isha chawla
-
హీరోయిన్ ఇషా చావ్లా లేటెస్ట్ ఫోటోస్
-
హీరోయిన్ ఇషా చావ్లాకు కరోనా
సినీ ఇండస్ట్రీని కరోనా పట్టి పీడిస్తోంది. మహేశ్‌బాబు, మంచు లక్ష్మి, మంచు మనోజ్, తమన్, సత్యరాజ్, త్రిష, రాజేంద్రప్రసాద్ సహా పలువురు కరోనాతో పోరాడుతున్నారు. తాజాగా హీరోయిన్ ఇషా చావ్లా కోవిడ్ బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడించింది. తనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందన్న ఆమె ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు తెలిపింది. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన 'ప్రేమ కావాలి' చిత్రంతో హీరోయిన్గా పరిచయమైంది ఇషా చావ్లా. 'పూలరంగడు', 'మిస్టర్ పెళ్లికొడుకు', 'జంప్ జిలానీ' తదితర చిత్రాల్లో నటించింది. 'విరాట్' సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోనూ అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆమె కబీర్‌లాల్ డైరెక్ట్ చేస్తున్న 'దివ్యదృష్టి' సినిమాలో నటిస్తోంది. -
బిగ్‌బాస్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
బుల్లితెరపై ఎంతగానో అలరిస్తూ ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేస్తున్న రియాలిటీ షో బిగ్‌బాస్. ఈ షో ఐదో సీజన్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు స్టార్‌మా అధికారికంగా ప్రకటిస్తూ బిగ్‌బాస్-5లోగోని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నంచి అసలు కథ మొదలైంది. అప్పటి నుంచి వార్తలు, లీకులు ఒక్కసారిగా నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఇక లీకుల రూపంలో కంటెస్టెంట్ల పేర్లు రోజుకొకటి తెర మీదకు వస్తోంది. తాజాగా నటి ఇషాచావ్లా బిగ్ బాస్ ఎంట్రీకి పై స్పందించింది. కంటెస్టెంట్లకి ఇండస్ట్రీలో ఫేమ్ ఎలా ఉన్నా బిగ్ బాస్ షోలో పాల్గొనడం ఓ వరంగా మారుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఈ షో ద్వారా తారలకి మళ్లీ జనాలలో బాగా గుర్తింపు దక్కుతోంది. అందుకే కొందరు బిగ్ బాస్ షోలో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నెట్టింట హల్ చల్ చేస్తున్న జాబితాలో ఇప్పటికే సురేఖా వాణి, యాంకర్ రవి, వర్షిణి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రేమకావాలి హీరోయిన్ ఇషా చావ్లా బిగ్ బాస్ షో ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేసింది. ఇన్‌స్టాలో ఈ అమ్మడు ఫాలోవర్లు బిగ్ బాస్ ఎంట్రీ గురించి ప్రశ్నలు కురిపించారు. అందుకు స్పందిస్తూ... తాను బిగ్ బాస్ షోకి వెళ్లడం లేదని తేల్చి చెప్పింది. ఈ సమాధానంతో లిస్ట్‌లోంచి ఓ కంటెస్టెంట్ పేరు తగ్గినట్టైంది. ఇక లీకు వీరులు ఇషా స్థానంలో తరువాత ఎవరి పేరుని తెరపైకి తెస్తారో చూడాలి. -
అందులో నేను అంధురాలిని: హీరోయిన్
‘ప్రేమ కావాలి, పూలరంగడు’ ఫేమ్ ఇషా చావ్లా లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘అగోచర’. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కబీర్ లాల్ ఈ చిత్రంతో దర్శకునిగా మారారు. ఇషా చావ్లా భర్త పాత్రలో నటుడు కమల్ కామరాజు నటిస్తున్నారు. లవ్లీ వరల్డ్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం డెహ్రాడూన్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఇషా చావ్లా మాట్లాడుతూ– ‘‘కబీర్ లాల్ చాలా కాలంగా నాకు తెలుసు. ఆయన చెప్పిన కథ ఎగ్జయిటింగ్‌గా అనిపించడంతో వెంటనే ఈ సినిమా చేస్తానని చెప్పేశాను. ఇందులో అంధురాలి పాత్ర చేస్తున్నాను. ఇలాంటి పాత్ర కోసమే ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నాను. ఈ పాత్ర చేయడం మానసికంగానే కాకుండా ఎమోషనల్‌గా కూడా ఛాలెంజింగ్‌గా ఉంది’’ అన్నారు. కబీర్ లాల్ మాట్లాడుతూ– ‘‘మర్డర్ మిస్టరీగా రూపొందుతోన్న చిత్రం ‘అగోచర’. ఒక ఘటనతో జీవితాలు ఎలా మారిపోయాయి? అనేది ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఈ చిత్రంలో ఇషా చావ్లా ఒక భిన్నమైన పవర్ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఆమెకు మద్దతు ఇచ్చే భర్త సైకాలజిస్ట్ పాత్రలో కమల్ కామరాజు నటిస్తున్నారు. జూన్‌లో సినిమాను విడుదల చేయనున్నాం’’ అన్నారు. బ్రహ్మానందం, సునీల్ వర్మ, అజయ్ కుమార్ సింగ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. చదవండి: స్టోరీ టెల్లింగ్ అద్భుతంగా ఉంది: చిరంజీవి ∙ఇషా చావ్లా -
ఇషాచావ్లా సందడి
గన్‌ఫౌండ్రీ : గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్(టీటీఐ)లో హీరోయిన్ ఇషాచావ్లా సందడి చేసింది. మద్యం తాగి వాహనాలు నడపవద్దని వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం గోషామహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డ్రైవింగ్ లైసెన్స్కై దళారులను ఆశ్రయించకుండా నేరుగా డ్రైవింగ్ టెస్ట్‌లో పాల్గొనాలని సూచించారు. తాను సైతం మొదటిసారి డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిలయ్యానని, రెండవసారి మాత్రం ఏకాగ్రతతో డ్రైవింగ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించి డ్రైవింగ్ లైసెన్స్ పొందినట్లు తెలిపారు.ట్రాఫిక్ డీసీపీ ఎ.వి. రంగనాథ్ మాట్లాడుతూ... నేటితరం పిల్లలకు స్కూల్ లాంటి ఇంటినుంచే ట్రాఫిక్ నిబంధనలను తెలియజేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందన్నారు. రాబోయే రోజుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ లేని, నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేసే వాహనదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా ఆధార్‌కార్డ్‌ను వెంట ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వ్యాపారవేత్త అనిల్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరహరి తదితరులు పాల్గొన్నారు. -
స్పెషల్ సాంగ్‌తో రీ ఎంట్రీ
ఆది హీరోగా తెరకెక్కిన 'ప్రేమ కావాలి' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఇషా చావ్లా. తరువాత పూల రంగడు సినిమాతో మరో సక్సెస్ సాధించిన ఈ ఢిల్లీ భామ అనంతరం బాలకృష్ణ లాంటి స్టార్ హీరో సరసన శ్రీమన్నారాయణ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. అయితే ఈ సినిమా ఆశించిన స్ధాయిలో ఆడకపోవటం, ఆ తరువాత అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన జంప్ జిలానీ సినిమా కూడా నిరాశపరచటంతో ఇషా తెరమీద కనిపించటం మానేసింది. లాంగ్ గ్యాప్ తరువాత మరోసారి టాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతోంది ఇషా చావ్లా. అయితే హీరోయిన్గా వర్క్ అవుట్ కాకపోవటంతో ఈ సారి స్పెషల్ సాంగ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలతో వరుస సూపర్ హిట్స్ అందుకున్న సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న 'సుప్రీమ్' సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నటిస్తోంది. పటాస్ ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సుప్రీం వేసవిలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. -
తిరుమలలో వీఐపీల సందడి
-
ఆర్ఎస్ బ్రదర్స్ రజతోత్సవ వేడుకలు
హైదరాబాద్: ప్రముఖ వస్త్రాభరణ విక్రయ సంస్థ ఆర్.ఎస్. బ్రదర్స్ సంస్థ 25వ వసంతంలోకి ప్రవేశించింది. ఈ రజతోత్సవం సందర్భంగా వినియోగదారులకు ప్రత్యేకమైన ఆఫర్లనందిస్తున్నామని ఆర్.ఎస్. బ్రదర్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రజతోత్సవ వేడుకలను ప్రముఖ సినీ నటి ఇషా చావ్లా(శ్రీమన్నారాయణ సినిమా ఫేమ్) ప్రారంభించారని ఆర్.ఎస్. బ్రదర్స్ డెరైక్టర్ పి. వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. 1990లో తమ సంస్థ ప్రారంభమైందని, ఇప్పుడు 11 శాఖలతో రూ.770 కోట్ల వార్షిక టర్నోవర్‌తో ముందుకు వెళుతున్నామని మరో డెరైక్టర్ రాజమౌళి వివరించారు. రజతోత్సవాల సందర్భంగా అందిస్తున్న ఆఫర్ల వివరాలను కంపెనీ డెరైక్టర్ పి. సత్యనారాయణ వివరించారు. ప్రతీ కొనుగోలుపై తక్షణ కానుక ఉంటుందని, లక్కీ డ్రాలు నిర్వహిస్తున్నామని, 5 కార్లు, 25 టూవీలర్లు, 25 సిల్వర్ బౌల్స్, 25 నెక్లెస్‌లు, 25 వాషింగ్ మెషీన్లు, 25 ఫ్రిజ్‌లు, 25 ఏసీలు, 25 టీవీలు, 25 ట్యాబ్‌లు బహుమతులుగా అందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో వస్తు, సేవల నాణ్యతను మరింతగా పెంపొందించి, అందరికీ అందుబాటు ధరల్లో అందిస్తామని ఆర్.ఎస్. బ్రదర్స్ మరో డెరైక్టర్ టి. ప్రసాదరావు పేర్కొన్నారు. -
ఫిట్నెస్
జూబ్లీహిల్స్‌లో ఉన్న హెలియోస్ ఫిట్నెస్ స్టూడియో ఆధ్వర్యంలో ఫిట్‌నెఃస్‌పై పూర్తిస్థాయి అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని సినీ దర్శకుడు పి. సురేందర్‌రెడ్డి, నటి ఛార్మి, ఇషాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా హెలియోస్ నిర్వాహకుడు, నగరంలోని తొలి సర్టిఫైడ్ ట్రైనర్ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఫిట్‌నెస్‌పై ఆసక్తి పెరుగుతున్నా అవగాహనా లోపం కారణంగా జిమ్‌లలో మరణాలు, వ్యాయామ సమయంలో అనారోగ్యాలు సంభవిస్తున్నాయన్నారు. ఆహారపు అలవాట్లపై అవగాహన లేక యువత ప్రమాదంలో పడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సాక్షి, సిటీప్లస్ -
సినిమా రివ్యూ: జంప్ జిలాని
