![Actress Ramya Sri Fire On TDP govt - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/28/ramya.jpg.webp?itok=bNw15fyD)
విశాఖపట్నం జిల్లా / పెందుర్తి: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఈ నెల 25న విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగితే ఇప్పటి వరకు పోలీసులు, ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు నిజాలు వెల్లడించలేకపోయారని సినీనటి రమ్యశ్రీ అన్నారు. పెందుర్తిలో ఆమె శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల ప్రభుత్వం, పోలీసులు అనుసరిస్తున్న వైఖరి అనేక అనుమానాలకు తావిస్తుందన్నారు. అలాంటి ప్రజాదరణ కలిగిన వ్యక్తులకే రక్షణ కల్పించలేని ప్రభుత్వం ఇక తమలాంటి వారికి, సామాన్యులకు ఎలా రక్షణ కల్పిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుని వెనుక ఎంతటి హోదా కలిగిన వ్యక్తులు ఉన్నా కఠినంగా శిక్షించి న్యాయవ్యవస్థ నిజాయితీని దేశ ప్రజలకు చాటాలన్నారు. ఇలాంటి రాజకీయ హత్యలకు పాల్పడిన వారు బాగుపడిన సందర్భాలు చరిత్రలో లేవన్నారు.
Comments
Please login to add a commentAdd a comment