రెండు నెలలు చలిలో షూటింగ్ చేశాం : రమ్యశ్రీ | Actress ramya sri new movie O Malli | Sakshi
Sakshi News home page

రెండు నెలలు చలిలో షూటింగ్ చేశాం : రమ్యశ్రీ

Published Sat, Feb 28 2015 10:56 PM | Last Updated on Sat, Sep 2 2017 10:05 PM

రెండు నెలలు చలిలో షూటింగ్ చేశాం :  రమ్యశ్రీ

రెండు నెలలు చలిలో షూటింగ్ చేశాం : రమ్యశ్రీ

నటి రమ్యశ్రీ దర్శకురాలిగా మారి తీసిన తొలి చిత్రం ‘ఓ మల్లి’. టైటిల్ రోల్ ఆమే పోషించారు. ఆర్.ఎ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బి.ప్రశాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.  ఆకాశ్, రఘుబాబు, శ్రీధర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని నవీన్‌యాదవ్ ఆవిష్కరించి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, జ్యోతిరెడ్డిలకు అందించారు. ఈ సందర్భంగా రమ్యశ్రీ మాట్లాడుతూ -‘‘ఈ సినిమా  కోసం అరకులో దాదాపు రెండు నెలల పాటు చలిలో కష్టపడ్డాం. దీనికి  చాలా మంచి పాటలు కుదిరాయి’’ అని తెలిపారు. ఈ సినిమా చేయడానికి మంచి కథే కారణమని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి సునీల్‌కశ్యప్, కృష్ణమూర్తి స్వరాలందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement