వెనకడుగు వేయకూడదు
ఆడవాళ్లను అణగదొక్కాలనీ, ‘అవకాశం ఇస్తా’మంటూ వేరే ఏదో ఆశించే తోడేళ్ళూ ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాయి. కానీ, అలాంటివాళ్ల బారిన పడకుండా తెలివిగా తప్పించు కునే నేర్పు ఆడవాళ్లకుండాలి. అలాంటివాళ్లల్లో నేనొకదాన్ని. నా పద్ధెనిమిదేళ్ల సినిమా కెరీర్‌లో నటిగా నాకెలాంటి అసంతృప్తీ లేదు. వ్యాంప్ పాత్రలెందుకు చేశానంటే... డెరైక్టర్స్ నన్ను ఆ విధంగా చూపిస్తేనే బాగుంటుందని భావించారు. వాళ్లు ఇచ్చిన పాత్రలు నేను చేశాను. వాళ్లు నాలో ఆ కోణాన్ని చూశారు. కానీ, నాకంటూ ఓ కోణం ఉంటుంది. దాన్ని ఆవిష్కరించుకోవ డానికే ‘ఓ మల్లి’ నిర్మించి, దర్శకత్వం వహించి, నటించాను. ట్యాలెంట్ అనేది ఆడ, మగకి ఒకే రకంగా ఉంటుంది. ఆ ప్రతిభను చూడాలే తప్ప ఆడవాళ్లని చిన్నచూపు చూడకూడదు. నా విషయానికి వస్తే, నన్నెవరూ చులకనగా మాట్లాడలేదు. అది నా అదృష్టం. ఒక మంచి ప్రయత్నం చేసిందని అందరూ అనుకోవడం వల్లే కొంత ఆలస్యమైనా, ‘ఓ మల్లి’ని రిలీజ్ చేసుకోగలుగుతున్నా. ఆడవాళ్లందరికీ నేను చెప్పే మాట ఒకటే.. ‘కార్యసాధనలో ఎన్ని ఆటంకాలెదురైనా అధిగమించాలి. వెనకడుగు వేయకూడదు’. - రమ్యశ్రీ, నటి - దర్శకురాలు