Bigg Boss 5 Telugu Shanmukh Jaswanth Remuneration - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: ఆ స‍్టార్‌కే భారీ రెమ్యునరేషన్‌..ఎంతటే..

Published Fri, Aug 6 2021 12:21 PM | Last Updated on Wed, Sep 1 2021 7:59 PM

Shanmukh Jaswanth: Bigg Boss 5 Telugu Highest Paid Contestant - Sakshi

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న రియాలిటీ షో బిగ్‌బాస్‌. త్వరలోనే ఈ షో ఐదో సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఇప్పటికే స్టార్‌మా అధికారికంగా ప్రకటిస్తూ బిగ్‌బాస్‌-5లోగోని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్‌ల లిస్ట్ ఒకటి లేటెస్ట్‌గా బయటకి వచ్చింది. ఇందులో యాంకర్‌ వర్షిణి, యాంకర్‌ రవి, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సురేఖ వాణి, బుల్లితెర నటి నవ్యస్వామి, యూట్యూబర్ షణ్ముఖ్‌ జశ్వంత్, హీరోయిన్‌ ఈషా చావ్లా, జబర్దస్త్‌ ప్రియాంక, ఆనీ మాస్టర్‌, కార్తీక దీపం ఫేమ్‌ ఉమా దేవి, బుల్లితెర నటుడు సన్నీ, మోడల్‌ జస్వంత్‌, పూనం భాజ్వా, యాంకర్‌ శివ, లోబో, యాంకర్‌ ప్రత్యూష ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ఇందులో యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముక్‌కి ఇస్తున్న  రెమ్యునరేషన్‌ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.

‘ది సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’ వెబ్‌సిరీస్‌తో యూత్‌లో మాంచి క్రేజ్‌ సంపాదించుకున్న షణ్ముఖ్‌ జస్వంత్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. యూట్యూబ్‌లో అతడు సృష్టించే రికార్డ్స్‌ మామూలుగా ఉండవు. పెద్ద హీరోల సినిమాలకు, వీడియోలకు రానన్ని వ్యూస్‌, లైకులు మనోడి వీడియోలకు వస్తాయి. షణ్ముఖ్‌ ఒక్క వీడియో పోస్ట్‌ చేశాడంటే.. అది ట్రెండింగ్‌లో ఉండాల్సిందే. గత మూడు సీజన్ల నుంచి బిగ్‌బాస్‌ నిర్వాహకులు షన్నూని సంప్రదించినా ఆఫర్‌ను రిజెక్ట్‌ చేస్తూ వచ్చాడు. కానీ ఈ సీజన్‌కి మాత్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడట.

దీంతో షణ్ముఖ్‌ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని షో నిర్వాహకులు కూడా అతడికి భారీ రెమ్యునరేషన్‌ ఆఫర్‌ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం బిగ్‌బాస్‌ సీజన్‌-5లో మరే కంటెస్టెంట్‌కి లేని విధంగా షణ్ముఖ్‌కి కోటి వరకు పారితోషికాన్ని ఇవ్వడానికి మేకర్స్‌ అంగీకరించారట. ఇప్పటివరకు ఇంత భారీ రెమ్యునరేషన్‌ అందుకున్న వాళ్లలో యాంకర్‌ శ్రీముఖి కూడా ఒకరు. ప్రస్తుతం షణ్ముఖ్‌ పాపులారిటీ నేపథ్యంలో అతడు అడిగినంత ఇచ్చేందుకు మేకర్స్‌ ఒప్పుకున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఇక సెప్టెంబర్‌ 5న బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ప్రారంభించాలని షో నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈసారి కూడా నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement