కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ | Double Ismart to hit the big screens on August 15 | Sakshi
Sakshi News home page

కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌

Published Thu, Jun 27 2024 4:23 AM | Last Updated on Thu, Jun 27 2024 4:23 AM

Double Ismart to hit the big screens on August 15

హీరో రామ్‌ పోతినేని, డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. వీరిద్దరి కలయికలో వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ (2019) కి సీక్వెల్‌గా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ రూపొందుతోంది. కావ్యా థాపర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్‌ దత్‌ విలన్‌గా నటిస్తున్నారు. పూరి కనెక్ట్స్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

 ‘‘మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ రూపొందుతోంది. ఆగష్టు 15న సినిమాని విడుదల చేయనున్నాం. సినిమా రిలీజ్‌కి సరిగ్గా 50 రోజులు ఉంది. అందుకే 50 రోజుల కౌంట్‌డౌన్‌ను మార్క్‌ చేస్తూ రామ్‌ స్పెషల్‌ పోస్టర్‌ను విడుదల చేశాం. మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీ టైటిల్‌ సాంగ్‌ షూట్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ పాటకి జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మా సినిమా విడుదల కానుంది’’ అని చిత్రబృందం పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement