స్పెషల్ సాంగ్తో రీ ఎంట్రీ | isha chawla cme back with a special song with sai dharam tej | Sakshi
Sakshi News home page

స్పెషల్ సాంగ్తో రీ ఎంట్రీ

Published Thu, Jan 14 2016 2:00 PM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM

స్పెషల్ సాంగ్తో రీ ఎంట్రీ - Sakshi

స్పెషల్ సాంగ్తో రీ ఎంట్రీ

ఆది హీరోగా తెరకెక్కిన 'ప్రేమ కావాలి' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఇషా చావ్లా. తరువాత పూల రంగడు సినిమాతో మరో సక్సెస్ సాధించిన ఈ ఢిల్లీ భామ అనంతరం బాలకృష్ణ లాంటి స్టార్ హీరో సరసన శ్రీమన్నారాయణ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. అయితే ఈ సినిమా ఆశించిన స్ధాయిలో ఆడకపోవటం, ఆ తరువాత అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన జంప్ జిలానీ సినిమా కూడా నిరాశపరచటంతో ఇషా తెరమీద కనిపించటం మానేసింది.

లాంగ్ గ్యాప్ తరువాత మరోసారి టాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతోంది ఇషా చావ్లా. అయితే హీరోయిన్గా వర్క్ అవుట్ కాకపోవటంతో ఈ సారి స్పెషల్ సాంగ్తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలతో వరుస సూపర్ హిట్స్ అందుకున్న సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న 'సుప్రీమ్' సినిమాలో స్పెషల్ సాంగ్లో నటిస్తోంది. పటాస్ ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సుప్రీం వేసవిలో రిలీజ్కు రెడీ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement