Ramya Sri
-
నా నీ ప్రేమకథ సినిమా రివ్యూ
రివ్యూ : ‘నా నీ ప్రేమ కథ’ తారాగణం : అముద శ్రీనివాస్, కారుణ్య చౌదరి, రమ్య శ్రీ, అజయ్ ఘోష్, షఫీ, ఫిష్ వెంకట్, అన్నపూర్ణమ్మ తదితరులు రచన, దర్శకత్వం: అముద శ్రీనివాస్ కెమెరా : ఎంఎస్ కిరణ్ కుమార్ సంగీతం : ఎమ్ ఎల్ పి రాజా ఎడిటర్ : నందమూరి హరి నిర్మాణం: పిఎస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: పోత్నాక్ శ్రవణ్ కుమార్ కథ నాని (అముద శ్రీనివాస్) చిన్న గ్రామంలో పేపర్‌బాయ్‌గా పని చేస్తాడు. అజయ్ ఘోష్ గ్రామ పెద్ద. ఆయన కూతురు నందిని (కారుణ్య) హైదరాబాద్‌లో డాక్టర్ చదివి, స్వగ్రామంలో ఆసుపత్రిని నిర్మించి గ్రామ ప్రజలకు సేవ చేయాలని సొంతూరుకి తిరిగొస్తుంది. నాని నందినిని ప్రేమిస్తాడు. గుణ(షఫీ) కూడా నందినిని ప్రేమిస్తాడు. ఈ విషయం తెలుసుకుని నందిని తండ్రి నాయుడు (అజయ్ ఘోష్) నానిని చంపాలనుకుంటాడు. అదే అమ్మాయిని ప్రేమిస్తున్న గుణ (షఫి) నాని రక్షిస్తాడు. తను ప్రేమిస్తున్న అమ్మాయిని మరో వ్యక్తి ప్రేమిస్తున్నాడని తెలిసి కూడా అతన్ని రక్షించడం.. తనలో వచ్చిన మార్పా? లేక నమ్మించి గొంతు కోసేందుకు ప్లాన్ చేశాడా? తర్వాత ఏం జరిగింది? చివరికి నాని, నందిని పెళ్లి చేసుకున్నారా? లేదా? అన్నది మిగతా కథ. విశ్లేషణ ఇది ముగ్గురి మధ్య సాగే ట్రయాంగిల్ లవ్ స్టోరీ. నానిని రక్షించిన సమయంలో గుణలో వచ్చిన మార్పు, దాని వెనకున్న సస్పెన్స్‌ను దర్శకుడు బాగా డీల్ చేశాడు. అయితే ఇక్కడ దర్శకుడే హీరో కావడం సినిమాకు కొంత మైనస్‌గా మారింది. అటు హీరో పని, ఇటు దర్శకుడి బాధ్యత రెండూ తన భుజాన వేసుకోవడంతో అక్కడక్కడా పట్టు తప్పిపోయాడు. రెండింటిని సక్రమంగా నిర్వర్తించాలన్న ఒత్తిడి ఎక్కువ కావడంతో అక్కడక్కడా డైరెక్షన్ మీద పట్టు తప్పినట్లు అనిపిస్తుంది. హీరో పాత్రలో బాగానే నటించాడు, కానీ హీరో స్థానంలో మరొకరిని తీసుకుని ఉండుంటే అతని మీద ఒత్తిడి తగ్గి అవుట్‌పుట్ ఇంకాస్త మెరుగ్గా వచ్చేది. గ్రామీణ ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా అముద శ్రీనివాస్, కారుణ్య చౌదరి పర్వాలేదనిపించారు. సిటీలో డాక్టర్ చదివి వచ్చినప్పటికీ గ్రామీణ మూలాలు మరచిపోకుండా సాంప్రాదాయంగా కనిపించడంలో కారుణ్య వంద శాతం సక్సెస్ అయింది. షఫీ గుణ పాత్రలో చక్కగా సెట్టయ్యాడు. అజయ్‌ఘోష్ తదితరులు తమ పాత్రల మేరకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకు వస్తే... దర్శకుడు ప్రేమ, భావోద్వేగపు సన్నివేశాలను అద్భుతంగా మలచాలని ప్రయత్నించాడు, కానీ కొంతమేరకే సఫలీకృతమయ్యాడు. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. కెమెరా పనితీరు బానే ఉంది. కానీ, సినిమాలో అక్కడక్కడా దృశ్యాలు డల్‌గా అనిపించాయి. ఎడిటింగ్ పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగా కుదిరింది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ బాగుంది. నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడినట్లు అనిపించదు. రొటీన్ ప్రేమకథే కావడంతో చాలా సన్నివేశాలను ప్రేక్షకుడు ముందుగానే పసిగట్టేస్తాడు. చదవండి: Kushi Movie Review: ‘ఖుషి’మూవీ రివ్యూ -
రమ్యానే పిలిచినట్టు అనిపిస్తోంది..
తూర్పుగోదావరి,తాడితోట (రాజమహేంద్రవరం): డాడీ! అని ఎవరు పిలిచినా మా అమ్మాయే పిలిచినట్టు అనిపిస్తోందని బోటు ప్రమాదంలో గల్లంతైన మంచిర్యాలకు చెందిన రమ్యశ్రీ తండ్రి సుదర్శన్ పేర్కొన్నారు. ఈనెల 15న దేవీపట్నం మండలం కుచ్చులూరులో జరిగిన బోటు ప్రమాదంలో మంచిర్యాలకు చెందిన విద్యుత్‌శాఖ ఏఈ కారుకూరి రమ్యశ్రీ గల్లంతైంది. పది రోజులుగా ఆమె ఆచూకీ కోసం ఎదురుచూసిన తల్లిదండ్రులు, ఎంతకీ లభ్యం కాపోవడంతో మృతదేహం దొరకకుండానే, మరణించిందని భావించి ఆమె ఆత్మశాంతి కోసం 11వ రోజైన బుధవారం రాజమహేంద్రవరం కోటిలింగాల రేవులో గోదానం చేసి, కర్మకాండలు నిర్వహించారు. ఈ సందర్భంగా రమ్యశ్రీ తండ్రి సుదర్శన్ మాట్లాడుతూ 10 రోజులుగా మృతదేహం కోసం ఎదురుచూశామని, దొరికిన మృతదేహాలు గుర్తు పట్టడానికి వీలులేకుండా ఉన్నాయన్నారు. తన కుమార్తె మృతదేహం వస్తుందో! రాదో! తెలియని అయోమయ పరిస్థితుల్లో 11వ రోజు కర్మకాండ నిర్వహించకపోతే ఆమె ఆత్మకు శాంతి చేకూరదని పండితులు చెప్పడంతో ఆమె ఆత్మశాంతి కోసం కర్మకాండ నిర్వహించామని తెలిపారు. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నామని, విద్యుత్ శాఖలో ఏఈగా పని చేస్తుండేదని తెలిపారు. బోటు దిగిన తరువాత ఫోన్ చేస్తానంటూ మెసేజ్ పెట్టిందని, కడసారి చూపు కూడా చూడకుండానే వెనుదిరిగి వెళ్లాల్సి వస్తోందని రమ్యశ్రీ తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. రమ్యశ్రీ తల్లి భూలక్ష్మి కర్మకాండలు ముగిసినా తన కుమార్తెను తలచుకుంటూ కోటిలింగాల రేవులోనే ఎక్కువ సమయం ఉండిపోయారు. మృతదేహానికి డీఎన్ఏ పరీక్షలు వాడపల్లి వద్ద మంగళవారం లభించిన పురుషుడి మృతదేహం తమదంటే తమదని ఇరుకుటుంబాల బంధువులు అంటున్నారు. కాకినాడకు చెందిన బోటు డ్రైవర్ పోతాబత్తుల సత్యనారాయణ(60) మృతదేహంగా అతడి కుమారుడు పొతాబత్తుల కుమార్ చెబుతుండగా, బోటులో సహాయకుడిగా పనిచేస్తున్న పాత పట్టిసీమకు కర్రి మణికంఠ మృతదేహంగా అతడి తండ్రి, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మృతదేహానికి గురువారం డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. మృతదేహాల కోసం ఎదురుచూపులు.. తమ కుటుంబ సభ్యులు, బంధువుల మృతదేహాల కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పలువురు ఎదురు చూపులు చూస్తున్నారు. రమ్యశ్రీ మృతదేహం కోసం ఆమె తల్లిదండ్రులు, బోటు డ్రైవర్లు పోతాబత్తుల సత్యనారాయణ, నూకరాజు మృతదేహాల కోసం వారి కుటుంబ సభ్యులు నిరీక్షిస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన అంకం పవన్‌కుమార్, అతడి భార్య వసుంధరా భవానీ మృతదేహాల కోసం అతడి మేనమామ మట్టా రాజేంద్ర ప్రసాద్ ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి చేరని మహిళ మృతదేహం బుధవారం రాత్రి సీతానగరం ఎస్సైకు మహిళ మృతదేహం అప్పగించినట్టు ప్రచారం జరిగింది. అయితే ఆ మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువస్తారని మృతుల కుటుంబాల వారు ఎదురుచూసినా రాత్రి వరకు రాకపోవడంతో నిరాశ చెందారు. ఆ మృతదేహం బోటు ప్రమాదంలో మృతిచెందిన వారిది కాదేమోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
జగన్‌తోనే రాజన్న రాజ్యం
సీతమ్మధార(విశాఖ ఉత్తర): వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డితోనే రాజన్న రా జ్యం వస్తుందని సినీనటి రమ్యశ్రీ అన్నారు. ఈ మేరకు ఆమె సాక్షితో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి జగన్మోహన్రెడ్డి 3600కిలోమీటర్ల పాదయా త్ర చేశారన్నారు. రాజన్న రాజ్యంకోసం ప్రతి ఒక్క రూ ఫ్యాన్ గుర్తుకు ఓటువేయాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ ప్రలోభాలకు లొంగవద్దు టీడీపీ నాయకులు డబ్బులు ఇచ్చి ఓటు వేయాలని ప్రమాణాలు చేయించుకోవడం బాధాకరమన్నారు. దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి గణేష్‌కుమార్ ఓటర్లను ప్రలోభపెట్టాలని చూ స్తున్నారని.. ఈ సారి బుద్ధి చె ప్పడం ఖాయమన్నారు. ఉత్తర నియోజకవర్గంలో పోటీ చేస్తు న్న మంత్రి గంటా శ్రీనివాసరావు రెండు రోజుల కిందట వెలమ సామాజిక వర్గానికి డబ్బుతో కొనుగోలు చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారని .. వెలమలు ఎప్పడు న్యాయం వైపు ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. గంటాకు నీతి, నిజాయితీ లేకుండా ఐదేళ్లకు ఒక సారి నియోజవర్గాలు మార్చిన వ్యక్తి మనకు అవసరమా అని అన్నారు. బీసీలకు అండగా ఉన్న నాయకుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అని.. మేనిఫెస్టోలో బీసీలకు పెద్దపీట వేశారన్నారు. ప్రతి ఒక్కరు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి 119 ఎమ్మెల్యే సీట్లు, 23 ఎంపీలు సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. -
చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలి
అరకులోయ: తప్పుడు హమీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని సినీ నటి రమ్యశ్రీ పిలుపునిచ్చారు. గురువారం అరకు అసెంబ్లీ వైఎస్సార్సీపీ అభ్యర్థి చెట్టి ఫాల్గుణ నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు. వైఎస్ ఆశయసాధనకు అలుపెరుగని పోరాటం చేస్తున్న జగన్మోహన్రెడ్డి నాయకత్వం పట్ల ఆకర్షితురాలై పార్టీలో చేరానన్నారు. చంద్రబాబు స్వార్థపూరిత రాజకీయాల వల్ల ఏపీకి ప్రత్యేకహోదా రాలేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమన్నారు. మాట్లాడుతున్న సినీనటి రమ్యశ్రీ పాదయాత్రలో ఆయన అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకుని నవరత్నాలు ప్రకటించారన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలూ పాటుపడుతున్న జగన్మోహన్రెడ్డిని సీఎం చేయాలని కోరారు. టీడీపీ పాలనలో గిరిజన ప్రాంతాలు అన్నిరంగాల్లో వెనుకుబాటుకు గురయ్యాయని విమర్శించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి తమ పార్టీతోనే సాధ్యమన్నారు. అరకు పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో పోటీచేస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అరకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తెడబారికి సురేష్‌కుమార్, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి చెట్టి వినయ్ పాల్గొన్నారు. -
సినీ నటి రమ్యశ్రీకి డాక్టరేట్ ప్రదానం
పెందుర్తి: సినీ నటి రమశ్రీకి డాక్టరేట్ లభించింది. అమెరికా లోని ఫిలాంథ్రోఫిక్ సొసైటీ నేషనల్ డీమ్డ్ యూనివర్సిటీ విజ యవాడలోని ఐలాపురం కన్వెషన్ హాల్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె కు డాక్టరేట్ ప్రదానం చేశారు. సినీ నటిగా, దర్శక నిర్మాతగా రమ్యశ్రీ కళారంగానికి అందించిన సేవలకుగాను ఈ డాక్టరేట్‌తో అభినందించారు. రమ్య హృదయాల ఫౌండేషన్ ద్వారా గత పదేళ్ల నుంచి యాచకులు, వృద్ధులు, వికలాంగులకు ఆమె అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా అభినందించారు. రమ్యమైన హృదయంతో రమ్య హృదయాల ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని కొనియాడారు. సినీ నటిగా రాణిస్తూనే సామాజిక బాధ్యతగా రమ్యశ్రీ మెడికల్ క్యాంపులు, క్యాన్సర్‌పై చైతన్యం, బీపీ, సుగర్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. -
ప్రతిపక్ష నేతకు రక్షణ కల్పించలేకపోతే ఎలా?
విశాఖపట్నం జిల్లా / పెందుర్తి: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఈ నెల 25న విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగితే ఇప్పటి వరకు పోలీసులు, ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు నిజాలు వెల్లడించలేకపోయారని సినీనటి రమ్యశ్రీ అన్నారు. పెందుర్తిలో ఆమె శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్ల ప్రభుత్వం, పోలీసులు అనుసరిస్తున్న వైఖరి అనేక అనుమానాలకు తావిస్తుందన్నారు. అలాంటి ప్రజాదరణ కలిగిన వ్యక్తులకే రక్షణ కల్పించలేని ప్రభుత్వం ఇక తమలాంటి వారికి, సామాన్యులకు ఎలా రక్షణ కల్పిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుని వెనుక ఎంతటి హోదా కలిగిన వ్యక్తులు ఉన్నా కఠినంగా శిక్షించి న్యాయవ్యవస్థ నిజాయితీని దేశ ప్రజలకు చాటాలన్నారు. ఇలాంటి రాజకీయ హత్యలకు పాల్పడిన వారు బాగుపడిన సందర్భాలు చరిత్రలో లేవన్నారు. -
టీడీపీకి రమ్యశ్రీ గుడ్ బై
పశ్చిమ గోదావరి, పెరవలి : పెరవలి జెడ్పీటీసీ సభ్యురాలు అతికాల కుసుమాంజలీ రమ్యశ్రీ తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజీనామా చేశారు. ఖండవల్లిలోని స్వగృహంలోవిలేకర్లతో ఆమె మాట్లాడుతూ పార్టీలో గుర్తింపు అంతంత మాత్రంగా ఉండటంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి సహకారం లభించక విసుగెత్తి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. గత కొంత కాలంగా పార్టీలో ఉన్నా అధికార కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న రమ్యశ్రీ గురువారం సాయంత్రం పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామాను ఫ్యాక్స్‌లో జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మికి పంపిస్తున్నట్లు తెలిపారు. ఆమెతో పాటు మండల తెలుగు యువత అధ్యక్షుడు గడుగోయిల ఫణికృష్ణ, వెంకట్రాయపురం గ్రామ ఉప సర్పంచ్ దేవా పవన్‌లు కూడా టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. -
చనిపోయే వరకూ జనంలోనే ఉంటా : నటి
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): ‘ఎంత కాలం బతికాం.. ఎంత సంపాదించామన్నది కాదు.. మన కడసారి ప్రయాణంలో మన కోసం ఎంత మంది కన్నీరు పెట్టారన్నది ప్రధానం.. నేను చనిపోయినా జనంలోనే ఉండాలి.. అభిమానులు నాకోసం ఏడవాలి.. అదే నా కోరిక..’ అని సినీ నటి రమ్యశ్రీ అన్నారు. వేపగుంట ఉన్నత పాఠశాలలో శనివారం రమ్య హృదయాంజలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ముచ్చటించారు. తన జీవిత అనుభవాలు, ఆశయాలను వివరించారు. 300 సినిమాల్లో నటించాను కోరుకున్న ప్రియుడితో హీరోయిన్ స్నేహితురాలిగా సినీ రంగ ప్రవేశం చేశాను. సూపర్ స్టార్ కృష్ణ సరసన ‘ఎవరు నేను’ చిత్రంలో తొలిసారిగా హీరోయిన్గా నటించాను. ఆ సినిమా నా నట జీవితానికి టర్నింగ్ పాయిం ట్. ఆ తర్వాత ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయి. దీనికి ముందు కన్నడ చిత్రం ఇంద్రజలో జ్యోతిలక్ష్మి కూతురుగా చేశా. అది హిట్టయింది. తెలుగు, కన్నడ , తమిళ, మలయాళం, ఒడియా, హిందీ, బోజ్‌పురి, పంజాబీ భాషల్లో 300 సినిమాల్లో నటించాను. తెలుగులో నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, నువ్వునేను, ఆది, సింహాద్రి, సంపంగి, ఇందిరమ్మ తదితర సినిమాలు మంచి పేరు తెచ్చి పెట్టాయి. మల్లి సినిమాకు రెండు నందులు ‘ఓమల్లి’ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు నటించా. ఈ సినిమాకు రెండు నందులు వచ్చాయి. కన్నడలో ఆర్యభట్ట చిత్రానికి జాతీయ అవార్డు లభించింది. సంపాదనలో కొంత పేదలకు.. నా సంపాదనలో కొంత మొత్తం పేదలకు కేటాయిస్తున్నాను. విస్తృతంగా సమాజ సేవా కార్యక్రమాలు చేపడుతున్నాను. సినీ హీరో శ్రీకాంత్, హాస్యనటుడు బ్రహ్మానందం ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేదలకు సాయపడాలని సూచించారు. వైఎస్ రాజశేఖరరెడ్డే నాకు స్ఫూర్తి నాకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితం స్ఫూర్తి నిచ్చింది. ఆయన ఉన్నన్నాళ్లూ జనంలో ఉన్నారు. చనిపోయాక కూడా జనంలో బతికి ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వైఎస్సార్ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో చెరగని ముద్ర వేసుకున్నారు. అందుకే ఆయన మహనీయుడయ్యారు. లబ్ధిపొందిన వారిలో నేనూ ఉన్నాను. నాకు హైదరాబాద్‌లో రూ.50 లక్షల విలువైన భూమి వివాదాల్లో ఉంటే ఆయనను కలసి న్యాయం చేయాలని అర్ధించాను. వెంటనే ఆయన వివాదాన్ని పరి ష్కరించారు. ఇప్పుడా స్థలం విలువ రూ.10 కోట్లు. అంత మేలు చేసిన వైఎస్సార్‌ను ఎలా మరచిపోతాను. నేను చనిపోయే వరకూ జనంలోనే ఉంటా. వారి అభిమానం పొందుతా.. -
మంచి పాత్రలు వస్తే మళ్లీ నటిస్తా: నటి
సాక్షి, సబ్బవరం: మంచి పాత్రలు వస్తే తప్పక నటిస్తానని ప్రముఖ సినీ నటి రమ్యశ్రీ చెప్పారు. శుక్రవారం ఆమె విశాఖపట్నంలోకి సబ్బవరానికి వచ్చారు. విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇంతవరకూ ఎనిమిది భాషల్లో 300 సినిమాల్లో నటించానని ఆమె చెప్పారు.1997లో కోరుకోన్న ప్రియుడు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశానన్నారు. కన్నడలో ఆర్యభట్ట సినిమాకు జాతీయ అవార్డు లభించిందన్నారు. రమ్య హృదయాలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మొగలిపురం గ్రామంలోని రామాలయం వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్టు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందుతున్నా ప్రసవ సమయంలో మహిళలు మృత్యువాత పడుతున్న సంఘటనలు బాధ కలిగిస్తున్నాయని అన్నారు. గ్రామాల్లో గర్భిణులు వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తే ప్రసవ సమయంలో ఇబ్బందులు ఉండవని తెలిపారు. బీపీ, సుగర్, స్త్రీ సమస్యలపై వైద్య శిబిరంలో ఉన్నత స్థాయి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు రమ్యశ్రీ కోరారు. -
రెండు నెలలు చలిలో షూటింగ్ చేశాం : రమ్యశ్రీ
నటి రమ్యశ్రీ దర్శకురాలిగా మారి తీసిన తొలి చిత్రం ‘ఓ మల్లి’. టైటిల్ రోల్ ఆమే పోషించారు. ఆర్.ఎ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బి.ప్రశాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆకాశ్, రఘుబాబు, శ్రీధర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని నవీన్‌యాదవ్ ఆవిష్కరించి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, జ్యోతిరెడ్డిలకు అందించారు. ఈ సందర్భంగా రమ్యశ్రీ మాట్లాడుతూ -‘‘ఈ సినిమా కోసం అరకులో దాదాపు రెండు నెలల పాటు చలిలో కష్టపడ్డాం. దీనికి చాలా మంచి పాటలు కుదిరాయి’’ అని తెలిపారు. ఈ సినిమా చేయడానికి మంచి కథే కారణమని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి సునీల్‌కశ్యప్, కృష్ణమూర్తి స్వరాలందించారు. -
రమ్యంగా...రికార్డ్ మ్యాజిక్
నా చేతుల్లో ఏమీ లేదంటూ ఖాళీ చేతులు చూపిస్తుందా అమ్మాయి... ఆ ఖాళీ చేతుల్లో నుంచి తెల్లపావురం రెక్కలు విచ్చుకుంటూ గాల్లోకి ఎగిరిపోతుంది. ఉన్నట్టుండి గాలిలో ఒక గొడుగు విచ్చుకుంటుంది... అంతే వేగంగా అమ్మాయి చేతిలో నుంచి సీడీలు పుట్టుకొచ్చేస్తాయి. ప్రేక్షకుల్ని కనికట్టు చేస్తున్న ఆ అమ్మాయి రమ్యశ్రీ! టీనేజ్లోనే జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న లేడీ మెజీషియన్...మైనారిటీ అయినా తీరక ముందే తాజాగా పన్నెండు గంటల నిర్విరామ ప్రదర్శనతో రికార్డుల్లోకెక్కిన పిడుగు... వేదిక మీద ఏకధాటిగా పన్నెండు గంటల సేపు సాగిన ఇంద్రజాల ప్రదర్శన అది. రక్తదానం ఆవశ్యకత, నీటి పొదుపు, పర్యావరణ పరిరక్షణ, మద్యపాన నిషేధం, ఇంధన పొదుపు, మహిళా సాధికారత... ఇలా మొత్తం పన్నెండు అంశాలపై ప్రదర్శన సాగింది. విజ్ఞానాన్ని మేళవించిన వినోదకార్యక్రమం అది. సామాజిక బాధ్యత స్పృహతో సాగిన ఇంద్రజాల ప్రదర్శన. ప్రేక్షకులను ఇంద్రజాలంతో కనికట్టు చేసిన మెజీషియన్ 17 ఏళ్ల రమ్యశ్రీ. ‘‘ఇంద్రజాలం గొప్ప మాధ్యమం. ఏ విషయాన్ని అయినా ఇంద్రజాలంతో చెబితే ఇట్టే గుర్తుండిపోతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేసే శక్తి ఇంద్రజాలానికి ఉంది. మెజీషియన్‌గా సామాజిక బాధ్యత ఉందనుకుంటున్నాను. అందుకే నా కార్యక్రమాల్లో ఎక్కువ సామాజికాంశాలే ఉంటాయి’’ అంటున్నారీ అమ్మాయి. కుటుంబమంతా... జానపద కాలం నుంచి కథల్లో తరచూ ఇంద్రజాలమహేంద్రజాల విద్యలు తెలిసిన వాడు... అనే పదమే వినిపించేది. ఇక నుంచి ఇంద్రజాల విద్య తెలిసిన అమ్మాయి అని స్త్రీ పాత్రనూ పరిచయం చేస్తూ కథల్ని తిరగరాసుకోమంటోంది రమ్యశ్రీలోని ప్రతిభ. ఈ సృజనాత్మకత ఆ కుటుంబంలోనే ఉంది. రమ్య తండ్రి రఘుబాబు మెజీషియన్, తల్లి నాగమణి మ్యాజిక్ మెటీరియల్, వెంట్రిలాక్విజమ్ బొమ్మలు చేస్తారు. మణి తల్లి సీతాదేవి కూడా ఇదే పని చేసేవారు. రఘుబాబు అదే సంగతి చెప్తూ... ‘‘రమ్యకి ఐదేళ్ల వయసులోనే నాతోపాటు స్టేజి మీద చిన్న చిన్న మ్యాజిక్కులు చేయడం అలవాటు చేశాను. మొదట్లో రెండు నిమిషాలు, మూడు నిమిషాలు చేయిస్తూ నిడివి పెంచాను. ఆరేళ్ల వయసులో తానొక్కతే ప్రదర్శన ఇచ్చింది. గత పన్నెండేళ్లుగా ఈ రంగంలో రోజుకో కొత్త అంశం నేర్చుకుంటోంది. రమ్యకు తొలిగురువును నేనే. ఆ తర్వాత బీహార్‌లోని బ్రిజ్మోహన్, కేరళలో నిపుణుల దగ్గర కొత్త టెక్నిక్స్ నేర్చుకుంది. తిరుపతిలో రవిరెడ్డి దగ్గర కళ్లకు గంతలు కట్టుకుని మోటర్‌బైక్ నడపడం నేర్చుకుంది. ఇప్పటికి రెండువేలకు పైగా ప్రదర్శనలిచ్చింది. పది పోటీల్లో మొదటి రెండు స్థానాల్లో బహుమతులందుకుంది’’ అని వివరించారు. ‘‘మా అబ్బాయి వికాస్కీ, రమ్యకీ ఇద్దరికీ మా వారు మ్యాజిక్ నేర్పించారు. రమ్య ఇష్టంగా నేర్చుకుంది. ఇంద్రజాల ప్రదర్శనలు జరిగే గాలా షోలలో మేము తయారు చేసిన మ్యాజిక్ వస్తువుల స్టాల్ పెట్టేవాళ్లం. అలా రమ్య రెండేళ్ల పాపాయిగా ఉన్నప్పుడే ముంబయిలో ఇంద్రజాల ప్రదర్శన చూసింది’’ అంటారు రమ్య తల్లి నాగమణి. సీనియర్ల ప్రదర్శనలే పాఠాలు! రమ్య తాను గత జనవరి 27వ తేదీ చేసిన 12 గంటల ప్రదర్శనను ఉటంకిస్తూ... ‘‘ఆ ప్రదర్శనతో నాకు ఐఎస్ఓ సర్టిఫికేట్ వచ్చింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ ది రికార్డ్స్‌కి అప్లయ్ చేశాను. గాలా షోలలో 30-40 మంది మెజీషియన్ల ప్రదర్శనలను గమనించడం మంచి ఎడ్యుకేషన్’’అంటారు. సమయస్ఫూర్తితో వ్యవహరించాల్సిన సందర్భాలను ఉదాహరిస్తూ... ‘‘ఏదైనా మ్యాజిక్ అంశం మిస్‌ఫైర్ అయినా కూడా దానికి అనుగుణంగా అప్పటికప్పుడే మార్చుకోవాలి. దానిని మేనేజ్ చేసి మరోలా ప్రెజెంట్ చేయాలి. లింకింగ్ రింగ్స్‌లో ఒక రొటీన్లో తేడా వస్తే మరో రొటీన్ చేస్తాం. ఒక్కోసారి ఈ తేడా సీనియర్ మెజీషియన్‌కు కూడా అర్థం కాదు. ఏదేమైనా సగంలో వదిలేయకుండా మరో రకంగా తిప్పుకోగలగాలి’’ అని ఈ అమ్మాయి వివరించారు. ‘‘ప్లేయింగ్ కార్డ్‌లు, సీడీలతో కనికట్టు చేయడానికి ఎక్కువ సాధన చేయాలి. సాధారణంగా రోజూ గంట సేపు ప్రాక్టీస్ చేయాలి. ఈ 12 గంటల ప్రదర్శనకు ముందు ఒక్కో కాన్సెప్ట్‌కి కొంత సమయం కేటాయించుకుని రోజుకి ఏడెనిమిది గంటలు ప్రాక్టీస్ చేశా. నిలబడడం, నడవడం వంటి ఫిట్నెస్ సాధించడానికి రెండు నెలలు శ్రమించా. పన్నెండు గంటల ప్రదర్శనకు 4 నెలలు ప్రాక్టీస్ చేశా’’నన్నారు.మహిళలు పెద్దగా ఆసక్తి చూపని రంగంలో అడుగుపెట్టి నంబర్‌వన్‌గా నిలిచిన రమ్య ట్రెండ్సెట్టరే. ‘‘రమ్య అత్యున్నత ప్రతిభ ఉన్న మెజీషియన్. భారతీయ మెజీషియన్లకు గర్వ కారణం’’ అని సీనియర్ మెజీషియన్ డా.బి.వి. పట్టాభిరామ్ ప్రశంసించారు. రమ్య గనక తన కృషిని ఇలాగే కొనసాగిస్తే లిమ్కా, గిన్నిస్ రికార్డుల్లో స్థానం సాధిం చడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. నన్ను మించిపోయింది! నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు రమ్య చాలా ఆసక్తిగా గమనించేది. తనని లేడీ మెజీషియన్‌ని చేయాలనుకున్నాను. నేను కోరుకున్న లక్ష్యం కంటే ఎక్కువగా సాధించి... దేశంలో నంబర్‌వన్ లేడీ మెజీషియన్ అయింది. - రఘుబాబు, మెజీషియన్ నాన్నే నాకు ఆదర్శం! నాన్న ఉద్యోగం చేస్తూ కూడా తనకిష్టమైన ఇంద్రజాలాన్ని కొనసాగించారు. నేను సి.ఎ చేస్తున్నాను. ఉద్యోగం చేస్తూ మ్యాజిక్‌ను కొనసాగిస్తాను. మ్యాజిక్ చేస్తున్నప్పుడు ప్రేక్షకుల కళ్లలో కనిపించే అబ్బురాన్ని చూడాలనిపిస్త్తుంది. - రమ్యశ్రీ, మెజీషియన్ - వాకా మంజులారెడ్డి -
ఆస్కార్‌పై రమ్యశ్రీ గురి!
ఎన్నో భాషా చిత్రాల్లో పలు రకాల పాత్రలు పోషించిన రమ్యశ్రీ ‘ఓ మల్లి’తో దర్శకురాలిగా తన ప్రతిభను నిరూపించుకోవడానికి సిద్ధపడ్డారు. టైటిల్ రోల్‌ను కూడా తనే పోషించారు. నేడు రమ్యశ్రీ పుట్టినరోజు. ఈ సందర్భంగా తన మనోభావాలను పంచుకుంటూ -‘‘ఆర్ట్ ఫిల్మ్‌లా ఉండే కమర్షియల్ సినిమా ఇది. భర్తను ఎంతగానో ప్రేమించే మల్లి జీవితం ఎలాంటి ఆటుపోట్లు ఎదుర్కొంది? అనేది కథాంశం. ఈ చిత్రాన్ని పలు ప్రతిష్టాత్మక చలన చిత్రోత్సవాలకు పంపించనున్నాను. అలాగే ‘ఆస్కార్’ అవార్డ్స్‌లో ఉత్తమ విదేశీ చిత్రం విభాగానికి కూడా పంపించబోతున్నాను. ఆస్కార్ ఎంతటి ప్రతిష్టాత్మక అవార్డో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం నామినేషన్ పొందినా చాలు, అదే పెద్ద గౌరవం అనే విషయం తెలిసిందే. ఆస్కార్‌కి పంపించే అన్ని అర్హతలు సంపూర్ణంగా ఉన్న సినిమా కాబట్టే.. ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ నెలాఖరున పాటలను, వచ్చే నెలలో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాను’’ అని చెప్పారు.