సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీశ్‌రావుకు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులు కట్టలేదన్న హరీష్‌రావు బహిరంగ చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం గాంధీభవన్‌లో జగ్గారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తాము ఎక్కడెకక్కడ ప్రాజెక్టులు కట్టామో స్వయంగా తానే తీసుకువెళ్లి చూపిస్తానని అన్నారు. కేవలం ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇంత ప్రచారం చేసుకుంటారా అంటూ ఆయన ధ్వజమెత్తారు. అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పేరు మార్చి కాళేశ్వరంగా ప్రారంభించారన్నారు.
సింగూరు, మంజీరా, ఎస్‌ఆర్‌ఎస్‌పీ, నాగార్జున సాగర్, శ్రీశైలం, దేవాదుల, జూరాల, ఎల్లంపల్లి, బీమా, నెట్టంపాడు, కోయల్‌సాగర్ గడ్డన్నవాగు, పెద్దవాగు, అలీసాగర్, గుత్ప. చౌట్‌పల్లి కట్టింది కాంగ్రెస్ కాదా అని జగ్గారెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఇప్పుడు కట్టిన కాళేశ్వరం నీళ్లు ఎందులో నింపుతున్నారో హరీష్‌రావు జవాబు చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఏమి చేసిందో ప్రజలకు తెలుసని, కావాలని నిందలు వేయడం సరికాదని హితవు పలికారు. అదేవిధంగా తాము ఏనాడు ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూడలేదని, దాంట్లో జరిగిన అవినీతి గురించి ప్రశ్నించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment