Unstoppable With NBK Ep 9 Promo: Balakrishna Fun With Vijay Devarakonda, Puri Jagannadh, Charmi Video Viral - Sakshi
Sakshi News home page

Unstoppable With NBK: అవన్నీ చేశాకే ఇక్కడికొచ్చి కూర్చున్నాం.. లైగర్‌ టీమ్‌లో బాలయ్య ఫన్‌

Published Tue, Jan 11 2022 11:39 AM | Last Updated on Tue, Jan 11 2022 12:28 PM

Unstoppable With NBK: Balakrishna Fun With Vijay Devarakonda, Puri Jagannadh, Charmi - Sakshi

నందమూరి బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌’. ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో ప్రసారమవుతున్న ఈ టాక్‌ షోలో ఇప్పటికే పలువురు టాలీవుడ్‌ ప్రముఖులను ఇంటర్వ్యూ  చేసిన బాలయ్య.. తాజాగా లైగర్‌ టీమ్‌తో ముచ్చటించారు. పూరీ జ‌గ‌న్నాథ్‌, ఛార్మి, విజ‌య్ దేవ‌ర‌కొండలతో బాలయ్య చేసిన సందడికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.

‘మాటల గన్‌.. మన జగన్‌’అంటూ పూరీని ఆహ్వానించాడు బాలయ్య. ఈ సందర్భంగా వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘పైసా వసూల్‌’మూవీ గురించి చర్చించుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌ను మ‌ర‌చిపోలేని పాత్ర తేడా సింగ్‌(పైసా వసూల్‌ మూవీ) అని బాలయ్య చెప్పుకొచ్చాడు. అలాగే.. నేనెంత యెద‌వ‌నో నాకే తెలియ‌దు అని ఆ సినిమాలో చెప్పిన డైలాగ్‌ను గుర్తుకు చేసుకున్నారు బాల‌కృష్ణ‌. ‘ఆ మాట నేనే అంట.. ఇంకెవరైనా అంటే కొడతా’అని బాలయ్య అనగా.. పూరీ గట్టిగా నవ్వాడు. అలాగే ఆ సినిమాలో మామా ఏక్ పెగ్ లా.. సాంగ్‌ను కూడా బాల‌కృష్ణ గుర్తు చేసుకున్నారు.

ఇక చార్మి గురించి మాట్లాడుతూ.. అల్లరి పిడుగు మూవీ టైమ్‌లో మనం ఫస్ట్‌టైం కలిశామని గుర్తుచేశాడు. ఇప్పుడు పిడుగులా అయ్యావంటూ చార్మిపై సెటైర్లు వేశాడు. అలాగే ‘సమరసింహారెడ్డి వెల్‌కమ్స్‌ అర్జున్‌ రెడ్డి’ అంటూ హీరో విజయ్‌దేవరకొండను ఆహ్వానించాడు. ‘నువ్వు రౌడీ అయితే నేను రౌడీ ఇన్‌స్పెక్టర్.. అసలు నువ్వు ఎలా రౌడీ అని ఫిక్స్‌ అయిపోయావ్‌’అని విజయ్‌ని ప్రశ్నించగా.. . ‘ఫస్ట్ నుంచి అది చేయద్దు, ఇది చేయద్దు లాంటి మాటలు విని విసిగిపోయా... లేదు ఇది కచ్చితంగా చేయాలని ఫిక్స్ అయ్యా’ అని విజయ్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత టైగర్‌ టీమ్‌కి సరదాగా కొబ్బరికాయలు కొట్టి ఇస్తూ.. ‘ఈ బిజినెస్ బాగుందే.. సైడ్ బిజినెస్’ అంటూ నవ్వులు పూయించారు. ‘బ్యాంకాక్‌లో కొబ్బరిబోండాల్లో వోడ్కా కలిపి ఇస్తారు’ అని చార్మి అనగా... ‘అవన్నీ చేశాకే ఇక్కడికొచ్చి కూర్చున్నాం’ అని బాలయ్య సమాధానం ఇచ్చాడు. లైగర్ టీమ్‌తో బాలయ్య చేసిన ఈ స్పెషల్‌ ఎపిసోడ్ .. సంక్రాంతికి ఆహాలో ప్రసారం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement