Manushi Chhillar Interesting Comments On Ram Charan - Sakshi
Sakshi News home page

Manushi Chhillar: రామ్‌ చరణ్ అంటే క్రష్‌, అతడితో డేట్‌కి వెళ్తా: బాలీవుడ్‌ హీరోయిన్‌

Published Thu, Jun 2 2022 4:49 PM | Last Updated on Thu, Jun 2 2022 6:01 PM

Former Miss World, Actress Manushi Chhillar Interesting Comments On Ram Charan - Sakshi

మాజీ ప్రపంచ సుందరి, నటి మానుషి చిల్లర్‌ మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు రామ్‌ చరణ్‌ అంటే క్రష్‌ అని అతడితో డేట్‌కు వెళ్లానంటూ తాజాగా ఓ ఇంటర్య్వూలో ఆమె చేసిన కామెంట్స్‌ హాట్‌టాపిక్‌గా నిలిచాయి. మానుషి బాలీవుడ్‌లో తొలిసారిగా నటించిన చిత్రం ‘పృథ్విరాజ్‌’. ఈ మూవీలో అక్షయ్‌ కుమార్‌ సరసన ఆమె నటించింది. ఈ సినిమా రేపు(జూన్‌ 3న) థియేటర్లలోకి రానుంది. 

చదవండి: OTT: 3 వారాలకే అమెజాన్‌లో సర్కారు వారి పాట స్ట్రీమింగ్‌, కానీ..

ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఆమె వరుస ఇంటర్య్వూలతో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఆమెకు.. ఫేవరెట్‌ హీరో ఎవరు? నెక్స్ట్‌ మూవీ ఏ హీరోతో చేయాలనుకుంటున్నారు? వంటి ప్రశ్నలు ఎదురయ్యాయి. వీటిపై ఆమె స్పందిస్తూ.. రామ్‌ చరణ్‌తో వర్క్‌ చేయాలని ఉందని, ఆర్‌ఆర్‌ఆర్‌ చూశాక చరణ్‌కు ఫ్యాన్‌ అయిపోయానని చెప్పింది. ఇక మరో ఇంటర్య్వూలో ఇండస్ట్రీలో మీరు ఏ హీరోతో డేటింగ్‌కు వేళ్లాలనుకుంటున్నారు? అని అడగ్గా.. రామ్‌ చరణ్‌ అని సమాధానం ఇచ్చింది. 

చదవండి: ఎఫ్‌ 3 ఓటీటీకి వచ్చేది అప్పుడేనట, మూవీ టీం క్లారిటీ

ఇక అతడికి పెళ్లి అయిపోయింది కదా అని చెప్పడంతో.. పెళ్లి కాకపోయి ఉంటే డేట్‌కి వెళ్దామా అని చరణ్‌ను తానే స్వయంగా అడిగేదాన్ని అని చెప్పింది. డేటింగ్‌లో ఏం చేస్తారని అడగ్గా.. కలిసి సినిమాలు చూస్తాం, ఇష్టమైన ఫుడ్‌ తింటాం, ఇంకా ఎన్నెన్నో వియాలను మాట్లాడుకుంటామని మానుషి చెప్పుకొచ్చింది. కాగా పీరియాడికల్ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన పృథ్వీరాజ్‌ సినిమాలో అక్షయ్‌ కుమార్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తుండగా.. మానుషి అతడి భార్యగా కనిపించనుంది.  చంద్రప్రకాశ్‌ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్స్‌ సంజయ్ దత్‌, అశుతోష్‌ రాణా, సోనూ సూద్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement