సినీ నటి రమ్యశ్రీకి డాక్టరేట్‌ ప్రదానం | Movie Actress Ramya Sri Get Doctarate From Philanthropic Society | Sakshi
Sakshi News home page

సినీ నటి రమ్యశ్రీకి డాక్టరేట్‌ ప్రదానం

Published Thu, Nov 22 2018 11:34 AM | Last Updated on Thu, Jan 3 2019 12:14 PM

Movie Actress Ramya Sri Get Doctarate From Philanthropic Society - Sakshi

పెందుర్తి: సినీ నటి రమశ్రీకి డాక్టరేట్‌ లభించింది. అమెరికా లోని ఫిలాంథ్రోఫిక్‌ సొసైటీ నేషనల్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ విజ యవాడలోని ఐలాపురం కన్వెషన్‌ హాల్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె కు డాక్టరేట్‌ ప్రదానం చేశారు. సినీ నటిగా, దర్శక నిర్మాతగా రమ్యశ్రీ కళారంగానికి అందించిన సేవలకుగాను ఈ డాక్టరేట్‌తో అభినందించారు. రమ్య హృదయాల ఫౌండేషన్‌ ద్వారా గత పదేళ్ల నుంచి యాచకులు, వృద్ధులు, వికలాంగులకు ఆమె అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా అభినందించారు. రమ్యమైన హృదయంతో రమ్య హృదయాల ఫౌండేషన్‌ ద్వారా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని కొనియాడారు. సినీ నటిగా రాణిస్తూనే సామాజిక బాధ్యతగా రమ్యశ్రీ మెడికల్‌ క్యాంపులు, క్యాన్సర్‌పై చైతన్యం, బీపీ, సుగర్‌ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement