o malli
-
నా జీవితంలోని ఓ ఘటనే ఈ సినిమా
‘‘నేను పదో తరగ తి చదివే సమయంలో ఓ సంఘటన నాలో బలంగా నాటుకుంది. నేను సినిమాల్లోకి వచ్చాక ఈ కథతో సినిమా చేయాలని అనుకున్నా. ఇప్పటికి కుదిరింది’’ అని నటి రమ్యశ్రీ అన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులకు సుపరిచితురాలైన రమ్యశ్రీ దర్శకురాలిగా మారి నిర్మించిన చిత్రం ‘ఓ మల్లి’. ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ- ‘‘ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ చిత్రంలో చూపించనున్నా. ఇందులో నేను ఓ గిరిజన యువతి పాత్రలో నటించాను. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది’’ అని చెప్పారు. కాగా విశాఖకు చెందిన రమ్మశ్రీ అసలు పేరు సుజాత. -
వెనకడుగు వేయకూడదు
ఆడవాళ్లను అణగదొక్కాలనీ, ‘అవకాశం ఇస్తా’మంటూ వేరే ఏదో ఆశించే తోడేళ్ళూ ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాయి. కానీ, అలాంటివాళ్ల బారిన పడకుండా తెలివిగా తప్పించు కునే నేర్పు ఆడవాళ్లకుండాలి. అలాంటివాళ్లల్లో నేనొకదాన్ని. నా పద్ధెనిమిదేళ్ల సినిమా కెరీర్లో నటిగా నాకెలాంటి అసంతృప్తీ లేదు. వ్యాంప్ పాత్రలెందుకు చేశానంటే... డెరైక్టర్స్ నన్ను ఆ విధంగా చూపిస్తేనే బాగుంటుందని భావించారు. వాళ్లు ఇచ్చిన పాత్రలు నేను చేశాను. వాళ్లు నాలో ఆ కోణాన్ని చూశారు. కానీ, నాకంటూ ఓ కోణం ఉంటుంది. దాన్ని ఆవిష్కరించుకోవ డానికే ‘ఓ మల్లి’ నిర్మించి, దర్శకత్వం వహించి, నటించాను. ట్యాలెంట్ అనేది ఆడ, మగకి ఒకే రకంగా ఉంటుంది. ఆ ప్రతిభను చూడాలే తప్ప ఆడవాళ్లని చిన్నచూపు చూడకూడదు. నా విషయానికి వస్తే, నన్నెవరూ చులకనగా మాట్లాడలేదు. అది నా అదృష్టం. ఒక మంచి ప్రయత్నం చేసిందని అందరూ అనుకోవడం వల్లే కొంత ఆలస్యమైనా, ‘ఓ మల్లి’ని రిలీజ్ చేసుకోగలుగుతున్నా. ఆడవాళ్లందరికీ నేను చెప్పే మాట ఒకటే.. ‘కార్యసాధనలో ఎన్ని ఆటంకాలెదురైనా అధిగమించాలి. వెనకడుగు వేయకూడదు’. - రమ్యశ్రీ, నటి - దర్శకురాలు -
ఓ మల్లిక గాథ
గిరిజన నేపథ్యంలో సాగే వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ఓ మల్లి’. రమ్యశ్రీ కథానాయికగా నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రశాంత్ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 18న విడుదలకు సిద్ధంగా ఉంది. రమ్యశ్రీ మాట్లాడుతూ- ‘‘ఓ గిరిజన జంట మధ్య సాగే అనుబంధమే ఈ చిత్రం. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌ను ఎంచుకుని ఈ సినిమా రూపొందించాం. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది. ఇలాంటి సినిమా తెలుగులో ఇప్పటివరకూ రాలేదు. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, బి.ఎస్. కృష్ణమూర్తి, సినిమాటోగ్రఫీ: కె.దత్తు. -
రెండు నెలలు చలిలో షూటింగ్ చేశాం : రమ్యశ్రీ
నటి రమ్యశ్రీ దర్శకురాలిగా మారి తీసిన తొలి చిత్రం ‘ఓ మల్లి’. టైటిల్ రోల్ ఆమే పోషించారు. ఆర్.ఎ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బి.ప్రశాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆకాశ్, రఘుబాబు, శ్రీధర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని నవీన్‌యాదవ్ ఆవిష్కరించి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, జ్యోతిరెడ్డిలకు అందించారు. ఈ సందర్భంగా రమ్యశ్రీ మాట్లాడుతూ -‘‘ఈ సినిమా కోసం అరకులో దాదాపు రెండు నెలల పాటు చలిలో కష్టపడ్డాం. దీనికి చాలా మంచి పాటలు కుదిరాయి’’ అని తెలిపారు. ఈ సినిమా చేయడానికి మంచి కథే కారణమని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి సునీల్‌కశ్యప్, కృష్ణమూర్తి స్వరాలందించారు. -
ఆస్కార్‌పై రమ్యశ్రీ గురి!
ఎన్నో భాషా చిత్రాల్లో పలు రకాల పాత్రలు పోషించిన రమ్యశ్రీ ‘ఓ మల్లి’తో దర్శకురాలిగా తన ప్రతిభను నిరూపించుకోవడానికి సిద్ధపడ్డారు. టైటిల్ రోల్‌ను కూడా తనే పోషించారు. నేడు రమ్యశ్రీ పుట్టినరోజు. ఈ సందర్భంగా తన మనోభావాలను పంచుకుంటూ -‘‘ఆర్ట్ ఫిల్మ్‌లా ఉండే కమర్షియల్ సినిమా ఇది. భర్తను ఎంతగానో ప్రేమించే మల్లి జీవితం ఎలాంటి ఆటుపోట్లు ఎదుర్కొంది? అనేది కథాంశం. ఈ చిత్రాన్ని పలు ప్రతిష్టాత్మక చలన చిత్రోత్సవాలకు పంపించనున్నాను. అలాగే ‘ఆస్కార్’ అవార్డ్స్‌లో ఉత్తమ విదేశీ చిత్రం విభాగానికి కూడా పంపించబోతున్నాను. ఆస్కార్ ఎంతటి ప్రతిష్టాత్మక అవార్డో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం నామినేషన్ పొందినా చాలు, అదే పెద్ద గౌరవం అనే విషయం తెలిసిందే. ఆస్కార్‌కి పంపించే అన్ని అర్హతలు సంపూర్ణంగా ఉన్న సినిమా కాబట్టే.. ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ నెలాఖరున పాటలను, వచ్చే నెలలో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాను’’ అని చెప్పారు.