Prudviraj Chavan
-
రామ్ చరణ్ అంటే క్రష్, అతడితో డేట్‌కి వెళ్తా: మాజీ ప్రపంచ సుందరి
మాజీ ప్రపంచ సుందరి, నటి మానుషి చిల్లర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు రామ్ చరణ్ అంటే క్రష్ అని అతడితో డేట్‌కు వెళ్లానంటూ తాజాగా ఓ ఇంటర్య్వూలో ఆమె చేసిన కామెంట్స్ హాట్‌టాపిక్‌గా నిలిచాయి. మానుషి బాలీవుడ్లో తొలిసారిగా నటించిన చిత్రం ‘పృథ్విరాజ్’. ఈ మూవీలో అక్షయ్ కుమార్ సరసన ఆమె నటించింది. ఈ సినిమా రేపు(జూన్ 3న) థియేటర్లలోకి రానుంది. చదవండి: OTT: 3 వారాలకే అమెజాన్‌లో సర్కారు వారి పాట స్ట్రీమింగ్, కానీ.. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా ఆమె వరుస ఇంటర్య్వూలతో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఆమెకు.. ఫేవరెట్ హీరో ఎవరు? నెక్స్ట్ మూవీ ఏ హీరోతో చేయాలనుకుంటున్నారు? వంటి ప్రశ్నలు ఎదురయ్యాయి. వీటిపై ఆమె స్పందిస్తూ.. రామ్ చరణ్‌తో వర్క్ చేయాలని ఉందని, ఆర్ఆర్ఆర్ చూశాక చరణ్‌కు ఫ్యాన్ అయిపోయానని చెప్పింది. ఇక మరో ఇంటర్య్వూలో ఇండస్ట్రీలో మీరు ఏ హీరోతో డేటింగ్‌కు వేళ్లాలనుకుంటున్నారు? అని అడగ్గా.. రామ్ చరణ్ అని సమాధానం ఇచ్చింది. చదవండి: ఎఫ్ 3 ఓటీటీకి వచ్చేది అప్పుడేనట, మూవీ టీం క్లారిటీ ఇక అతడికి పెళ్లి అయిపోయింది కదా అని చెప్పడంతో.. పెళ్లి కాకపోయి ఉంటే డేట్‌కి వెళ్దామా అని చరణ్‌ను తానే స్వయంగా అడిగేదాన్ని అని చెప్పింది. డేటింగ్లో ఏం చేస్తారని అడగ్గా.. కలిసి సినిమాలు చూస్తాం, ఇష్టమైన ఫుడ్ తింటాం, ఇంకా ఎన్నెన్నో వియాలను మాట్లాడుకుంటామని మానుషి చెప్పుకొచ్చింది. కాగా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన పృథ్వీరాజ్ సినిమాలో అక్షయ్ కుమార్ టైటిల్ రోల్ పోషిస్తుండగా.. మానుషి అతడి భార్యగా కనిపించనుంది. చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, అశుతోష్ రాణా, సోనూ సూద్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. -
‘ఆ రెండు ఒకే రోజు జరగటం యాదృచ్ఛికం’
ప్రపంచ మాజీ సుందరి మానుషి చిల్లర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మానుషి తొలి చిత్రంతోనే ఖిలాడీ అక్షయ్ కుమార్‌కు జోడిగా నటించే అవకాశం దక్కించుకున్నారు. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న ‘పృథ్వీరాజ్’ సినిమాలో చక్రవర్తి ప్రేమికురాలు రాణి సంయోగితగా ఆమె కనిపించనున్నారు. అయితే చిత్ర షూటింగ్లో భాగంగా మానుషి తన తొలి హింది సినిమా ‘పృథ్వీరాజ్’ మొదటి షాట్ తీయటంలో సోమవారం పాల్గొంది. దీంతో మానుషి తాను మొదటిసారి సినిమాల్లో నటించటం కోసం కెమెరా ముందుకు వచ్చిన ఈ రోజు (నవంబర్ 18). అలాగే రెండేళ్ల కిందట 2017లో ప్రపంచ సుందరిగా కిరీటం దక్కించుకున్నది ఇదే రోజు అవడాన్ని చాలా యాదృచ్ఛికంగా భావిస్తున్నానని మానుషి సోషల్ మీడియాలో పంచుకుంది. రెండు ముఖ్యమైన వియయాలు ఒకే రోజు జరగటం తనకు సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. నవంబర్ 18 తనకు చాలా ప్రత్యేకమైన రోజని తెలిపారు. తన జీవితంలో మైలురాయిగా నిలిచిపోయే రెండు అద్భుతమైన సంఘటనలు ఒకేరోజు ( నవంబర్18) చోటుచేసుకోవటం పట్ల థ్రిల్‌గా ఫీల్ అవుతున్నాని మానుషి తెలిపారు. View this post on Instagram Feeling blessed 🙏🏻💫 #Prithviraj puja #Diwali2020 @akshaykumar #DrChandraprakashDwivedi @yrf @prithvirajmovie A post shared by Manushi Chhillar (@manushi_chhillar) on Nov 15, 2019 at 12:39am PST తాను చాలా మందికి కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పారు. నటీగా తనను తాను నిరుపించుకోవడానికి ఎంతో కష్టపడ్డానని తెలిపారు. అదేవిధంగా హార్డ్ వర్క్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పుకొచ్చారు. తనకు, తాను నటించిన చిత్రం ‘పృథ్వీరాజ్’కు ఈ విశ్వం టన్నుల కొద్ది అదృష్టాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్టు మానుషి తెలిపారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు శుక్రవారం ముంబైలో జరిగిన విషయం తెలిసిందే. ఐశ్వర్యారాయ్, ప్రియాంక చోప్రా మాదిరి మానుషి కూడా సినిమాల్లో తన అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. దర్శకుడు చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వంలో తెరకెక్కె ‘పృథ్వీరాజ్’ 2020 దీపావళీకి ప్రేక్షకుల ముందుకు రానుంది. -
శివసేనకు కాంగ్రెస్ మద్దతు!
సాక్షి, ముంబై : మహారాష్ట్ర రాజకీయం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కింగ్ మేకర్‌గా అవతరించిన శివసేన సీఎం పీఠం తమకే దక్కాలన్న డిమాండ్‌కు ఏ మాత్రం వెనుకాడట్లేదు. 288 స్థానాల అసెంబ్లీలో 2014లో కన్నా 17 స్థానాలు తక్కువగా 105 సీట్లకే బీజేపీ పరిమితమైంది. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సహకారం అనివార్యమైంది. ఈ పరిస్థితిని అనుకూలంగా తీసుకున్న శివసేన పొత్తుకు ముందు అంగీకరించిన షరతులను తెరపైకి తీసుకువచ్చింది. 50 : 50 ఫార్ములాను అమలు చేయాల్సిందేనని పట్టుబడుతోంది. సీఎం పదవిని చెరే రేండేళ్లు పంచుకోవాలని డిమాండ్ చేస్తూనే.. పదవుల్లో 50శాతం తమకు దక్కాలని కోరుతోంది. మరోవైపు బీజేపీ మాత్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో.. కమళ దళం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. అయితే బీజేపీ చీఫ్ అమిత్ బుధవారం ముంబై రానుండటంతో అప్పటివరకు ఈ సస్పెన్స్‌కు ముగింపు పలికే అవకాశం కనిపిస్తోంది. ఇదిలావుండగా.. ప్రభుత్వం ఏర్పాటుకు శివసేన తమను సంప్రదిస్తే వారి ఆహ్వానాన్ని పరిశీలిస్తామని మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పృధ్వీరాజ్ చౌహాన్ ప్రకటించారు. శివసేనతో తమకు ఎలాంటి విభేదాలు లేవని, వారి ప్రతిపాదనను కాంగ్రెస్ హైకమాండ్ ముందుకు తీసుకెళ్లి చర్చిస్తామని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తానే మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నట్లు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ... ‘శివసేన ఐదేళ్ల పాటు సీఎం పదవి తమకే దక్కాలని ఆశిస్తుంది. కోరుకున్నవన్నీ జరగవు. ముఖ్యమంత్రి పీఠంపై మేమెప్పుడూ 50:50 ఫార్ములా పాటిస్తామని వారికి హామీ ఇవ్వలేదు. ఇది కాకుండా వాళ్లు వేరే డిమాండ్లతో రావాలి. అప్పుడు చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం. ఇక బీజేపీ నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందనేది సుస్పష్టం. ఇందులో ఏమాత్రం సందేహం లేదు’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే శివసేన-బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజా పరిణామాలను పరిశీలిస్తున్న కాంగ్రెస్, ఎన్సీపీ శివసేన ఆహ్వానం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు కాంగ్రెస్, ఎన్సీపీలు మద్దతివ్వనున్నాయని ముంబై వర్గాలు సమాచారం. ఒకవేళ ఈ సమీకరణాలు నిజమైతే.. శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లు.. మొత్తం 154 సీట్లతో 288 స్థానాల అసెంబ్లీలో మెజారిటీ సులభంగానే లభిస్తుంది. శివసేన నుంచి ప్రతిపాదన వస్తే దానిపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలాసాహెబ్ ఇదివరకే వ్యాఖ్యానించారు. దీంతో మహా రాజకీయాలు మరింత ఉత్కంఠగా మారాయి. -
జంప్ జిలానీలకు కమలం తీర్థం
రారమ్మని.. ముంబై: పొత్తులు బెడి సికొట్టిన నేపథ్యంలో రాష్ట్రం లో రాజకీయ సమీకరణాలు రోజుకో రకంగా మారి పోతున్నాయి. అన్ని పార్టీల్లోనూ ఆయారాం గయారాంల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా అధికార కూటమిలో జంప్ జిలానీల సంఖ్య పెరిగి పోయింది. ఇప్పటివరకు కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులుగా చలామణి అయిన చాలామంది ఒక్కసారిగా బీజేపీ పంచన చేరిపోయారు. తిరుగుబాటు అభ్యర్థుల బెడద ప్రస్తుత సీఎం పృథ్వీరాజ్ చవాన్‌కు సైతం తప్పడంలేదు. కరద్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పృథ్వీరాజ్ చవాన్ పోటీచేస్తుండగా, ఇక్కడ కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా పోటీచేయనున్న అతుల్భొలాసేకు బీజేపీ టికెట్ ఇచ్చింది. అలాగే ఇక్కడ సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న విలాస్ ఉండాల్కర్ పాటిల్ సైతం పార్టీ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. భొలాసే కాంగ్రెస్ ఎమ్మెల్సీ దిలీప్ దేశ్‌ముఖ్‌కు స్వయాన మేనల్లుడు. అలాగే ఇటీవల ఎన్సీపీ నుంచి బీజేపీలో చేరిన మాజీ మంత్రి సంజయ్ సావ్కరే సైతం భుసావల్ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీచేస్తున్నారు. ఎన్సీపీకే చెందిన మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అయిన బాబన్‌రావ్ పచ్పుటే సైతం శ్రీగొండ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీచేస్తున్నారు. నాసిక్ జిల్లాకు చెందిన సినార్ ఎమ్మెల్యే మాణిక్‌రావ్ కొకాటే( కాంగ్రెస్) ప్రస్తుతం బీజేపీ నుంచి రంగంలో ఉండనున్నారు. అదేవిధం గా ఎన్సీపీ ఎమ్మెల్యే కిషన్ కథోర్ ముర్బాద్ నుంచి వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీచేస్తున్నారు. దక్షిణ కొల్హాపూర్‌లో మంత్రి సాతేజ్పాటిల్పై అమ ల్ మహదిక్ బీజేపీ తరఫున పోటీచేస్తున్నాడు. ఇత డు కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహదేవ్ మహదిక్కు స్వయాన కుమారుడు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున తన కుమార్తె హీనా బీజేపీ తరఫున నిలబడినందుకు ఎన్సీపీ నుంచి బహిష్కృతుడైన మాజీ మంత్రి విజయ్ కుమార్ గవిట్ ఇప్పుడు తన ఇలాకాలో బీజేపీ తరఫున బరిలో దిగాడు. అలాగే అమరావతిలో మాజీ రాష్ర్టపతి ప్రతిభా పాటిల్ కుమారుడు రాజేంద్ర షెకావత్(కాంగ్రెస్)పై మాజీ కాంగ్రెస్ నేత సునీల్ దేశ్‌ముఖ్ బీజేపీ తరఫున పోరుకు సై అంటున్నాడు. ఇదిలా ఉండగా, నాందే డ్ జిల్లా భోకర్ నియోజకవర్గం నుంచి మాజీ ఎన్సీ పీ నాయకుడైన మాధవ్ కిన్హాల్కర్ ఇప్పుడు బీజేపీ తరఫున బరిలో నిలబడుతున్నాడు. అలాగే తాస్గాం-కావ్తేమహం కాల్ స్థానంలో ఎన్సీపీకి చెందిన రాష్ట్ర హోం మంత్రి ఆర్ఆర్ పాటిల్‌పై ఆ పార్టీ తిరుగుబాటు అభ్యర్థి అజిత్ ఘోర్పడే ఢీ అంటే ఢీ అం టున్నాడు. ఇదిలా ఉండగా, పలుస్ కాడేగావ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పతంగ్‌రావ్ కదమ్‌పై మాజీ ఎమ్మెల్యే పృథ్వీరాజ్ దేశ్‌ముఖ్ సవాలు విసురుతున్నాడు. దీనికితోడు ఇంతకుముందు కాంగ్రెస్, ఎన్సీపీ సాయంతో ఇండిపెండెంట్లుగా గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు ఇప్పు డు బీజేపీ టికెట్‌పై తమ అదృష్టాన్ని పరీక్షించుకుం టున్నారు. పుణేలోని షిరాలా నియోజకవర్గం నుం చి మూడు సార్లు ఇండిపెండెంట్‌గా గెలిచి ఎన్సీపీ సానుభూతిపరుడిగా పేరుపొందిన శివాజీరావ్ నాయక్ ఇప్పుడు అదే స్థానం నుంచి బీజేపీ టికెట్‌పై పోటీచేస్తున్నాడు. అలాగే ఇటీవల వరకు నాగ్‌పూర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగిన సమీర్ మేఘే ఇప్పుడు బీజేపీ టికెట్‌పై హింగ్నా నియోజకవర్గంలో తనఅదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. నవీముంబైలోని బేలాపూర్ సెగ్మెంట్లో ఎన్సీపీ సీనియర్ నాయకుడు గనేష్ నాయక్‌పై ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ మందా మాత్రే బీజేపీ తరఫున పోటీచేస్తున్నాడు. పన్వేల్ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రశాంత్ ఠాకూర్ ఇప్పుడు బీజేపీ తరఫున అక్కడినుంచే పోటీలో ఉన్నాడు. ముంబైలోని వర్సోవాలో ఎన్సీపీ మాజీ నేత భారతీ లావ్హేకర్ ఇప్పుడు బీజేపీ తరఫున బరిలో దిగాడు. చంద్రపూర్ జిల్లా వరోరా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌కు చెందిన సాంస్కృతిక శాఖ మంత్రి సంజయ్ దావుతలే ఈ ఎన్నికల్లో బీజే పీ తరఫున నామినేషన్ దాఖలు చేశాడు. కాం గ్రెస్ సీనియర్ నేత నారాయణ్ రాణేకు అత్యంత ఆప్తుడైన రాజన్ తేలీ కొంకణ్ ప్రాంతంలోని సావంత్‌వాడీ నుంంచి బీజేపీ తరఫున రంగంలో ఉన్నాడు. ఇదిలా ఉండగా, శివసేనపార్టీకి కూడా తిరుగుబాటు బెడద తప్పలేదు. ఆ పార్టీకి చెందిన ముంబై మాజీ మేయర్ శుభా రావుల్ దహిసర్ నుంచి ఈ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ టికెట్‌పై పోటీచేస్తున్నారు. అలాగే ఠాణేలో పార్టీ అభ్యర్థి ఏక్నాథ్ షిండేకు వ్యతి రేకంగా అదే పార్టీకి చెందిన అనంత్ తారే బరిలో నిలబడ్డాడు. రత్నగిరి నుంచి ఎన్సీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉదయ్ సామంత్ శనివారం బీజేపీలో చేరి అదే స్థానం నుంచి పోటీచేస్తున్న విషయం తెలిసిందే. -
మహారాష్ట్ర గవర్నర్‌గా విద్యాసాగర్‌రావు ప్రమాణం
హాజరైన సీఎం పృథ్వీరాజ్ చవాన్, కేంద్ర మంత్రి గడ్కారీ తదితరులు సాక్షి, ముంబై: మహారాష్ర్ట గవర్నర్‌గా చెన్నమనేని విద్యాసాగర్‌రావు శనివారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో సాయంత్రం 4.10 గంటలకు బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మోహిత్‌షా ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ర్ట ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ దత్తాత్రేయ, మహారాష్ర్ట నాయకులు హర్షవర్ధన్పాటిల్, ఛగన్ భుజ్‌బల్, కిరిట్ సోమయ్య, సుధీర్ మునగంటివార్, నటి సైనా ఎన్సీ, చెన్నమనేని కుటుంబసభ్యులు హాజరయ్యారు. యూపీఏ హయాంలో మహారాష్ర్ట గవర్నర్‌గా నియమితులైన శంకర్నారాయణన్ను ఎన్డీఏ ప్రభుత్వం రాజీనామా చేయాలని కోరింది. అయితే అందుకు ఆయన నిరాకరించడంతో మిజోరమ్‌కు బదిలీ చేసింది. అక్కడకు వెళ్లేందుకు ఇష్టపడని శంకర్నారాయణన్ ఏకంగా గవర్నర్ పదవికే రాజీనామా చేసిన విషయం విదితమే. -
ఠాణే వరకు ముంబై మెట్రో
అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి చవాన్ ముంబై: దేశ ఆర్థిక రాజధానిలో ఇటీవల ప్రారంభమైన ముంబై మెట్రోను ఠాణే వరకు పొడిగిస్తామని ముఖ్యమంత్రి చవాన్ అసెంబ్లీలో శనివారం ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తుది నివేదిక త్వరలో వస్తుందన్నారు. ప్రతిపాదిత ఠాణే మెట్రోపై సభ్యులు అడిగిన ప్రశ్నకు చవాన్ సమాధానమిస్తూ... మెట్రోరైలు వ్యయాన్ని భరించే ఆర్థికస్థాయి ఠాణే నగరానికి లేదన్నారు. అందుకే ముంబై మెట్రోను ఠాణే వరకు విస్తరిస్తామని చెప్పారు. ఇక ఠాణే అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఘోడ్‌బందర్ ప్రాంతాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ‘ఠాణే నగరంలో మెట్రోరైలును ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనలు రూపొందించినప్పుడు తీన్ హాత్ నాకా-కాపూర్బావ్డీ-ఘోడ్‌బందర్ ప్రాంతాల మీదుగా ఏర్పాటు చేసే విషయమై ఇంజనీర్ల బృందం అధ్యయనం చేసింది. ఆర్థిక విషయాలను కూడా పరిగణనలోకి తీసుకొని సాధ్యాసాధ్యాలను పరిశీలించింది. అయితే ఆర్థికంగా అంత వెసులుబాటుగా ఉండదనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో వడాలా-ఘాట్కోపర్-తీన్ హాత్ నాకా(ఠాణే) మార్గానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. ఠాణే నుంచి లక్షలాది మంది విధుల నిమిత్తం ముంబై నగరానికి వస్తుంటారు. దీంతో తీన్ హాత్ నాకా వరకు ముంబై మెట్రో రైలును పొడిగిస్తే ఠాణేవాసులకు సౌకర్యవంతంగా ఉంటుందని నిపుణుల బృందం అధ్యయనంలో తేలింది. అయితే దీనిపై పూర్తిస్థాయి అధ్యయనం జరగాల్సి ఉంది. రెయిల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీస్ సంస్థ ఇందుకు సంబంధించి అధ్యయనం చేస్తోంది. త్వరలో తుది నివేదిక అందుతుంది. ఆ తర్వాతే ఠాణే మెట్రోపై నిర్ణయం తీసుకుంటామ’న్నారు. ప్రతిపాదిత ముంబై-ఠాణే మెట్రో మార్గానికి రూ. 22,000 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు చెప్పారు. 32 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ మార్గంలో 29 స్టేషన్లు ఉంటాయన్నారు.