
ఖమ్మం అసెంబ్లీ స్థానంలో మొత్తం 3,11,000 ఓటర్లు ఉన్నారు...ఇందులో కమ్మ, మైనార్టీ, కాపు ఓట్లు ఏక్కువగా ఉన్నాయి. వీరిలో రెండు సామాజిక వర్గాలు ఎటువైపు చూస్తే వారికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాంగ్రెస్-బీఆర్‌ఎస్‌లు పోటాపోటీగా బరిలో నిలిచాయి. సీపీఎం, సీపీఐ పార్టీలు సైతం ఖమ్మం నియోజకవర్గంలో బలంగా ఉన్నాయి. ఎన్నికల కోసం సీపీఐ కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. సీపీఎం మాత్రం ఒంటరిపోరుకే సై అంది. ఇక ఖమ్మంలో ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాల్ని గమనిస్తే..
- రాజకీయ పార్టీల వారీగా ఎవరెవరు ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నారు?
ఖమ్మం నియోజకవర్గంలో శరవేగంగా పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి...ఖమ్మం సీటు పై కీలక నేతలు గురిపెట్టారు...దీంతో వచ్చే ఎన్నికల్లో అక్కడ రసవత్తరమైన ఫైట్ నెలకోనే అవకాశం ఉంది..బీఆర్ఎస్ నుంచి మంత్రి పువ్వాడ బరిలో నిలవనున్నారు...వచ్చే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే ఉత్సాహంతో ఉన్నారు...ఇప్పటికే వాడ వాడ పువ్వాడ కార్యక్రమంను ప్రారంభించారు...ప్రత్యర్థి బలమైన వ్యక్తి వచ్చిన ఢీకొనడానికి కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు .
అటు వచ్చే ఎన్నికల్లో పువ్వాడ కు చెక్ పెట్టేందుకు బీజేపీ,కాంగ్రెస్ కూడా బలమైన అభ్యర్థులను రంగంలో దించేందుకు కసరత్తు ప్రారంభించింది.. కాంగ్రెస్ నుంచి రేణుక చౌదరి పేరు కూడ వినిపిస్తోంది..అటు పొంగులేటి శ్రీనివాస రెడ్డి సైతం ఖమ్మం బరిలో నిలిచే అవకాశం ఉందని ఆయన అనుచరులు చెప్పుకొస్తున్నారు .. ఇప్పటికే ఖమ్మంలో గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారు పొంగులేటి..పొంగులేటి కొత్తగూడెం నియోజకవర్గంలో పోటి చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న ఆయన అనుచరులు మాత్రం పట్టుపట్టి ఖమ్మం నియోజకవర్గంలోనే పోటి చేయాలని పొంగులేటి పై ఒత్తిడి తెస్తున్నారట. అటు కాంగ్రెస్ నుంచి జావిద్, బీజేపీ నుంచి గల్లా సత్యనారయణ, ఉప్పల శారద ఖమ్మం నియోజకవర్గంలో టికెట్ ఆశిస్తున్నారు.
- నియోజకవర్గంలో ఎన్ని పంచాయతీలున్నాయి? ఎన్ని మండలాలున్నాయి?
రెండు మండలాలు ఉన్నాయి.. ఖమ్మం అర్బన్, రఘనాథపాలెం మండలాలు..
- అతి పెద్ద మండలం ఏది? అత్యంత ప్రభావం చూపే పంచాయతీ ఏది?
ఖమ్మం నియోజకవర్గంలో ఖమ్మం అర్బన్ పెద్దది..
ఇక్కడే 2,50,000 ఓట్లుపైనే ఉన్నాయి..
- నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత?
మొత్తం ఓటర్లు- 3,11,693
పురుషులు- 1,50,552
స్త్రీలు- 1,61,095
- వృత్తిపరంగా ఓటర్లు?
పట్టణ ప్రాంతం కావడంతో ఉద్యోగులు,వ్యాపారులు ఎక్కువగా ఉంటారు.. రఘనాథపాలెం మండలంలో రైతులు ఎక్కువగా ఉంటారు.. ఇక్కడ వ్యవసాయమే జీవానధరంగా చేసుకోని బతుకుతూ ఉంటారు.. కావున ఇక్కడ రైతుల ఓట్లే కీలకంగా ఉంటాయి..
- మతం/కులం పరంగా ఓటర్లు?
యాదవులు 45,000 ఓట్లు, కమ్మ 48,000 ఓట్లు, మైనార్టీ ఓట్లు 30,000 ఓట్లు.. మొత్తం ఓట్లలో 45 శాతం ఓట్లు వీరివే ఉంటాయి..
- నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు..?
ఖమ్మం పట్టణంలో ప్రధాన కాలనీల గుండా మున్నేరు వాగు ప్రవహిస్తూ ఉంటుంది. ఖమ్మంలో ప్రముఖంగా శ్రీ స్తంభాధ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కలదు. ఇక్కడికి భక్తులు ఖమ్మం నుంచే కాకుండా జిల్లా నలు మూలల నుంచి తరలి వస్తూ ఉంటారు. పర్యాటకం పరంగా ఖమ్మం నగరంలోని మమత రోడ్డు లో ఉన్న లకారం ట్యాంక్ బండ్, చూపరులను ఆకట్టుకునేలా నిర్మించిన తీగల వంతెన ఉన్నది. ఖమ్మం ఖిల్లా ఖమ్మం నియోజకవర్గానికి ప్రాముఖ్యతగా నిలుస్తుంది.
- నియోజకవర్గం గురించి ఏవైనా ఆసక్తికర అంశాలు ఉంటే?
ఖమ్మం నగరం ఒకవైపు అభివృద్ధి చెందుతుండగా మరో వైపు ట్రాఫిక్ సమస్య ఇంకా పూర్తిస్థాయిలో పరిష్కరించలేకపోయారన్న విమర్శ ఉంది. అంతే కాదు వర్షాకాలంలో ఖమ్మం నగరాన్ని వర్షపు నీరు ముంచేత్తుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ఉంటే ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందని నగరవాసులు అంటున్నారు. త్రీ టౌన్ ప్రజలకు ప్రధానమైన సమస్య రైల్వే మధ్య గేట్ నిర్మాణం ఇంతవరకు చేపట్టలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఎంపికల్లో అక్రమాలు జరుగుతున్నాయని.. అర్హులకు అందటం లేదన్న విమర్శలున్నాయి.
ఖమ్మం నియోజకవర్గంలో గల ఏకైక మండలం రఘునాథపాలెం. ఈ మండలం విషయానికొస్తే ప్రస్తుత ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ తన మార్క్ చూపించుకున్నారనే చెప్పాలి. ఖమ్మం టౌన్ తో పాటుగా అభివృద్ధి చేశారు. ఖమ్మం నుంచి ఇల్లందు రోడ్డును నాలుగు లైన్ల రోడ్ తో కూడిన సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు . రఘునాధపాలెం మండలం వ్యవసాయ ఆధారిత మండలం కావడంతో వ్యవసాయానికి నీటి సమస్య ఉంది. ఈ సమస్యను తీర్చేందుకు బుగ్గ వాగు ప్రాజెక్టును ప్రారంభించారు.కానీ, ఇంతవరకు అది పూర్తికాకపోవడంతో రైతులకు సమస్యగా మారింది..
ఖమ్మం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులు మంత్రి అజయ్ కు బాగా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూ. 22 కోట్లతో లకారం ట్యాంక్ బండ్ ,8 కోట్ల రూపాయలతో తీగల వంతెనను నిర్మించారు. రూ. 21కోట్లతో నూతన బస్టాండ్,రూ. 25కోట్లతో ఐటీ హబ్,రూ.110 కోట్ల రూపాయల తో గొల్లపాడు చానల్ ఆధునికరించారు. ధంసలాపురం ఆర్ఓబి 14 కోట్ల రూపాయలతో నిర్మించారు.నూతన కార్పొరేషన్ భవనాన్ని నిర్మించారు.దీంతో పాటుగా సమీకృత నూతన కలెక్టరేట్ భవనాన్ని నిర్మించడం జరిగింది. ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో అజయ్ కుమార్ కు కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
- రాజకీయానికి సంబంధించి ఇతర ఏవైనా అంశాలు
2009లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసి గెలుపోందగా.. 2004లో సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రం పోటీ చేసి గెలుపోందారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పువ్వాడ అజయ్ గెలుపోందగా.. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరి 2018 ఎన్నికల్లో పోటి చేసి గెలుపోందారు. నాలుగు ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే గెలుపోందారు.
ఖమ్మం అసెంబ్లీ స్థానం వచ్చే ఎన్నికల్లో హాట్ సీట్ గా మారనుంది. బీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలతో పాటు వామపక్షాలు సైతం బలంగా ఉండగా.. బీజేపీ మాత్రం బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గంలో రసవత్తరమైన పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని పార్టీల కన్ను ఖమ్మం పైనే పడింది. ఖమ్మంలో ఎలాగైనా గెలవాలని సామ భేద దండోపాయలను ఉపయోగిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment