
సినీనటి రమ్యశ్రీ
సీతమ్మధార(విశాఖ ఉత్తర): వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డితోనే రాజన్న రా జ్యం వస్తుందని సినీనటి రమ్యశ్రీ అన్నారు. ఈ మేరకు ఆమె సాక్షితో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి జగన్‌మోహన్‌రెడ్డి 3600కిలోమీటర్ల పాదయా త్ర చేశారన్నారు. రాజన్న రాజ్యంకోసం ప్రతి ఒక్క రూ ఫ్యాన్ గుర్తుకు ఓటువేయాలని విజ్ఞప్తి చేశారు.
టీడీపీ ప్రలోభాలకు లొంగవద్దు
టీడీపీ నాయకులు డబ్బులు ఇచ్చి ఓటు వేయాలని ప్రమాణాలు చేయించుకోవడం బాధాకరమన్నారు. దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి గణేష్‌కుమార్ ఓటర్లను ప్రలోభపెట్టాలని చూ స్తున్నారని.. ఈ సారి బుద్ధి చె ప్పడం ఖాయమన్నారు. ఉత్తర నియోజకవర్గంలో పోటీ చేస్తు న్న మంత్రి గంటా శ్రీనివాసరావు రెండు రోజుల కిందట వెలమ సామాజిక వర్గానికి డబ్బుతో కొనుగోలు చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారని .. వెలమలు ఎప్పడు న్యాయం వైపు ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. గంటాకు నీతి, నిజాయితీ లేకుండా ఐదేళ్లకు ఒక సారి నియోజవర్గాలు మార్చిన వ్యక్తి మనకు అవసరమా అని అన్నారు. బీసీలకు అండగా ఉన్న నాయకుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అని.. మేనిఫెస్టోలో బీసీలకు పెద్దపీట వేశారన్నారు. ప్రతి ఒక్కరు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీకి 119 ఎమ్మెల్యే సీట్లు, 23 ఎంపీలు సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment