జంప్ జిలానీలకు కమలం తీర్థం | NCP colluded with BJP to impose President's rule in Maharashtra: Prithviraj Chavan | Sakshi
Sakshi News home page

జంప్ జిలానీలకు కమలం తీర్థం

Published Sun, Sep 28 2014 9:53 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

జంప్ జిలానీలకు కమలం తీర్థం - Sakshi

జంప్ జిలానీలకు కమలం తీర్థం

రారమ్మని..

ముంబై: పొత్తులు బెడి సికొట్టిన నేపథ్యంలో రాష్ట్రం లో రాజకీయ సమీకరణాలు రోజుకో రకంగా మారి పోతున్నాయి. అన్ని పార్టీల్లోనూ ఆయారాం గయారాంల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా అధికార కూటమిలో జంప్ జిలానీల సంఖ్య పెరిగి పోయింది. ఇప్పటివరకు కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులుగా చలామణి అయిన చాలామంది ఒక్కసారిగా బీజేపీ పంచన చేరిపోయారు.
 
తిరుగుబాటు అభ్యర్థుల బెడద ప్రస్తుత సీఎం పృథ్వీరాజ్ చవాన్‌కు సైతం తప్పడంలేదు. కరద్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పృథ్వీరాజ్ చవాన్ పోటీచేస్తుండగా, ఇక్కడ కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా పోటీచేయనున్న అతుల్‌భొలాసేకు బీజేపీ టికెట్ ఇచ్చింది. అలాగే ఇక్కడ సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న విలాస్ ఉండాల్కర్ పాటిల్ సైతం పార్టీ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. భొలాసే కాంగ్రెస్ ఎమ్మెల్సీ దిలీప్ దేశ్‌ముఖ్‌కు స్వయాన మేనల్లుడు. అలాగే ఇటీవల ఎన్సీపీ నుంచి బీజేపీలో చేరిన మాజీ మంత్రి సంజయ్ సావ్కరే సైతం భుసావల్ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీచేస్తున్నారు.
 
ఎన్సీపీకే చెందిన మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అయిన బాబన్‌రావ్ పచ్పుటే సైతం శ్రీగొండ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీచేస్తున్నారు. నాసిక్ జిల్లాకు చెందిన సినార్ ఎమ్మెల్యే మాణిక్‌రావ్ కొకాటే( కాంగ్రెస్) ప్రస్తుతం బీజేపీ నుంచి రంగంలో ఉండనున్నారు. అదేవిధం గా ఎన్సీపీ ఎమ్మెల్యే కిషన్ కథోర్ ముర్బాద్ నుంచి వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీచేస్తున్నారు. దక్షిణ కొల్హాపూర్‌లో మంత్రి సాతేజ్‌పాటిల్‌పై అమ ల్ మహదిక్ బీజేపీ తరఫున పోటీచేస్తున్నాడు. ఇత డు కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహదేవ్ మహదిక్‌కు స్వయాన కుమారుడు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున తన కుమార్తె హీనా బీజేపీ తరఫున నిలబడినందుకు ఎన్సీపీ నుంచి బహిష్కృతుడైన మాజీ మంత్రి విజయ్ కుమార్ గవిట్ ఇప్పుడు తన ఇలాకాలో బీజేపీ తరఫున బరిలో దిగాడు.
 
