
పశ్చిమ గోదావరి, పెరవలి : పెరవలి జెడ్పీటీసీ సభ్యురాలు అతికాల కుసుమాంజలీ రమ్యశ్రీ తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజీనామా చేశారు. ఖండవల్లిలోని స్వగృహంలోవిలేకర్లతో ఆమె మాట్లాడుతూ పార్టీలో గుర్తింపు అంతంత మాత్రంగా ఉండటంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి సహకారం లభించక విసుగెత్తి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. గత కొంత కాలంగా పార్టీలో ఉన్నా అధికార కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న రమ్యశ్రీ గురువారం సాయంత్రం పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామాను ఫ్యాక్స్‌లో జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మికి పంపిస్తున్నట్లు తెలిపారు. ఆమెతో పాటు మండల తెలుగు యువత అధ్యక్షుడు గడుగోయిల ఫణికృష్ణ, వెంకట్రాయపురం గ్రామ ఉప సర్పంచ్ దేవా పవన్‌లు కూడా టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment