![ఫిట్‌నెస్](/styles/webp/s3/article_images/2017/09/2/51406407412_625x300.jpg.webp?itok=s7Aj_G8C)
ఫిట్‌నెస్
జూబ్లీహిల్స్‌లో ఉన్న హెలియోస్ ఫిట్‌నెస్ స్టూడియో ఆధ్వర్యంలో ఫిట్‌నెఃస్‌పై పూర్తిస్థాయి అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని సినీ దర్శకుడు పి. సురేందర్‌రెడ్డి, నటి ఛార్మి, ఇషాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా హెలియోస్ నిర్వాహకుడు, నగరంలోని తొలి సర్టిఫైడ్ ట్రైనర్ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఫిట్‌నెస్‌పై ఆసక్తి పెరుగుతున్నా అవగాహనా లోపం కారణంగా జిమ్‌లలో మరణాలు, వ్యాయామ సమయంలో అనారోగ్యాలు సంభవిస్తున్నాయన్నారు. ఆహారపు అలవాట్లపై అవగాహన లేక యువత ప్రమాదంలో పడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
సాక్షి, సిటీప్‌లస్