
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి అయిదు నెలలు అవుతున్నా టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ సగం ఖాళీ అవగా...తాజాగా మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు త్వరలో కారెక్కనున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈ నెల 24న వీరంతా టీఆర్‌ఎస్‌లోచేరేందుకు ముహుర్తం ఖరారైంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే.
తాజా చేరికలతో తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోనుంది. ఈ ముగ్గురు చేరికతో ఇక కాంగ్రెస్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రోహిత్ రెడ్డి, సీతక్క మాత్రమే మిగలనున్నారు. జూన్ మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజా చేరికలతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 104కు చేరనుంది.
Comments
Please login to add a commentAdd a comment