Gautamiputra Satakarni movie
-
సినీ నటుడు బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు
-
నటుడు నందమూరి బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయన నటించిన 100వ సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాకు పన్ను రాయితీ తీసుకొని కూడా టికెట్ రేట్లు తగ్గించలేదని సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. పన్ను రాయితీ ప్రయోజనాలను ప్రేక్షకులకు బదలాయించలేదని వెల్లడించింది. దీంతో పన్ను రాయితీ పొందిన డబ్బు మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి రికవరీ చేయాల్సిందిగా పిటిషన్లో విజ్ఞప్తి చేసింది. ఈ కేసు విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి. వై.చంద్ర చూడ్ ధర్మాసనం.. వివరణ ఇవ్వాల్సిందిగా సినీ నటుడు బాలకృష్ణ, సహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. -
'వాళ్ల అభిమానమే నన్ను ఇంతవాడిని చేసింది'
హైదరాబాద్ : తెలుగు ప్రేక్షక దేవుళ్ల అభిమానమే నన్ను ఇంతవాడిని చేసిందని యువరత్న నందమూరి బాలకృష్ణ తెలిపారు. నాకు ... నా అభిమానుల మధ్య ఉన్న బంధం ఎన్నటికీ విడదీయరానిదన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్బంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ... నా నటనా ప్రస్థానంలో ఎన్నో పాత్రలు చేశానని చెప్పారు. తెలుగుజాతి ఆత్మగౌరవం చాటి చెప్పిన మహావ్యక్తి గౌతమీపుత్ర శాతకర్ణి అని ఆయన గుర్తు చేశారు. అలాంటి మహానీయుడి చరిత్ర గురించి ప్రతిఒక్కరు తెలుసుకోవాలన్నారు. ఈ చిత్రంలో నటించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని నందమూరి బాలకృష్ణ చెప్పారు.