ముంబైలో పుట్టినా.. హైదరాబాదీనే..!
పదమూడేళ్ల వయసులోనే ‘తెరకెక్కిన’ మిల్కీబ్యూటీ చార్మి. అప్పటి నుంచి అచ్చంగా తెలుగు నటిగా మారిపోయింది. సిల్వర్‌స్క్రీన్‌పై పుష్కరకాలం దాటిన ఈ నటి టాలీవుడ్ కెరీర్‌లో దాదాపు అగ్రహీరోలందరి సరసనా నటించింది. తాను హైదరాబాద్ అమ్మాయినే అంటోన్న ఈ పంజాబీ ముద్దుగుమ్మ తన అభిమాన సిటీ గురించి చెప్పిన ముచ్చట్లు ఆమె మాటల్లోనే...
..:: ఎస్బీ
నేను పంజాబీని అయినా, ముంబైలో పుట్టి పెరిగినా, హైదరాబాద్ అమ్మాయిగానే భావిస్తా. ఎందుకంటే నాకు నటిగా జన్మనిచ్చిన తెలుగు సినీ పరిశ్రమకు కేంద్రం ఈ నగరమే. హైదరాబాద్ ఇప్పుడు ఇంత హైటెక్‌సిటీగా మారిపోయింది కాబట్టి ఈ మాట చెప్పట్లేదు. ఇక్కడికి వచ్చిన కొత్తలోనే ఈ సిటీ తెగ నచ్చేసింది. ఇక్కడి జనాల జీవనశైలిలో కనిపించే వైవిధ్యం.. నాకు ఆశ్చర్యంతో పాటు ఒక విచిత్రమైన అనుభూతిని కలిగిస్తుంది. నేను వచ్చిన కొత్తలో సిటీలో ఇంత గ్రోత్ లేదు. జూబ్లీహిల్స్‌లో వెళ్తుంటే ఇంత ట్రాఫిక్ ఉండేది కాదు. ఇప్పుడైతేనా.. బాబోయ్ చెక్‌పోస్ట్ దాటాలంటే చాలు గగనమే.
ఇక్కడే స్థిరనివాసం..
నార్త్ నుంచి వచ్చిన మిగిలిన హీరోయిన్లు వచ్చి వెళ్తుంటారేమో కాని, నేనైతే హైదరాబాద్‌పై మక్కువ పెంచుకుని.. ఇక్కడో ఇల్లు తప్పనిసరిగా కొని తీరాలని నిర్ణయించుకున్నా. బహుశా మాస్ సినిమా చేసే టైమ్‌లో అనుకుంటా.. నా సంపాదనతో మణికొండలో ఫ్లాట్ కొనుక్కున్నా. ఈ సిటీలో నా ఫేవరెట్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. జూబ్లీహిల్స్‌లోని హెలియోస్ జిమ్‌లో వర్కవుట్స్, మాదాపూర్ ఇనార్బిట్‌మాల్‌లోని ఫ్యూజన్9 రెస్టారెంట్‌లో కూర్చుని ఫుడ్‌ని ఆస్వాదించడం ఇలా ఈ సిటీలో నాకున్న హాబీస్ లిస్ట్ పెద్దదే. ఇనార్బిట్ మాల్‌లో రెస్టారెంట్ నుంచి సిటీ వ్యూ అద్భుతంగా కనిపిస్తుంది. ఆ ప్లేస్‌కు వీక్లీ ఒకసారైనా వెళ్లి ఎంజాయ్ చేయడం నాకు అలవాటు.
పండుగ కళ ఇష్టం...
వినాయకచవితి, రంజాన్.. వంటి పండుగల టైమ్‌లో సిటీలో సందడి చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది. రోడ్లన్నీ కళకళలాడుతుంటాయి. ఇంత ట్రెడిషనల్‌గా ఉంటూనే అల్ట్రా మోడ్రన్‌గా వెలిగిపోయే నైట్‌లైఫ్ జోష్ కూడా అంతే స్థాయిలో ఉండడం ఈ సిటీకి మాత్రమే సాధ్యం. నా క్లోజ్ ఫ్రెండ్స్‌లో చాలా మంది ఇక్కడే ఉన్నారు. అందుకే ముంబై వెళ్లినా ఎక్కువ రోజులు ఉండలేను. హోమ్‌సిక్ ఫీలై కొన్ని రోజులకే తిరిగొచ్చేస్తా.