నటీనటులు: అల్లరి నరేశ్, ఇషా చావ్లా, స్వాతి దీక్షిత్, రావు రమేశ్, పోసాని కృష్ణ మురళి, వేణుమాధవ్, హేమ, రఘుబాబు, కోట శ్రీనివాసరావు దర్శకత్వం: సత్తిబాబు నిర్మాత: అంబికా రాజు సంగీతం: విజయ్ ఎబెనెజెర్ ప్లస్ పాయింట్స్: పర్వాలేదనిపించే క్లైమాక్స్ మైనస్ పాయింట్స్: కథ, కథనం, సినిమా లెంగ్త్ ఎడిటింగ్ మ్యూజిక్ గతంలో తనదైన స్టైల్ తో కామెడీ స్టార్ గుర్తింపు తెచ్చుకున్న 'అల్లరి' నరేశ్ ను ఫ్లాఫ్ లు వెంటాడుతున్నాయి. ఇటీవల విడుదలైన 'లడ్డూబాబు' ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. లడ్డూబాబు తర్వాత ఓ తమిళ చిత్రం 'కలకలప్పు' రీమేక్ మలిచి తెలుగులో 'జంప్ జిలాని' చిత్రంగా ప్రేక్షకులకు అందించారు. సత్తిబాబు దర్శకత్వంలో అల్లరి నరేశ్ సరసన ఇషా చావ్లా, స్వాతి దీక్షిత్ లు నటించిన ఈ చిత్రం జూన్ 12 తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత కొద్దికాలంగా పరాజయాల బారిన పడిన అల్లరి నరేశ్ కు 'జంప్ జిలాని' ఎలాంటి టాక్ సంపాదించుకుందో తెలుసుకోవాలంటే ఓసారి కథలోకి వెళ్లాల్సిందే. సత్తిబాబు, రాంబాబు(అల్లరి నరేశ్) ఇద్దరు కవల పిల్లలు. సత్తిబాబు దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ అయితే, రాంబాబు చిల్లర దొంగతనాలు, పేకాటతో జల్సా చేసే ఓ పోకిరి లాంటోడు. సత్తిబాబు సోదరులకు నిడుదవోలులో ఒకప్పుడు గొప్పగా పేరు చెప్పుకునే సత్యనారాయణ కాఫీ విలాస్ అనే హోటల్ ఉండేది. అయితే కాలక్రమేణ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్ల సంస్కృతి పెరగడంతో హోటల్ నష్టాల్లో కూరుకుపోతుంది. ఎలాగైనా తన వంశానికి గొప్ప పేరు తెచ్చిన హోటల్ కు పూర్వవైభవాన్ని సంపాదించే పట్టుదలతో ఉన్న సత్తిబాబు.. మాధవి(ఫుడ్ ఇన్స్ పెక్టర్)తో ప్రేమలో పడుతాడు. తమ హోటల్ లోనే పనిచేసే తన మరదలు(స్వాతి దీక్షిత్)ను రాంబాబు ప్రేమిస్తుంటాడు. కథ ఇలా సాగుతుండగా.. మాధవి ప్రేమను దక్కించుకోవడానికి సత్తిబాబు రాయలసీమలోని ఓ ప్రాంతానికి వెళ్లాల్సివస్తుంది. అయితే రాయలసీమకు వెళ్లిన సత్తిబాబు విలన్ గ్యాంగ్ వెంటాడుతుంటారు. సత్తిబాబును విలన్ గ్యాంగ్ ఎందుకు వెంటాడుతారు?. సత్తిబాబు, రాంబాబు తమ ప్రేమ వ్యవహారాన్ని పెళ్లి పీటలు ఎక్కించారా? తమ హోటల్ కు పూర్వ వైభవం తెప్పించడంలో సఫలమయ్యారా? అనే ప్రశ్నలకు సమాధానమే 'జంప్ జిలానీ' గతంలో ఎన్నో కామెడి పాత్రలతో ఆలరించిన అల్లరి నరేశ్ సత్తిబాబు, రాంబాబు పాత్రలతో ద్విపాత్రభినయం చేశారు. అయితే గతంలో పోషించిన పాత్రలతో పోల్చితే సత్తిబాబు, రాంబాబుల పాత్రలు విభిన్నమైనవనే ఫీలింగ్ కలుగదు. అల్లరి నరేశ్ రోటిన్ పాత్రలతో ప్రేక్షకులను సంతృప్తి పరించేందుకు ప్రయత్నం చేశారు. ఇషా చావ్లా కొంత ప్రాధాన్యత ఉన్న పాత్ర లభించినా.. ఆ స్థాయిని చేరుకోలేదనే చెప్పవచ్చు. గ్లామర్ తో కూడా ఆకట్టుకోవడంలో ఇషా విఫలమైంది. స్వాతి దీక్షిత్ పాత్ర కేవలం గ్లామర్ కే పరిమితమైంది. రాయలసీమలో ఫ్యాక్షన్ నేతగా పోసాని కృష్ణమురళి తనదైన శైలిలో నటించారు. పాత్రల పరిధి మేరకు రావు రమేశ్ విలనిజంతో కూడిన కామెడీ పండించడంలోనూ తన మార్కును సొంతం చేసుకోలేకపోయారు. రఘుబాబు, వేణుమాధవ్ పాత్రలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. విశ్లేషణ: 