Isha Chawla About Bigg Boss 5 Telugu Entry Rumors - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌

Published Mon, Aug 9 2021 11:47 AM | Last Updated on Wed, Sep 1 2021 7:58 PM

Actress Isha Chawla Clarity About Entry Into Bigg Boss 5 Telugu - Sakshi

బుల్లితెరపై ఎంతగానో అలరిస్తూ ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేస్తున్న రియాలిటీ షో బిగ్‌బాస్‌. ఈ షో ఐదో సీజన్‌ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు స్టార్‌మా అధికారికంగా ప్రకటిస్తూ బిగ్‌బాస్‌-5లోగోని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నంచి అసలు కథ మొదలైంది. అప్పటి నుంచి వార్తలు, లీకులు ఒక్కసారిగా నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఇక లీకుల రూపంలో కంటెస్టెంట్ల పేర్లు రోజుకొకటి తెర మీదకు వస్తోంది. తాజాగా నటి ఇషాచావ్లా బిగ్‌ బాస్‌ ఎంట్రీకి పై స్పందించింది. కంటెస్టెంట్లకి ఇండస్ట్రీలో ఫేమ్‌ ఎలా ఉన్నా బిగ్ బాస్‌ షోలో పాల్గొనడం ఓ వ‌రంగా మారుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఈ షో ద్వారా తారలకి మ‌ళ్లీ జ‌నాల‌లో బాగా గుర్తింపు దక్కుతోంది. అందుకే కొందరు బిగ్ బాస్ షోలో పాల్గొనేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. నెట్టింట హల్‌ చల్‌ చేస్తున్న జాబితాలో ఇప్ప‌టికే సురేఖా వాణి, యాంక‌ర్ ర‌వి, వ‌ర్షిణి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా ప్రేమకావాలి హీరోయిన్‌ ఇషా చావ్లా బిగ్ బాస్ షో ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేసింది. ఇన్‌స్టాలో ఈ అమ్మడు ఫాలోవర్లు బిగ్ బాస్ ఎంట్రీ గురించి ప్రశ్నలు కురిపించారు. అందుకు స్పందిస్తూ...  తాను బిగ్ బాస్ షోకి వెళ్లడం లేదని తేల్చి చెప్పింది. ఈ సమాధానంతో లిస్ట్‌లోంచి ఓ కంటెస్టెంట్ పేరు తగ్గినట్టైంది. ఇక లీకు వీరులు ఇషా స్థానంలో తరువాత ఎవ‌రి పేరుని తెరపైకి తెస్తారో చూడాలి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement