
ఆర్‌ఎస్ బ్రదర్స్ రజతోత్సవ వేడుకలు
హైదరాబాద్: ప్రముఖ వస్త్రాభరణ విక్రయ సంస్థ ఆర్.ఎస్. బ్రదర్స్ సంస్థ 25వ వసంతంలోకి ప్రవేశించింది. ఈ రజతోత్సవం సందర్భంగా వినియోగదారులకు ప్రత్యేకమైన ఆఫర్లనందిస్తున్నామని ఆర్.ఎస్. బ్రదర్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రజతోత్సవ వేడుకలను ప్రముఖ సినీ నటి ఇషా చావ్లా(శ్రీమన్నారాయణ సినిమా ఫేమ్) ప్రారంభించారని ఆర్.ఎస్. బ్రదర్స్ డెరైక్టర్ పి. వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. 1990లో తమ సంస్థ ప్రారంభమైందని, ఇప్పుడు 11 శాఖలతో రూ.770 కోట్ల వార్షిక టర్నోవర్‌తో ముందుకు వెళుతున్నామని మరో డెరైక్టర్ రాజమౌళి వివరించారు.
రజతోత్సవాల సందర్భంగా అందిస్తున్న ఆఫర్ల వివరాలను కంపెనీ డెరైక్టర్ పి. సత్యనారాయణ వివరించారు. ప్రతీ కొనుగోలుపై తక్షణ కానుక ఉంటుందని, లక్కీ డ్రాలు నిర్వహిస్తున్నామని, 5 కార్లు, 25 టూవీలర్లు, 25 సిల్వర్ బౌల్స్, 25 నెక్లెస్‌లు, 25 వాషింగ్ మెషీన్లు, 25 ఫ్రిజ్‌లు, 25 ఏసీలు, 25 టీవీలు, 25 ట్యాబ్‌లు బహుమతులుగా అందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో వస్తు, సేవల నాణ్యతను మరింతగా పెంపొందించి, అందరికీ అందుబాటు ధరల్లో అందిస్తామని ఆర్.ఎస్. బ్రదర్స్ మరో డెరైక్టర్ టి. ప్రసాదరావు పేర్కొన్నారు.