'హలో బ్రదర్' లాంటి కాన్సెప్ట్ తో మాస్, క్లాస్ కాంబినేషన్ తో ఈవీవీ చేసిన ప్రయోగాన్ని స్పూర్తిగా తీసుకుని రూపొందించిన సత్తిబాబు, రాంబాబు పాత్రలు ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది. కథ లో పస లేకపోవడం, దానికి తోడుగా కథనం కూడా పేలవంగా ఉండటంతో అంతా గందరగోళంగా మారింది. వేణుమాధవ్, రఘుబాబు పాత్రలు సహజంగా హస్యాన్ని పండించలేకపోగా.. సన్నివేశాల మధ్య అవసరం లేకునా దూరిన ఫీలింగ్ కనిపించింది. ఇక చిత్ర నిడివి కూడా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టడం ఖాయం. తొలిభాగం, ద్వితీయ భాగం ఫ్లాట్ గా నడిపించి... కైమాక్స్ తో మేనెజ్ చేస్తామని ప్లాన్ అంతగా వర్కవుట్ కాలేకపోయింది. ఈ చిత్ర అధిక భాగం విసిగించే రీతిలో సాగిన కొంతలో కొంత క్లైమాక్స్ ప్రేక్షకుడికి కొంత ఊరట కలిగించే అంశం. ఇక మ్యూజిక్ అంశానికి వస్తే తెలుగు నేటివిటి స్పష్టంగా మిస్సయిందనే చెప్పవచ్చు. విజయ్ ఎబెనెజెర్ సంగీతం తెలుగు ప్రేక్షకుల టేస్ట్ కు దూరంగా ఉంది. మారుతున్న ప్రేక్షకుల అభిరుచి అంచనా వేయడంలో సత్తిబాబు తడబాటు గురయ్యారు. పాత చింతకాయ పచ్చడినే 'జంప్ జిలాని' అనే ప్యాక్ అందించారే తప్ప.. పక్కా హస్యాన్ని పంచలేకపోయారు. ఓవరాల్ గా చిత్ర విజయం ఏంటనే ప్రశ్న వేసుకుంటే... బీ, సీ సెంటర్లలో ప్రేక్షకుల ఆదరణ పొందితే తప్ప అల్లరి నరేశ్ ఖాతాలో సక్సెస్ చేరుతుంది. ట్యాగ్: ప్రేక్షకులు 'జంప్ జిలాని' -
నేను కూడా జంప్ జిలానీనే
నేను కూడా జంప్ ‘‘నన్ను చూసి, చాలామంది సున్నిత మనస్కురాలు అనుకుంటారు. నిజంగా కూడా అంతే. కానీ, నా మనస్తత్వానికి భిన్నంగా నెగటివ్ రోల్ చేయాలని ఉంది’’ అంటున్నారు ఇషా చావ్లా. ‘ప్రేమ కావాలి’తో తెలుగులో కథానాయికగా పరిచయమైన ఇషా ఆ తర్వాత మూడు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ‘అల్లరి నరేశ్’ సరసన ఆమె నటించిన ‘జంప్ జిలానీ’ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇషా చావ్లా మాట్లాడుతూ - ‘‘ఇందులో నేను హెల్త్ ఆఫీసర్ పాత్ర చేశాను. సినిమాలో ఇతర పాత్రలను డామినేట్ చేస్తుంటాను. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. వినోద ప్రధానంగా సాగే సినిమాలు చేస్తే చాలా హాయిగా ఉంటుంది. ‘అల్లరి’ నరేశ్ అయితే సినిమాలో మాత్రమే కాదు.. లొకేషన్లో కూడా ఏవేవో జోక్స్ వేసేవారు. దాంతో షూటింగ్ అంతా చాలా సందడిగా సాగింది. దర్శకుడు సత్తిబాబుగారికి తనకేం కావాలో బాగా తెలుసు. ‘సీన్ అర్థమైందా.. ’ అని అడుగుతారు. అర్థం అయ్యిందంటే ‘ఓకే షాట్ తీద్దాం’ అంటారు. లేకపోతే మళ్లీ వివరంగా చెప్పేవారు’’ అని చెప్పారు. ఇంతకీ ‘జంప్ జిలానీ’ అంటే ఏంటి? అనడిగితే - ‘‘ఈ సినిమాలో ప్రతి పాత్ర ఏదో ఒక సందర్భంలో జంప్ అవుతుంటుంది. అందరూ జంప్ జిలానీలే. అందుకే ఈ టైటిల్’’ అన్నారు. మరి... నిజజీవితంలో మీరు చేసిన జంప్ల గురించి? అన్న ప్రశ్నకు -‘‘స్కూల్ డేస్‌లో నేను కూడా జంప్ జిలానీనే. ఎప్పుడూ జంపింగ్‌లే. సరిగ్గా వెళ్లేదాన్ని కాదు’’ అని చెప్పారు ఇషా. ముద్దు సన్నివేశాలు, ఎక్స్పోజింగ్ గురించి తన అభిప్రాయం చెబుతూ -‘‘ఇప్పటివరకు లిప్ లాక్ సీన్స్‌లో నటించమని ఎవరూ అడగలేదు. పనిగట్టుకుని అలాంటి సన్నివేశాలు చేయాలని నాకూ లేదు. ఒకవేళ భవిష్యత్తులో అడిగితే అప్పుడు ఆలోచిస్తా. ఎక్స్పోజింగ్ కూడా హద్దులు దాటనంతవరకే బాగుంటుంది. ఆ విషయంలో కొన్ని నియమాలు పెట్టుకున్నా’’ అన్నారు ఇషా చావ్లా. జిలానీనే! -
