
న్యూఢిల్లీ: సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయన నటించిన 100వ సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాకు పన్ను రాయితీ తీసుకొని కూడా టికెట్ రేట్లు తగ్గించలేదని సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. పన్ను రాయితీ ప్రయోజనాలను ప్రేక్షకులకు బదలాయించలేదని వెల్లడించింది.
దీంతో పన్ను రాయితీ పొందిన డబ్బు మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి రికవరీ చేయాల్సిందిగా పిటిషన్‌లో విజ్ఞప్తి చేసింది. ఈ కేసు విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి. వై.చంద్ర చూడ్ ధర్మాసనం.. వివరణ ఇవ్వాల్సిందిగా సినీ నటుడు బాలకృష్ణ, సహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment