
మంచు విష్ణు హీరోగా నటించిన సినిమా కన్నప్ప(Kannappa Movie). ఏప్రిల్ 25న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ జరుగుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో ఈ మూవీపై ట్రోల్స్ వస్తున్నాయి. ఇదివరకే విష్ణు ఈ విషయమై స్పందించగా.. ఇప్పుడు నటుడు రఘుబాబు (Raghu Babu) మాత్రం వింత కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
'ఈ సినిమా గురించి ఎవరైనా ట్రోల్ చేశారంటే చెబుతున్నా ఇప్పుడే.. శివుడి ఆగ్రహానికి, శాపానికి గురవుతారు. గుర్తు పెట్టుకోండి. ఎవరైనా 100 శాతం కరెక్ట్ ఇది. ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరు ఫినిష్' అని నటుడు రఘుబాబు తాజాగా జరిగిన ఈవెంట్ లో అన్నారు. ఇది విన్న నెటిజన్స్ షాకవుతున్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలో హారర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్)
ఎందుకంటే గతంలో ఈ చిత్ర టీజర్ రిలీజైనప్పుడు దారుణమైన ట్రోలింగ్ జరిగింది. దీంతో పలువురు యూట్యూబర్స్ పై హీరో, నిర్మాత మంచు విష్ణు (Manchu Vishnu) సీరియస్ అయ్యాడనే టాక్ వినిపించింది. ఆ తర్వాత మరో టీజర్ రిలీజ్ చేశారు. రెండు పాటలు కూడా విడుదల చేశారు. కాకపోతే ఈసారి అంత నెగిటివిటీ రాలేదు. ఎక్కడో చోట ట్రోలింగ్ జరుగుతుంది. అంతమాత్రాన దేవుడి పేరు చెప్పి శాపానికి గురవుతారని భయపెట్టడం ఏంటో అర్థం కావట్లేదు.
కంటెంట్ లో దమ్ముంటే సినిమాని ఎంత ట్రోల్ చేసినా సరే హిట్ అవుతుంది. కన్నప్ప మూవీలోనూ ప్రభాస్ (Prabhas), మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ ఉన్నారు. కాబట్టి హిట్ అవ్వొచ్చేమో చెప్పలేం. కానీ ఇలా శాపానికి గురవుతారని భయపెట్టడం మాత్రం కాస్త వింతగా ఉందని చెప్పొచ్చు.
(ఇదీ చదవండి: ఆ బాలనటి గుర్తుందా? ఇప్పుడు పెళ్లికూతురయ్యింది!)