వేసవి వేడిని తగ్గించే వినోదం
‘‘తమిళంలో ఘనవిజయం సాధించిన ‘కలగలప్పు’ చిత్రాన్ని తెలుగు వాతావరణానికి అనుగుణంగా మార్పులూ చేర్పులూ చేసి తీస్తున్నాం. తాత సంపాదించిన హోటల్‌ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మనవళ్లు ఏం చేశారన్నదే కథాంశం. ‘అల్లరి’ నరేశ్‌కి సరిగ్గా సరిపోయే కథ ఇది’’ అని చిత్ర సమర్పకులు ‘అంబికా’ కృష్ణ చెప్పారు. అల్లరి నరేశ్, ఇషా చావ్లా, స్వాతి దీక్షిత్ కాంబినేషన్లో అంబికా రాజా, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘జంప్ జిలాని’. ఇ.సత్తిబాబు దర్శకుడు. ఈ సినిమా ప్రచార చిత్రాలను దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఇటీవల హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. సత్తిబాబు మాట్లాడుతూ -‘‘ఇందులో కొన్ని పాత్రలు కథానుగుణంగా జంప్ అవుతుంటాయి. అందుకే ఈ టైటిల్ పెట్టాం. వేసవి వేడిని తగ్గించేంత వినోదం ఇందులో ఉంటుంది’’ అని చెప్పారు. ఇది నూటికి నూరుశాతం హిట్ మూవీ అవుతుందని ‘అల్లరి’ నరేశ్ నమ్మకం వ్యక్తం చేశారు. ఈ నెల 26న పాటలనూ, వచ్చే నెల మొదటి వారంలో చిత్రాన్నీ విడుదల చేస్తామని ‘అంబికా’ రాజా తెలిపారు. ఈ కార్యక్రమంలో కోట శ్రీనివాసరావు, స్వాతీ దీక్షిత్, రఘుబాబు, పోసాని, ‘అంబికా’ రామచంద్రరావు తదితరులు మాట్లాడారు. -
‘హలో బ్రదర్’ని తలపించేలా...
వారసత్వంగా వస్తున్న ఆస్తిని కాపాడుకోడానికి ఓ కుర్రాడు ఎన్ని పాట్లు పడ్డాడు? అనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కుతోన్న హాస్యభరిత చిత్రం ‘జంప్ జిలాని’. అల్లరి నరేశ్ తొలిసారి అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి ఇ.సత్తిబాబు దర్శకుడు. అంబికా రాజా నిర్మాత. ఇషా చావ్లా, సాక్షి దీక్షిత్ కథానాయికలు. టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘‘హలో బ్రదర్’లో నాగార్జునగారి ద్విపాత్రాభినయాన్ని తలపించేలా ఇందులో అల్లరి నరేశ్ పాత్రలు సాగుతాయి. ఇందులో ఇషా చావ్లా ఫుడ్ ఇన్స్పెక్టర్గా నటిస్తోంది. నాన్‌స్టాప్ ఎంటర్టైనర్గా ఉంటుందీ సినిమా’’ అని తెలిపారు. ‘‘తమిళ చిత్రం ‘కలగలప్పు’కు ఈ చిత్రం రీమేక్. రెండు పాత్రల్లో నరేశ్ కావల్సినంత వినోదాన్ని పంచుతారు. ఇందులోని ప్రతి సన్నివేశం కడుపుబ్బ నవ్వించేలా ఉంటుంది. ప్రస్తుతం బ్యాంకాక్, పుకెట్లలో నరేశ్, ఇషా, సాక్షి దీక్షిత్‌లతో పాటల్ని తీస్తున్నాం. ఓ వైపు రీ-రికార్డింగ్ కూడా జరుగుతోంది’’ అని నిర్మాత చెప్పారు. విజయ్ ఎబెంజర్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను త్వరలోనే విడుదల చేసి, మే నెలలో సినిమాను విడుదల చేస్తామని సమర్పకుడు అంబికా కృష్ణ తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, అంబికా కృష్ణ బ్రదర్స్. -
నటిగా రాణిస్తానని అనుకోలేదు
అనుకోకుండా సినీ రంగంలో అడుగుపెట్టిన తనను తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతగానో ఆదరించిందని సినీ హీరోయిన్ ఇషాచావ్లా అన్నారు. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో షూటింగ్లో పాల్గొన్న ఆమె స్థానిక విలేకర్లతో కొద్దిసేపు ముచ్చటించారు. ''నేను ఢిల్లీలో పుట్టాను. అక్కడే పొలిటికల్ సైన్స్‌లో పీజీ పూర్తిచేశా. తండ్రి ఢిల్లీలో యూపీఎస్ సంస్థలో కన్సల్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నారు. చదువుకుంటున్న సమయంలో నాకు తెలియకుండానే కెమెరామన్ చోటానాయుడుకు నా ఫొటోలు పంపించారు. ఆయన నన్ను హీరోయిన్గా తీసుకుందామని దర్శకుడు విజయభాస్కర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే నాకు కబురు రావడంతో వెళ్లగా ఒక్క రోజులోనే నన్ను ఎంపిక చేశారు. 2010లో విజయభాస్కర్ దర్శకత్వం వహించిన 'ప్రేమకావాలి' నా మొదటి సినిమా. ఆ తర్వాత సునీల్ హీరోగా పూలరంగడు చిత్రంలో నటించా. ఆ సినిమా నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. శ్రీమన్నారాయణ, మిస్టర్ పెళ్లికొడుకు చిత్రాలు చేశాను. నాలుగు తెలుగు చిత్రాల్లో నటించడంతో తెలుగు పూర్తిగా నేర్చుకున్నాను. కన్నడంలో హీరో దర్శన్‌తో నటించిన విరాట్ చిత్రం త్వరలో విడుదలవుతుంది. హిందీలో సల్మాన్‌ఖాన్, తెలుగులో నాగార్జున నా అభిమాన హీరోలు. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడమే నా లక్ష్యం" అని ఇషాచావ్లా వెల్లడించారు. -
ఒకడు క్లాస్.. ఒకడు మాస్
‘సుడిగాడు’ తర్వాత మళ్లీ అల్లరి నరేష్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇ.సత్తిబాబు దర్శకుడు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, అంబికా కృష్ణ సంయుక్త సమర్పణలో రూపొందుతోన్న ఈ చిత్రానికి అంబికా రాజా నిర్మాత. ఈ చిత్రంలో కథానాయికగా ఇషా చావ్లాను ఎంపిక చేశారు. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో జరుగుతోంది ఈ చిత్రం గురించి అంబికా కృష్ణ చెబుతూ-‘‘తమిళంలో విజయం సాధించిన ‘కలగలుపు’ చిత్రం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. అందుకే హక్కులు కొన్నాం. మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం రీమేక్ అవుతోంది. మాతృకలో అంజలి పోషించిన పాత్రకు ఇందులో ఇషా చావ్లాను ఎంపిక చేశాం. మరో నాయికగా స్వాతి దీక్షిత్ నటిస్తుంది. ఈ చిత్రం తప్పక విజయం సాధిస్తుందని నా నమ్మకం’’ అన్నారు. అనుభవం ఉన్న నటీనటులు, ప్రతిభ ఉన్న సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న చిత్రమిదని నిర్మాత చెప్పారు. వేసవి కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తామని అంబికా రామచంద్రరావు తెలిపారు. ఇందులో నరేష్ అన్నదమ్ములుగా నటిస్తున్నారని, ఓ పాత్ర మాస్‌గా, ఓ పాత్ర క్లాస్‌గా ఉంటుందని, నాగార్జునకు ‘హలోబ్రదర్’ ఎంత పేరు తెచ్చిందో, ఈ చిత్రం నరేష్‌కి అంతటి పేరు తెస్తుందని సత్తిబాబు నమ్మకం వ్యక్తం చేశారు.