అలాగే అమరావతిలో మాజీ రాష్ర్టపతి ప్రతిభా పాటిల్ కుమారుడు రాజేంద్ర షెకావత్(కాంగ్రెస్)పై మాజీ కాంగ్రెస్ నేత సునీల్ దేశ్‌ముఖ్ బీజేపీ తరఫున పోరుకు సై అంటున్నాడు. ఇదిలా ఉండగా, నాందే డ్ జిల్లా భోకర్ నియోజకవర్గం నుంచి మాజీ ఎన్సీ పీ నాయకుడైన మాధవ్ కిన్హాల్కర్ ఇప్పుడు బీజేపీ తరఫున బరిలో నిలబడుతున్నాడు. అలాగే తాస్‌గాం-కావ్తేమహం కాల్ స్థానంలో ఎన్సీపీకి చెందిన రాష్ట్ర హోం మంత్రి ఆర్‌ఆర్ పాటిల్‌పై ఆ పార్టీ తిరుగుబాటు అభ్యర్థి అజిత్ ఘోర్పడే ఢీ అంటే ఢీ అం టున్నాడు. ఇదిలా ఉండగా, పలుస్ కాడేగావ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పతంగ్‌రావ్ కదమ్‌పై మాజీ ఎమ్మెల్యే పృథ్వీరాజ్ దేశ్‌ముఖ్ సవాలు విసురుతున్నాడు.
 
దీనికితోడు ఇంతకుముందు కాంగ్రెస్, ఎన్సీపీ సాయంతో ఇండిపెండెంట్లుగా గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు ఇప్పు డు బీజేపీ టికెట్‌పై తమ అదృష్టాన్ని పరీక్షించుకుం టున్నారు. పుణేలోని షిరాలా నియోజకవర్గం నుం చి మూడు సార్లు ఇండిపెండెంట్‌గా గెలిచి ఎన్సీపీ సానుభూతిపరుడిగా పేరుపొందిన శివాజీరావ్ నాయక్ ఇప్పుడు అదే స్థానం నుంచి బీజేపీ టికెట్‌పై పోటీచేస్తున్నాడు. అలాగే ఇటీవల వరకు నాగ్‌పూర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగిన సమీర్ మేఘే ఇప్పుడు బీజేపీ టికెట్‌పై హింగ్నా నియోజకవర్గంలో తనఅదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. నవీముంబైలోని బేలాపూర్ సెగ్మెంట్‌లో ఎన్సీపీ సీనియర్ నాయకుడు గనేష్ నాయక్‌పై ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ మందా మాత్రే బీజేపీ తరఫున పోటీచేస్తున్నాడు.
 
పన్వేల్ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రశాంత్ ఠాకూర్ ఇప్పుడు బీజేపీ తరఫున అక్కడినుంచే పోటీలో ఉన్నాడు. ముంబైలోని వర్సోవాలో ఎన్సీపీ మాజీ నేత భారతీ లావ్హేకర్ ఇప్పుడు బీజేపీ తరఫున బరిలో దిగాడు. చంద్రపూర్ జిల్లా వరోరా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌కు చెందిన సాంస్కృతిక శాఖ మంత్రి సంజయ్ దావుతలే ఈ ఎన్నికల్లో బీజే పీ తరఫున నామినేషన్ దాఖలు చేశాడు.  కాం గ్రెస్ సీనియర్ నేత నారాయణ్ రాణేకు అత్యంత ఆప్తుడైన రాజన్ తేలీ కొంకణ్ ప్రాంతంలోని సావంత్‌వాడీ నుంంచి బీజేపీ తరఫున రంగంలో ఉన్నాడు. ఇదిలా ఉండగా, శివసేనపార్టీకి కూడా తిరుగుబాటు బెడద తప్పలేదు.
 
ఆ పార్టీకి చెందిన ముంబై మాజీ మేయర్ శుభా రావుల్ దహిసర్ నుంచి ఈ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ టికెట్‌పై పోటీచేస్తున్నారు. అలాగే ఠాణేలో పార్టీ అభ్యర్థి ఏక్‌నాథ్ షిండేకు వ్యతి రేకంగా అదే పార్టీకి చెందిన అనంత్ తారే బరిలో నిలబడ్డాడు. రత్నగిరి నుంచి ఎన్సీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉదయ్ సామంత్ శనివారం బీజేపీలో చేరి అదే స్థానం నుంచి పోటీచేస్తున్న విషయం తెలిసిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement