
'ఏస్ ఆఫ్ స్పేస్' రియాలిటీ షో రెండో సీజన్ విన్నర్ సల్మాన్ జైదీ త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నాడు. తన ప్రియురాలు జెబా హసన్‌ను అక్టోబర్ 16న పెళ్లాడబోతున్నాడు. ఫిబ్రవరిలో వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. జెబా హసన్ మరెవరో కాదు... రామ్‌చరణ్, ఉపాసనల మేకప్ ఆర్టిస్ట్. ఇకపోతే త్వరలో ప్రియురాలితో ఏడడుగులు నడవనున్న సల్మాన్ జైదీ ఇటీవలే 'ఎక్స్ ఆర్ నెక్స్ట్' అనే డేటింగ్ షోలో మాజీ ప్రియురాలు క్రిస్సన్ బారెట్టోతో కనిపించడం గమనార్హం.
తాజాగా తన పెళ్లి గురించి సల్మాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'గత మూడేళ్ల నుంచే జెబా, నేను బాగా క్లోజ్ అయ్యాం. ఇన్నేళ్లపాటు ప్రేమలో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుండటం నిజంగా ఓ మధురమైన అనుభూతిగా నిలిచిపోనుంది. మా పెళ్లిని నాలుగు రోజుల వేడుకగా సెలబ్రేట్ చేయబోతున్నాం' అని చెప్పుకొచ్చాడు. అయితే ఇక్కడే ఫ్యాన్స్ అయోమయానికి లోనవుతున్నారు. ఇటీవలే సల్మాన్.. ఎక్స్ ఆర్ నెక్స్ట్ అనే డేటింగ్ షోలో మాజీ గర్ల్‌ఫ్రెండ్ క్రిసన్ బారెటోతో కనిపించాడు, అంతలోనే మరొకరితో పెళ్లంటున్నాడేంటని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
దీనిపై అతడు స్పందిస్తూ.. 'నా ఎంగేజ్‌మెంట్‌కు తొమ్మిది నెలల ముందే ఎక్స్ ఆర్ నెక్స్ట్ షో షూట్ చేశారు. షూటింగ్ టైంలో కూడా క్రిసన్‌కు, నాకు మళ్లీ ఒక్కటయ్యే ఆలోచనే రాలేదు' అని క్లారిటీ ఇచ్చాడు సల్మాన్.
చదవండి: చిన్నప్పుడే అమ్మానాన్నలకు దూరమయ్యా: యాంకర్
డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి?
Comments
Please login to add a commentAdd a comment