నటి రమ్యశ్రీ
సాక్షి, సబ్బవరం: మంచి పాత్రలు వస్తే తప్పక నటిస్తానని ప్రముఖ సినీ నటి రమ్యశ్రీ చెప్పారు. శుక్రవారం ఆమె విశాఖపట్నంలోకి సబ్బవరానికి వచ్చారు. విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇంతవరకూ ఎనిమిది భాషల్లో 300 సినిమాల్లో నటించానని ఆమె చెప్పారు.1997లో కోరుకోన్న ప్రియుడు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశానన్నారు. కన్నడలో ఆర్యభట్ట సినిమాకు జాతీయ అవార్డు లభించిందన్నారు.
రమ్య హృదయాలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మొగలిపురం గ్రామంలోని రామాలయం వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్టు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందుతున్నా ప్రసవ సమయంలో మహిళలు మృత్యువాత పడుతున్న సంఘటనలు బాధ కలిగిస్తున్నాయని అన్నారు. గ్రామాల్లో గర్భిణులు వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తే ప్రసవ సమయంలో ఇబ్బందులు ఉండవని తెలిపారు. బీపీ, సుగర్, స్త్రీ సమస్యలపై వైద్య శిబిరంలో ఉన్నత స్థాయి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు రమ్యశ్రీ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment