ఐదు భాషల్లో డబుల్‌ ఇస్మార్ట్‌ | Double Smart in five languages | Sakshi
Sakshi News home page

ఐదు భాషల్లో డబుల్‌ ఇస్మార్ట్‌

Published Tue, Jul 11 2023 12:38 AM | Last Updated on Tue, Jul 11 2023 12:38 AM

Double Smart in five languages - Sakshi

హీరో రామ్‌ పోతినేని, డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సినిమా షురూ అయింది. పూరి కనెక్ట్స్‌పై పూరి జగన్నాథ్, చార్మి నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారంప్రారంభమైంది.

‘ఇస్మార్ట్‌ శంకర్‌ అలియాస్‌ డబుల్‌ ఇస్మార్ట్‌’ అంటూ రామ్‌ డైలాగ్‌ చెప్పిన తొలి సీన్‌కి చార్మి క్లాప్‌ ఇవ్వగా, పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించారు. ‘‘ఇస్మార్ట్‌ శంకర్‌’కి సీక్వెల్‌గా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ రూ΄పొందుతోంది. పూరి జగన్నాథ్‌ చాలా పెద్ద స్పాన్‌ ఉన్న కథ రాశారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందనుంది.

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ కంటే ఈ సినిమాలో రామ్‌ని మాసియర్‌ క్యారెక్టర్‌లో చూపించబోతున్నారు పూరి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 2024 మార్చి 8న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ని రిలీజ్‌ చేస్తాం’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సీఈఓ: విషు రెడ్డి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement