటీ చాన్స్‌లర్‌గా రాజ్ రెడ్డి పదవీకాలం గతేడాది అక్టోబర్ 20తో ముగియగా, ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తారని అందరూ భావించగా, అనూహ్యంగా ఇన్చార్జ్ చాన్స్‌లర్‌గా రామచంద్రరాజు నియమితులయ్యారు. అస్తవ్యస్తంగా మారిన ఆర్జీయూకేటీ మూడు బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రస్తుత వీసీ హయాంలో ఆర్జీయూకేటీ పరిధిలోని ట్రిపుల్‌ఐటీల అభివృద్ధి ఏమాత్రం జరగకపోగా పాలన అస్తవ్యస్తంగా తయారైంది. నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్ఐటీలలో టీడీపీ నాయకులతో పాటు ఆగిరిపల్లి మండలంలోని ఒక ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ చెప్పిన వారికల్లా అవసరం లేకపోయినా ఇష్టారాజ్యంగా ఉద్యోగాలు ఇచ్చేశారు. ఒక్క శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలోనే ఆఫీసులలో పనిచేసే నాన్‌టీచింగ్ స్టాఫ్ దాదాపు 170 మంది ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వీసీ కార్యాలయంలో సైతం టీడీపీ నాయకులు చెప్పిన వారినల్లా నియమించుకున్నారు. ఈ నియామకాలు నిబంధనల మేరకు జరగలేదు. ఆర్జీయూకేటీ గవర్నింగ్ కౌన్సిల్ అప్రూవల్ కూడా లేదు. గత మూడేళ్లుగా నూజివీడు ట్రిపుల్‌ఐటీలో మెస్‌ల నిర్వహణకు టెండర్లను ఖరారు చేయకుండా నామినేషన్ పద్ధతిపైనే కొనసాగిస్తున్నారు. ఏటా టెండర్లు పిలవడం, సీఎంవో నుంచి ఫోన్ వచ్చిందంటూ నిలిపివేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇన్చార్జ్ చాన్స్‌లర్, వైస్‌చాన్స్‌లర్ ఒక్కరే కావడంతో నియంతృత్వ పోకడలు కూడా ఎక్కువయ్యాయనే ప్రచారం కూడా జరుగుతోంది. -
నాకు నచ్చిన ఐదు పుస్తకాలు
అనుక్షణికం (వడ్డెర చండీదాస్) ఆత్మన్యూనతా భావంతో కొట్టుమిట్టాడుతున్న నన్ను శ్రీపతి, గంగినేని రవి, మోహన్‌రెడ్డి, గాయత్రి, స్వప్నరాగలీన పాత్రలు సేదతీర్చాయని చెప్పడానికి సిగ్గుపడను. రచయిత ఎక్కడా కనబడకుండా పాత్రలతో పలికించిన అనేక భావాలు, ఆ వెల్లడించిన తీరు జీవితంలో నాకెంతో ధైర్యాన్నీ, సంఘం మీద ఒక అవగాహననూ ఇచ్చాయి. అందుకే చండీదాస్ మీద కృతజ్ఞతగా నా కుమార్తె పేరు ‘హిమజ్వాల’ అని పెట్టుకున్నాను. చివరకు మిగిలేది(బుచ్చిబాబు) ‘‘చివరకు మిగిలేది’ చదివే నేను డిగ్రీలోనూ, పీజీలోనూ ఫిలాసఫీ చదివాను’ అంటాడు చండీదాస్. నేను ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడే రేడియోలో విన్నట్లు గుర్తు. తర్వాత రెండేళ్లకు పుస్తకంగానూ చదివాను. ఏదో తెలియని బాధ, అశాంతి, ఒక రకమైన వేదన అనుభవించాను. ఆ తర్వాత ఎన్నోసార్లు చదివాను. ఆ గాఢత తగ్గింది లేదు. ఇప్పటికీ మొదలుపెడితే ఆపలేను. దయానిధి, అమృతం, కోమలి కళ్లెదురుగా కదలాడుతున్నట్లే వుంటుంది. పథేర్ పాంచాలి (బిభూతిభూషణ్ బంధోపాధ్యాయ) పశ్చిమ బెంగాల్‌లోని ఒక పల్లెలో ఆ పేద బ్రాహ్మణ కుటుంబం, కట్టెలా వుండే ఆ ముసలమ్మ, ఆ ఇల్లాలు బిడ్డలకు ఆహారం పెట్టడానికి పడే తపన, వంట సామగ్రిని విధిలేక విక్రయించడం, అక్క దుర్గ, తమ్ముడు అపు కొత్తగా వచ్చే రైలును వింతగా చూడటం, ఆ ఇంటి యజమాని ఎక్కడో వైదికం చేసుకుంటూ ఇంటికి వచ్చి కూతురి కోసం వెతకడం, భార్య ‘ఇంకెక్కడి కూతురు... జ్వరంతో కాలంచేసిం’దని పొగిలి పొగిలి ఏడవడం, చివరికి వారు ఆ వూరు విడిచి వెళ్లిపోవడంతో క«థ ముగిసేటప్పటికి గుండె బరువెక్కి ఓ పదిరోజులు బ్రతుకు భారంగా గడిచింది. అన్నా కరేనినా (లియో టాల్‌స్టాయ్) ప్రపంచ సాహిత్యంలో టాల్‌స్టాయ్ ఎంత గొప్ప రచయితో ‘వార్ అండ్ పీస్’ చదివిన వాళ్లకు తెలుసు. కాని ఒక జీవితం, ఒక సంసారం, ఒక సమాజం అంటే ఏమిటో నాకు తెలియజెప్పిన నవల మాత్రం ‘అన్నా కరేనినా’. ఇంటర్మీడియెట్‌లో ఉన్నప్పుడే పెద్దగా ఇంగ్లిష్ రాకపోయినా నిఘంటువు పక్కన పెట్టుకుని చదివాను. అన్నాను పీటర్స్బర్గ్ స్టేషన్లో చూసింది మొదలు వ్రోన్స్కీ పడే తపన ఆ తర్వాత జరిగిన కథ ఎంతో పరిణతితో రాశాడు రచయిత. అన్నా కళ్ళలో ఆ గ్రేస్‌నెస్, ఆ సౌందర్యంలో వుండే నిగూఢమైన ఆకర్షణ, ఆ వివరించిన పద్ధతి అనితర సాధ్యం. చిత్రసుందరి (అఖిలన్) ఈ తమిళ నవలను మధురాంతకం రాజారాం అద్భుతంగా తెలుగులోకి అనువదించారు. అన్నామలై మేనమామ సహాయంతో చదువుకొని, తన ఇష్టాలను కాదనుకొని, కోర్కెలతో అర్రులుచాచే మేనమామ కుమార్తె సుందరిని పెళ్ళాడి, ఆమె అనుమానాలు సాధింపులు పట్టింపులు భరించలేక క్రుంగిపోతాడు. అతడి మీద కసితీర్చుకోవాలని సుందరి ఆత్మహత్యతో అంతమౌతుంది. అన్నా కరేనినాకూ చిత్రసుందరికీ పోలికలున్నాయని అనిపిస్తుంది. డి.రామచంద్రరాజు 9908324214