
సినీ ఇండస్ట్రీని కరోనా పట్టి పీడిస్తోంది. మహేశ్‌బాబు, మంచు లక్ష్మి, మంచు మనోజ్, తమన్, సత్యరాజ్, త్రిష, రాజేంద్రప్రసాద్ సహా పలువురు కరోనాతో పోరాడుతున్నారు. తాజాగా హీరోయిన్ ఇషా చావ్లా కోవిడ్ బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడించింది. తనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందన్న ఆమె ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు తెలిపింది. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన 'ప్రేమ కావాలి' చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది ఇషా చావ్లా. 'పూలరంగడు', 'మిస్టర్ పెళ్లికొడుకు', 'జంప్ జిలానీ' తదితర చిత్రాల్లో నటించింది. 'విరాట్' సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోనూ అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆమె కబీర్‌లాల్ డైరెక్ట్ చేస్తున్న 'దివ్యదృష్టి' సినిమాలో నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment