district politics
-
ఖమ్మంలో ప్రభావితం చేసే అంశాలు ఏంటంటే..
ఖమ్మం అసెంబ్లీ స్థానంలో మొత్తం 3,11,000 ఓటర్లు ఉన్నారు...ఇందులో కమ్మ, మైనార్టీ, కాపు ఓట్లు ఏక్కువగా ఉన్నాయి. వీరిలో రెండు సామాజిక వర్గాలు ఎటువైపు చూస్తే వారికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాంగ్రెస్-బీఆర్ఎస్లు పోటాపోటీగా బరిలో నిలిచాయి. సీపీఎం, సీపీఐ పార్టీలు సైతం ఖమ్మం నియోజకవర్గంలో బలంగా ఉన్నాయి. ఎన్నికల కోసం సీపీఐ కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. సీపీఎం మాత్రం ఒంటరిపోరుకే సై అంది. ఇక ఖమ్మంలో ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాల్ని గమనిస్తే.. రాజకీయ పార్టీల వారీగా ఎవరెవరు ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నారు? ఖమ్మం నియోజకవర్గంలో శరవేగంగా పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి...ఖమ్మం సీటు పై కీలక నేతలు గురిపెట్టారు...దీంతో వచ్చే ఎన్నికల్లో అక్కడ రసవత్తరమైన ఫైట్ నెలకోనే అవకాశం ఉంది..బీఆర్ఎస్ నుంచి మంత్రి పువ్వాడ బరిలో నిలవనున్నారు...వచ్చే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే ఉత్సాహంతో ఉన్నారు...ఇప్పటికే వాడ వాడ పువ్వాడ కార్యక్రమంను ప్రారంభించారు...ప్రత్యర్థి బలమైన వ్యక్తి వచ్చిన ఢీకొనడానికి కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు . అటు వచ్చే ఎన్నికల్లో పువ్వాడ కు చెక్ పెట్టేందుకు బీజేపీ,కాంగ్రెస్ కూడా బలమైన అభ్యర్థులను రంగంలో దించేందుకు కసరత్తు ప్రారంభించింది.. కాంగ్రెస్ నుంచి రేణుక చౌదరి పేరు కూడ వినిపిస్తోంది..అటు పొంగులేటి శ్రీనివాస రెడ్డి సైతం ఖమ్మం బరిలో నిలిచే అవకాశం ఉందని ఆయన అనుచరులు చెప్పుకొస్తున్నారు .. ఇప్పటికే ఖమ్మంలో గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారు పొంగులేటి..పొంగులేటి కొత్తగూడెం నియోజకవర్గంలో పోటి చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న ఆయన అనుచరులు మాత్రం పట్టుపట్టి ఖమ్మం నియోజకవర్గంలోనే పోటి చేయాలని పొంగులేటి పై ఒత్తిడి తెస్తున్నారట. అటు కాంగ్రెస్ నుంచి జావిద్, బీజేపీ నుంచి గల్లా సత్యనారయణ, ఉప్పల శారద ఖమ్మం నియోజకవర్గంలో టికెట్ ఆశిస్తున్నారు. నియోజకవర్గంలో ఎన్ని పంచాయతీలున్నాయి? ఎన్ని మండలాలున్నాయి? రెండు మండలాలు ఉన్నాయి.. ఖమ్మం అర్బన్, రఘనాథపాలెం మండలాలు.. అతి పెద్ద మండలం ఏది? అత్యంత ప్రభావం చూపే పంచాయతీ ఏది? ఖమ్మం నియోజకవర్గంలో ఖమ్మం అర్బన్ పెద్దది.. ఇక్కడే 2,50,000 ఓట్లుపైనే ఉన్నాయి.. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత? మొత్తం ఓటర్లు- 3,11,693 పురుషులు- 1,50,552 స్త్రీలు- 1,61,095 వృత్తిపరంగా ఓటర్లు? పట్టణ ప్రాంతం కావడంతో ఉద్యోగులు,వ్యాపారులు ఎక్కువగా ఉంటారు.. రఘనాథపాలెం మండలంలో రైతులు ఎక్కువగా ఉంటారు.. ఇక్కడ వ్యవసాయమే జీవానధరంగా చేసుకోని బతుకుతూ ఉంటారు.. కావున ఇక్కడ రైతుల ఓట్లే కీలకంగా ఉంటాయి.. మతం/కులం పరంగా ఓటర్లు? యాదవులు 45,000 ఓట్లు, కమ్మ 48,000 ఓట్లు, మైనార్టీ ఓట్లు 30,000 ఓట్లు.. మొత్తం ఓట్లలో 45 శాతం ఓట్లు వీరివే ఉంటాయి.. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు..? ఖమ్మం పట్టణంలో ప్రధాన కాలనీల గుండా మున్నేరు వాగు ప్రవహిస్తూ ఉంటుంది. ఖమ్మంలో ప్రముఖంగా శ్రీ స్తంభాధ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కలదు. ఇక్కడికి భక్తులు ఖమ్మం నుంచే కాకుండా జిల్లా నలు మూలల నుంచి తరలి వస్తూ ఉంటారు. పర్యాటకం పరంగా ఖమ్మం నగరంలోని మమత రోడ్డు లో ఉన్న లకారం ట్యాంక్ బండ్, చూపరులను ఆకట్టుకునేలా నిర్మించిన తీగల వంతెన ఉన్నది. ఖమ్మం ఖిల్లా ఖమ్మం నియోజకవర్గానికి ప్రాముఖ్యతగా నిలుస్తుంది. నియోజకవర్గం గురించి ఏవైనా ఆసక్తికర అంశాలు ఉంటే? ఖమ్మం నగరం ఒకవైపు అభివృద్ధి చెందుతుండగా మరో వైపు ట్రాఫిక్ సమస్య ఇంకా పూర్తిస్థాయిలో పరిష్కరించలేకపోయారన్న విమర్శ ఉంది. అంతే కాదు వర్షాకాలంలో ఖమ్మం నగరాన్ని వర్షపు నీరు ముంచేత్తుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ఉంటే ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందని నగరవాసులు అంటున్నారు. త్రీ టౌన్ ప్రజలకు ప్రధానమైన సమస్య రైల్వే మధ్య గేట్ నిర్మాణం ఇంతవరకు చేపట్టలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఎంపికల్లో అక్రమాలు జరుగుతున్నాయని.. అర్హులకు అందటం లేదన్న విమర్శలున్నాయి. ఖమ్మం నియోజకవర్గంలో గల ఏకైక మండలం రఘునాథపాలెం. ఈ మండలం విషయానికొస్తే ప్రస్తుత ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ తన మార్క్ చూపించుకున్నారనే చెప్పాలి. ఖమ్మం టౌన్ తో పాటుగా అభివృద్ధి చేశారు. ఖమ్మం నుంచి ఇల్లందు రోడ్డును నాలుగు లైన్ల రోడ్ తో కూడిన సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు . రఘునాధపాలెం మండలం వ్యవసాయ ఆధారిత మండలం కావడంతో వ్యవసాయానికి నీటి సమస్య ఉంది. ఈ సమస్యను తీర్చేందుకు బుగ్గ వాగు ప్రాజెక్టును ప్రారంభించారు.కానీ, ఇంతవరకు అది పూర్తికాకపోవడంతో రైతులకు సమస్యగా మారింది.. ఖమ్మం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులు మంత్రి అజయ్ కు బాగా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూ. 22 కోట్లతో లకారం ట్యాంక్ బండ్ ,8 కోట్ల రూపాయలతో తీగల వంతెనను నిర్మించారు. రూ. 21కోట్లతో నూతన బస్టాండ్,రూ. 25కోట్లతో ఐటీ హబ్,రూ.110 కోట్ల రూపాయల తో గొల్లపాడు చానల్ ఆధునికరించారు. ధంసలాపురం ఆర్ఓబి 14 కోట్ల రూపాయలతో నిర్మించారు.నూతన కార్పొరేషన్ భవనాన్ని నిర్మించారు.దీంతో పాటుగా సమీకృత నూతన కలెక్టరేట్ భవనాన్ని నిర్మించడం జరిగింది. ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో అజయ్ కుమార్ కు కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయానికి సంబంధించి ఇతర ఏవైనా అంశాలు 2009లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసి గెలుపోందగా.. 2004లో సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రం పోటీ చేసి గెలుపోందారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పువ్వాడ అజయ్ గెలుపోందగా.. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరి 2018 ఎన్నికల్లో పోటి చేసి గెలుపోందారు. నాలుగు ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే గెలుపోందారు. ఖమ్మం అసెంబ్లీ స్థానం వచ్చే ఎన్నికల్లో హాట్ సీట్ గా మారనుంది. బీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలతో పాటు వామపక్షాలు సైతం బలంగా ఉండగా.. బీజేపీ మాత్రం బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గంలో రసవత్తరమైన పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని పార్టీల కన్ను ఖమ్మం పైనే పడింది. ఖమ్మంలో ఎలాగైనా గెలవాలని సామ భేద దండోపాయలను ఉపయోగిస్తున్నాయి. -
ఇజ్జత్ కా సవాల్
ఉమ్మడి ఖమ్మం జిల్లా గులాబీ పార్టీకి తొలినుంచీ కొరుకుడు పడటంలేదు. గత రెండు ఎన్నికల్లోనూ చేదు అనుభవాలే మిగిల్చింది. అందుకే ఈసారి ఈ జిల్లాపై సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. తనను ధిక్కరించిన ఇద్దరు నేతలను ఎలాగైనా ఓడించాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఆ రెండు నియోజకవర్గాలపై ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్ రెడీ చేశారట. ఆ రెండు చోట్లా పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులను సైతం ఏమరుపాటు లేకుండా ప్రచారం చేసుకోవాలని ఆదేశించారు కేసీఆర్. ఇంతకీ గులాబీ బాస్‌కు కోపం తెప్పించిన ఆ ఇద్దరు ఎవరు? గత రెండు ఎన్నికల్లోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ పునాదులు వేసుకోలేకపోయింది. రెండుసార్లు కూడా ఒక్కో సీటు మాత్రమే గెలవగలిగింది. ఏదైతేనేం ఇతర పార్టీల ఎమ్మెల్యేలు చేరడంతో జిల్లాలో బీఆర్ఎస్ బలం పెరిగింది. ఈసారి పదికి పది స్థానాలు తమ ఖాతాలో వేసుకోవాలని అధికార పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గతంలో తమతో కలిసి ప్రయాణించిన ఇద్దరు నాయకులు ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలో చేరి బరిలో నిలవడంతో వారిద్దరు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు కేసీఆర్. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బరిలో నిలిచారు. అదేవిధంగా పాలేరులో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హస్తం అభ్యర్థిగా నిలుస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్తితుల్లోనూ బీఆర్ఎస్ చేజారనీయకుండా చూసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు గులాబీ బాస్. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నాయకులు. జిల్లా అంతటా ఇద్దరికీ అనుచర బలగం ఉంది. రెండు బలమైన సామాజికవర్గాలకు చెందిన వీరిద్దరు జిల్లా అంతటా తమ ప్రభావం చూపగలుగుతారు. గులాబీ పార్టీలో సీట్లు రావని తేలడంతో ఇద్దరు కారు దిగి హస్తం గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇద్దిరికీ టిక్కెట్లు కేటాయించింది. ఇప్పుడు ఈ ఇద్దరినీ ఓడించడం ద్వారా గులాబీ పార్టీ బలోపేతం అయిందని.. కాంగ్రెస్ బలం తగ్గిపోయిందని నిరూపించేందుకు బీఆర్ఎస్ నాయకత్వం ప్రయత్నిస్తోంది. అందుకే ఖమ్మం నుంచి పోటీ చేస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌తో... పాలేరు అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డితోను సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు చర్చిస్తూ...అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. రెండు నియోజకవర్లాల్లోనూ నెలకొన్న పరిస్తితులపై నిత్యం తెలుసుకుంటూ అక్కడి నేతలకు మార్గదర్శనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం నుంచి రెండు సార్లు గెలిచిన పువ్వాడ అజయ్ తాజా ఎన్నికల్లో కూడా గెలిచి హ్యట్రిక్ కొట్టాలనే ఉద్దేశ్యంతో ప్రచారంలో దూకుడుగా ముందుకు వెళ్లుతున్నారు. అటు తుమ్మల కూడ ఈ ఎన్నికలతో పువ్వాడ అజయ్ పొలిటికల్ చాప్టర్ ముగిసిపోతుందని ప్రచారం చేస్తున్నారు. పాలేరులో సైతం కందాల, పొంగులేటి మధ్య పోరు రసవత్తరంగా నడుస్తోంది. పొంగులేటికి పాలేరులో బలమైన క్యాడర్ ఉండటం బాగా కలిసివస్తుందని అంటున్నారు. అయినప్పటికీ కందాలను ఏమాత్రం లైట్ తీసుకోకుండా ప్రచారంలో దూసుకుపోతున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుందని ధీమాగా చెబుతూ ఊరూరా ప్రచారం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాపై సీఎం కేసీఆర్ సీరియస్‌గా ఆపరేషన్ ప్రారంభించగా...అటు కాంగ్రెస్ కూడా కౌంటర్ ఆపరేషన్ తీవ్రం చేసింది. కేసీఆర్ ప్లాన్స్ తిప్పికొట్టడానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటోంది. రెండు పక్షాల నుంచీ ఢీ అంటే ఢీ అని పరిస్థితి ఏర్పడటంతో ఖమ్మం జిల్లాలో పోరు యుద్ధ రంగాన్ని తలపిస్తోంది. నామినేషన్లు పూర్తయ్యే నాటికి జిల్లాలో పొలిటికల్ వార్ మరింత ఉధృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
రాజయ్య ఆవేదన కడియంకి మైనస్ అవుతుందా?
స్టేషన్ ఘనపూర్ రాజకీయాలు గరంగరంగా మారాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. బ్యాలెట్ పోరులో ప్రజా తీర్పే ఇక మిగిలిఉంది. అధికార పార్టీకి అడ్డాగా ఉన్న ఘనపూర్ లో ఆ పార్టీలోనే గడబిడ కొనసాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను కాదని, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వడంతో రాజయ్య వర్గం అగ్గిమీద గుగ్గిలమైంది. కడియం టార్గెట్ గా విపక్షాలతో పాటు..స్వపక్షం నేతలు కూడా కొందరు పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్యే రాజయ్య స్టేషన్ అడ్డా మీద కీ రోల్ పోషిస్తున్నారు. స్వపక్షంలోనే విపక్షాన్ని ఎదుర్కొంటున్న కడియం పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ రాజకీయాలకు ఓ ప్రత్యేకత ఉంది. స్టేషన్ ఘనపూర్ లో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉంది. 1978లో ఎస్సీ రిజర్వుడుగా మారినప్పటి నుంచి ఆ సెంటిమెంట్ ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి బిఆర్ఎస్ కు చెందిన డాక్టర్ తాటికొండ రాజయ్య ప్రాతినిద్యం వహిస్తున్నారు. ఉపఎన్నికతో కలిపి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజయ్య తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి రికార్డు సృష్టించారు. అయితే ఐదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం రాజయ్య చేజారిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని గులాబీ బాస్ ఈసారి ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి బిఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చారు. టికెట్ దక్కక మొదట్లో కాస్త ఆందోళన చెందిన రాజయ్యను చివరకు కేటిఆర్ సముదాయించి రైతుబంధు సమితి చైర్మెన్ పదవి ఇవ్వడంతోపాటు భవిష్యత్తుపై భరోసా ఇచ్చి కడియంతో సయోధ్య కుదిర్చారు. ఇద్దరూ ప్రగతి భవన్ లో కలిసిపోయినా బయట మాత్రం అంటిముట్టనట్లే వ్యవహరిస్తున్నారు. ఇతర పార్టీలో బలమైన నాయకులు లేకపోవడం అనేది అధికార పార్టీకి కలిసివచ్చే అంశమే అయినా వర్గపోరు పార్టీని ఆగం చేస్తోంది. విపక్షాలు దాన్ని క్యాష్ చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. మారుతున్న రాజకీయ పరిణామాలు ఘనపూర్ లో అయోమయం సృష్టిస్తున్నాయి. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్, బిజేపి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి సింగాపురం ఇందిర, బిజేపి నుంచి మాజీమంత్రి విజయరామారావు బరిలో దిగారు. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరో తేలిపోవడంతో ప్రచారం ముమ్మరం చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. అధికార పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరి తొలిదశలో మండలాల వారిగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఈ సమ్మేళనాలకు సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య దూరంగా ఉన్నారు. తన టిక్కెట్ కడియం తన్నుకుపోయారనే ఆవేదనతో ఉన్న రాజయ్య, బయట ఆయనతో కలిసిపోయినట్లు వ్యహరిస్తున్నా అంతర్గతంగా మాత్రం కడియంకు చుక్కలు చూపించేందుకే సిద్ధమయ్యారు. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ ఆరుసార్లు, టిడిపి మూడు సార్లు, బిఆర్ఎస్ నాలుగు సార్లు గెలుపొందాయి. వరుసగా నాలుగు సార్లు గెలుపొందిన రాజయ్య వ్యవహారశైలి వివాదాస్పదంగా మారడంతో ఈసారి అభ్యర్థిని మార్చారనే ప్రచారం సాగుతోంది. కడియం ఇదివరకు రెండు సార్లు స్టేషన్ ఘనపూర్ నుంచి గెలుపొందడమే కాకుండా టిఆర్ఎస్ హయాంలో రాజయ్య తర్వాత ఉపముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయనపై సదభిప్రాయం ఉన్నప్పటికీ సామాజిక సమీకరణాల నేపద్యంలో మాదిగ వర్గానికి చెందిన రాజయ్యను కాదని కడియంకు టికెట్ ఇవ్వడంతో మాదిగ సామాజిక వర్గం కడియంకు ప్రతికూలంగా మారే పరిస్తితులు కనిపిస్తున్నాయి. బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఓటములను రాజయ్య ప్రభావితం చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఇక కాంగ్రెస్ నుంచి గతంలో పోటీ చేసి ఓటమి పాలైన సింగపురం ఇందిరా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అభ్యర్థిత్వం ఖరారు కావడంతో ప్రజలతో మమేకమై ఇటీవల కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్ లను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రచారం సాగిస్తున్నారు. బిజేపి నుంచి మాజీమంత్రి విజయరామారావు పోటీ చేస్తున్నారు. టిఆర్ఎస్ ఆవిర్బావం తర్వాత ఆ పార్టీలో పనిచేసిన విజయరామారావు బిజేపిలో చేరి టికెట్ తెచ్చుకున్నప్పటికి ప్రచారంలో వెనుకబడి ఉన్నారు. బిఆర్ఎస్ అభ్యర్థి కడియం పేరు ఖరారై చాలా కాలమైంది. కాంగ్రెస్, బిజేపి పార్టీలు తమ అభ్యర్థులను ఇటీవలనే ఖరారు చేశాయి. నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపధ్యంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ మద్యనే ప్రధాన పోటీ కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య చేసిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల పట్ల సానుభూతి ఉన్నా ఆయన వ్యవహారశైలి పార్టీకి మైనస్ గా మారే అవకాశాలున్నాయి. ఇక కడియం శ్రీహరి మీద ఎలాంటి అవినీతి మరకా లేనప్పటికీ..రాజయ్య సీటును లాక్కున్నారనే విమర్శలు...స్వపక్షంలోనే కొందరి నుంచి వినిపిస్తున్నాయి. ఈ నేపద్యంలో బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారాలను కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ అభ్యర్థి సీనియర్ అయినప్పటికీ ఆయన పేరు పెద్దగా వినిపించడంలేదు. -
అసమ్మతి స్వరాన్ని తట్టుకోగలరా?
ఇల్లందు బీఆర్ఎస్ అసమ్మతి మంటలు కాకరేపుతున్నాయి.. ఎమ్మెల్యే హరిప్రియ, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి మధ్య వర్గపోరు పార్టీకి తలనొప్పిగా మారింది. ఇద్దరి మధ్యా గొడవతో హైకమాండ్ సీన్లోకి ఎంటరైంది. అసమ్మతి నేతల బుజ్జగింపులూ మొదలయ్యాయి. ఇంతకీ అసలక్కడ ఇంత రచ్చ జరగటానికి కారణం ఎవరు?. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీలో అసలేం జరుగుతోంది? ఇల్లందు నియోజకవర్గం అధికార పార్టీలో అసమ్మతి రాగం సెగలు రేపుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే హరిప్రియ భర్త హరిసింగ్ తీరుపై అసమ్మతి వర్గం భగ్గుమంటోంది. ఇల్లెందులో ఇంటిపోరుకు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర రావు నాయకత్వం వహిస్తున్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని చేసినా ఎమ్మేల్యే దంపతుల వల్ల పార్టీ బద్నాం అయిందని అందుకే హరిప్రియకు టికెట్ ఇవ్వొద్దంటూ అసమ్మతి నేతలు అధిష్టానం వద్ద పెద్ద పంచాయతీ పెట్టారు. షాడో ఎమ్మెల్యేగా పని చేస్తోన్న హరిసింగ్ కాంట్రాక్ట్ పనుల్లో కమీషన్లు, సింగరేణి కోల్ ట్రాన్స్ పోర్ట్ లో వాటాల వసూళ్లు మొదలెట్టారని సొంతపార్టీ నేతలు హైకమాండ్‌కు కంప్లయింట్ చేశారు. హరిప్రియకు టికెట్ ఇవ్వొద్దంటూ 120 మంది స్థానిక నేతలతో కలసి మంత్రి హరీష్‌ను కలిశారు. అసమ్మతి నేతల ఫిర్యాదులతో హరిప్రియ వర్గం తెగ టెన్షన్ పడిపోయింది. బీ ఫామ్ దక్కకపోతే ఏట్లా ఆని ఆలోచించింది. అయితే లాస్ట్ మినిట్‌లో లక్కీగా టికెట్ హరిప్రియకే దక్కింది. ఇల్లందు నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు చేపట్టిన రాజ్యసభ మెంబర్ రవిచంద్ర బుజ్జగింపులు మొదలుపెట్టినా పెద్దగా ఫలితం లేదని లోకల్ టాక్. తాము వద్దన్నా హరిప్రియకే టికెట్ ఇవ్వటం పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న దమ్మాలపాటి తన అసమ్మతి స్వరం మరింత పెంచారు. దీనికి తోడు హరిప్రియ భర్త హరి సింగ్ తో వస్తున్న తలనొప్పులను సర్దుబాటు చేయటం రవిచంద్రకు తలకు మించిన భారంగా మారింది.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి ఆరు నెలల్లోనే అభివృద్ధి పేరుతో బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు ఎమ్మెల్యే హరిప్రియ...ఇల్లందు నియోజకవర్గానికి బస్ డిపో, సివిల్ ఆస్పత్రి అప్ గ్రేడ్, మినహా నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి జరగలేదనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. బయ్యారం స్టీల్ ప్లాంట్, ఇల్లందులో మూతపడ్డ రైల్వే స్టేషన్ పున ప్రారంభం, సీతారామ ప్రాజెక్టు రీ డిజైన్ లాంటి హామీలు అలాగే మిగిలిపోవడంతో జనం ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ఇవే కీలక అంశాలు కాబోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇల్లందు అధికార పార్టీ లో వ్యవహారం ఇలా ఉంటే ... కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు అంతకంటే ఎక్కువే ఉంది. నియోజక వర్గం లో కాంగ్రెస్ పార్టీకి భారీగా ఓట్ బ్యాంకు ఉన్నా పార్టీని ముందుండి నడిపించే సరైన లీడర్ లేకపోవటం పెద్ద మైనస్ పాయింట్. పొంగులేటి అనుచరుడు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరటం ఉపయోగకరమే అంటున్నారు. ఆయనకే టికెట్ ఖాయం కానుందన్న ప్రచారం మొదలవడంతో కనకయ్య గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టేశారు. అఫిషియల్‌గా హైకమాండ్ నుంచి బిఫామ్ పుచ్చుకున్నాక ప్రచారంలో స్పీడు పెంచాలని కనకయ్య ప్లాన్. మొత్తానికి ఈసారి ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీల మధ్య రసవత్తరమైన ఖాయమంటున్నారు స్థానికులు. -
Kavitha : కూతురు కవిత విషయంలో కేసీఆర్ వ్యూహమేంటీ?
దెబ్బ తిన్న చోటే పోరాడి గెలిచి చూపించాలన్నది సీఎం కెసిఆర్ వ్యూహాంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ సీటు స్థానానికి పోటీ చేసిన కవిత అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు. కవిత రాజకీయ భవితవ్యంపై అప్పట్లో ఓ రకంగా సంధిగ్దత నెలకొంది. ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చినా.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మండలిలో అడుగు పెట్టారు కవిత. జగిత్యాల ? నిజామాబాద్ .?? గత రెండేళ్లుగా కవిత ప్రధానంగా రెండు నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. ఒకటి నిజామాబాద్ అర్బన్ కాగా, మరొకటి జగిత్యాల. బతుకమ్మ వేడుకల నుంచి ప్రతీ చిన్న కార్యక్రమానికి ఈ రెండు చోట్ల కవిత హాజరు కావడంతో ఈ రెండింటిలో ఏదో ఒక చోట కవిత పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ సంజయ్ కూడా తనకు టికెట్ దక్కుతుందో లేదో అన్న అనుమానాల్ని నిన్నటి వరకు కూడా వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో జగిత్యాల నుంచి కవితకు టికెట్ ఖాయం అన్న ప్రచారం జరిగింది. అయితే సీఎం కెసిఆర్ మాత్రం ఈ విషయంలో ఎలాంటి ముందడుగు వేయలేదు. తాజా జాబితాలో కవితకు చోటివ్వలేదు. Dumdaar Leader - Dhamakedaar Decision !! Our leader KCR Garu announced 115 exceptional candidates for the forthcoming Assembly elections out of 119 seats. It truly is a testament to the people's faith in CM KCR Garu's courageous leadership and the impactful governance of the… pic.twitter.com/G3czjqZeNK — Kavitha Kalvakuntla (@RaoKavitha) August 21, 2023 మళ్లీ ఢిల్లీకే.! ఓడిన చోటే కవిత ఘనవిజయం సాధించాలన్నది కెసిఆర్ పట్టుదలగా కనిపిస్తోంది. నిజామాబాద్‌లో కవితపై బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలవడం కెసిఆర్ పొలిటికల్ కెరియర్లో ఇబ్బంది పడ్డ క్షణం. ఓ రకంగా రాజకీయంగా ఉద్ధండుడైన కెసిఆర్.. తన బిడ్డను గెలిపించుకోలేకపోయాడన్న ప్రచారం జరిగింది. టార్గెట్ పార్లమెంట్ 2024 ఎండాకాలంలో జరిగే లోక్‌సభ ఎన్నికల కోసం కవితను సీఎం కెసిఆర్ సిద్ధం చేస్తున్నట్టు తాజా టికెట్ల ప్రకటనతో తేలింది. నిజామాబాద్ నుంచే కవితను బరిలో దించి ఘనవిజయం సాధించేలా అడుగులు కదపాలన్నది కెసిఆర్ వ్యూహాంగా కనిపిస్తోంది. The spirit of Telangana and the celebration of “Car and KCR Sarkar”! ✊🏻 This Padyatra today reflects on the tremendous energy and enthusiasm towards BRS Government led by CM KCR Garu. Jai Telangana! Jai KCR! pic.twitter.com/5dVkm3NaSJ — Kavitha Kalvakuntla (@RaoKavitha) August 16, 2023 -
గెలుపు వీరులు...రికార్డుల రారాజులు
సాక్షి, ఏలూరు : పార్టీలతో సంబంధం లేకుండా జిల్లా రాజకీయాలను శాసించిన వీరులు ఎందరో ఉన్నారు. వ్యక్తిగత ప్రతిష్టతో అత్యధికసార్లు నెగ్గి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పి భళా అనిపించుకున్నారు. వీరిలో ఆరుసార్లు గెలుపుబావుటా ఎగురేశారు సీహెచ్‌వీపీ మూర్తిరాజు. కనుమూరి బాపిరాజు, కోటగిరి విద్యాధరరావు, కలిదిండి రామచంద్రరాజు, కొత్తపల్లి సుబ్బారాయుడు ఐదుసార్లు ఓటర్ల మనసు గెలిచారు. అల్లు వెంకట సత్యనారాయణ, పెన్మెత్స వెంకటనరసింహరాజు, గారపాటి సాంబశివరావు, పెండ్యాల వెంకట కృష్ణారావు, చేగొండి హరిరామజోగయ్య నాలుగుసార్లు ప్రజామోదం పొందారు. దండు శివరామరాజు, ముళ్లపూడి వెంకట కృష్ణారావు, వంకా సత్యనారాయణ, కారుపాటి వివేకానంద, కలిదిండి విజయ నరసింహరాజు, పరకాల శేషావతారం, ఎం.రామ్మోహనరావు, టి.వీరరాఘవులు, పితాని సత్యనారాయణ, తెల్లంబాలరాజు మూడుసార్లు విజయకేతనం ఎగురవేశారు. -
ఇక సెట్‌రైట్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : జిల్లా రాజకీయాలు క్రమంగా ఓ రూపానికి వస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కొంత గందరగోళంగా కనిపించిన జిల్లా రాజకీయం రూపురేఖలు మార్చుకుంటోంది. ఆయారాం, గయారాంల హడావుడి తగ్గడంతో ఇప్పుడు అన్ని పార్టీలు దాదాపు సెటిల్ అయినట్టే కనిపిస్తున్నాయి. రాజకీయ వలసల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ జిల్లాలో బలం పుంజుకుంది. టీడీపీ డీలా పడింది. ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి కొంత వలసలు కనిపించినా ముఖ్య నేతలెవరూ పార్టీ మారకపోవడంతో ఆ పార్టీ ఊపిరిపీల్చుకుంది. వామపక్షాలు ఎన్నికల వేడి నుంచి బయటపడి పోరాటాలపై దృష్టి సారించాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ నిర్మాణాత్మక ప్రతిపక్షపాత్రలో ఒదిగిపోయింది. నరేంద్రమోడీ హవాతో కేంద్రంలో అధికారంలోకి వచ్చినా బీజేపీ జిల్లా శ్రేణుల్లో మాత్రం పెద్దగా చలనం కనిపించటం లేదు. మొత్తమ్మీద రాజకీయ అల్పపీడనాలు తీరం దాటిపోయినట్టు కనిపిస్తున్నాయి. త్వరలోనే జరుగుతాయనుకుంటున్న ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి. ‘గులాబీ’ దూకుడు జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి టీఆర్ఎస్పైనే. రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రావడం, ఆ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరడంతో ఇప్పుడు జిల్లాలో బలమైన పార్టీగా ఎదిగింది. తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు కూడా జిల్లాలో టీఆర్ఎస్ బలం పుంజుకోలేకపోయినా, స్థానిక సంస్థల ఎన్నికలలో పెద్దగా బలం చాటకపోయినా, సార్వత్రిక ఎన్నికల్లో కేవలం ఒక ఎమ్మెల్యే స్థానంతో సరిపెట్టుకున్నా, ఎన్నికల తర్వాత మాత్రం పార్టీ బలోపేతం అయింది. ఇప్పుడు ఆ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీతో పాటు జడ్పీ చైర్పర్సన్ ఉన్నారు. త్వరలోనే మంత్రి పదవి కూడా లభిస్తుందని సమాచారం. ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన తుమ్మలకు మంత్రివర్గంలో స్థానం ఖాయమని, దసరా బోనాంజాగా ఆయనకు కేబినెట్లో బెర్త్ లభించవచ్చని ప్రచారం. ఆయనకు ఆర్అండ్బీ లేదా రెవెన్యూశాఖ లభించవచ్చని అంటున్నారు. జిల్లాలో పార్టీ నుంచి గెలిచిన జలగం వెంకట్రావుకూ తగిన ప్రాతినిధ్యం లభిస్తుందని కూడా సమాచారం. కేసీఆర్ తనకు అప్పగించిన బాధ్యతల్లో భాగంగానే తుమ్మల తన రాజకీయ ప్రత్యర్థి జలగం వెంకట్రావు నివాసానికి వెళ్లి ఇటీవల చర్చలు జరిపారని సమాచారం. ఇక ఇప్పుడు టీఆర్ఎస్ శ్రేణుల దృష్టి నామినేటెడ్ పోస్టులపైనే ఉంది. సర్దుకుపోదాం రండి తుమ్మల నిష్ర్కమణతో టీడీపీ పూర్తిగా డీలాపడినట్టు కనిపిస్తోంది. ఆ పార్టీలో మొన్నటివరకు ముఖ్య నాయకులుగా ఉన్నవారంతా ఇప్పుడు గులాబీ గూటికి చేరడంతో మిగిలిన వారితోనే ముందుకెళ్లాలని పార్టీ నేతలు నిర్ణయించుకున్నారు. జడ్పీచైర్‌పర్సన్ స్థానాన్ని దక్కించుకుని కొంత బలం పుంజుకున్నట్టు కనిపించినా చైర్పర్సన్ కవిత కూడా పార్టీని వీడటంతో టీడీపీలో నిస్తేజం అలుముకుంది. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుతో పాటు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, నాలుగైదు నియోజకవర్గాల ఇన్చార్జులు మాత్రమే పార్టీలో మిగిలారు. అంతా ఒకటే.. గ్రూప్ గొడవలతో సతమతమైన కాంగ్రెస్ ఇప్పుడు ఏకతాటిపై నడుస్తున్నట్లు కనిపిస్తోంది. రేణుక, రాంరెడ్డి, భట్టి, సుధాకర్‌రెడ్డి, బలరాంనాయక్... ఇలా అనేక మంది నాయకుల పేర్లతో గ్రూపులుగా విడిపోయిన ఆ పార్టీ నేతలు అధికారం కోల్పోయాక అందరం ఒకటనే భావనలో ఉన్నారు. అధికార టీఆర్ఎస్పై గురిపెట్టి పనిచేయాలని నిర్ణయించుకున్న పార్టీ నేతలు జిల్లా కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో కలిసే పాల్గొన్నారు. జిల్లా కేంద్రం ఎమ్మెల్యేగా పువ్వాడ అజయ్ కూడా తన వర్గాన్ని బలోపేతం చేసుకునే పనిలో పడ్డారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల గెలుపోటముల బాధ్యతను పూర్తిగా తనకే అప్పగించాలని అధిష్టానానికి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. రాజకీయ వలసల్లో భాగంగా ఒక ఎమ్మెల్యేను కోల్పోయిన కాంగ్రెస్ ప్రస్తుతానికి డీసీసీ అధ్యక్షుడి నియామకం, కార్పొరేషన్ ఎన్నికలపై దృష్టి పెట్టి పనిచేస్తోంది. మా దారి రహదారి... సార్వత్రిక ఎన్నికలలో ఖమ్మం ఎంపీ పీఠాన్ని దక్కించుకుని మంచి జోష్ మీదున్న వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఎన్నికల త ర్వాత కూడా తనదైన శైలిలో ముందుకెళుతోంది. పార్టీ నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నా... ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం ఒకేతాటిపై పార్టీని నడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ప్రజాసమస్యలపై స్పందిస్తూ ముగ్గురూ క్షేత్రస్థాయి పర్యటనలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లో ఉంటున్నారు. పార్టీ పరంగా కూడా ముగ్గురు నేతలకు ప్రాతినిధ్యం లభించింది. జిల్లాలో పార్టీ బాధ్యతలను పొంగులేటి భుజస్కంధాలపై వేసుకొని ముందుకెళ్తున్నారు. పోరాటాల బాటలో ఎర్రసైన్యం ఎన్నికలలో ఆశించిన ఫలితాలు రాకపోయినా ఎప్పటిలాగే వామపక్ష పార్టీలు ప్రజాసమస్యలపై పోరాడే పనిలో పడ్డాయి. అసంఘటిత రంగ కార్మికుల పక్షాన సీపీఐ, సీపీఎంలు ఉద్యమాలను ఉధృతం చేస్తుండగా, ఆదివాసీ గిరిజనుల హక్కులను కాపాడే క్రమంలో న్యూడెమొక్రసీ ఆందోళనలు చేస్తోంది. ‘కమలం’ వికాసం అంతంతమాత్రమే.. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం జిల్లాలో పట్టు పెంచుకోలేకపోతోంది. చరిష్మా ఉన్న నాయకులెవరూ పార్టీలో లేకపోవడం, తెలంగాణ నేతలు కూడా జిల్లాపై పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న స్థితిలో ఉంది కమలదళం పరిస్థితి ఉంది. -
కుటుంబ బంధాలు రాజకీయ అందలాలు
అమలాపురం, న్యూస్‌లైన్ : జిల్లా రాజకీయాలను శాసించే మెట్టలో రాజకీయం బంధాలు, బంధువుల పాలనతో పెనవేసుకుపోయింది. ప్రధానంగా ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాల నుంచి పలు కుటుంబాల వారు, వారి బంధువులు రాజకీయంగా ఉన్నత పదవులు సాధించారు. జగ్గంపేట నియోజకవర్గం నుంచి సుదీర్ఘకాలం తోట కుటుంబీకులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన దివంగత తోట సుబ్బారావు, తోట గోపాలకృష్ణ, తోట వెంకటాచలం, తాజా మాజీ రాష్ట్రమంత్రి తోట నర్శింహం అన్నదమ్ముల బిడ్డలే. తోట వెంకటాచలానికి నర్శింహం సొంత తమ్ముడు. తోట సుబ్బారావు ఎమ్మెల్యేగా, రాష్ట్రమంత్రిగా పనిచేయడంతోపాటు కాకినాడ పార్లమెంట్ సభ్యునిగా కూడా పనిచేశారు. ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జ్యోతుల నెహ్రూ మాజీమంత్రి తోట సుబ్బారావుకి మేనల్లుడు. ప్రస్తుతానికి కాకినాడ పార్లమెంట్ వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్ సైతం తోట కుటుంబీకులకు మేనల్లుడి వరుస. తోట కుటుంబానికి చెందిన దివంగత గోపాలకృష్ణ పెద్దాపురం నుంచి ఎమ్మెల్యేగా, కాకినాడ ఎంపీగా పనిచేశారు. తాజాగా ఇతని కుమారుడు తోట సుబ్బారావునాయుడు పెద్దాపురం వైఎస్సార్సీపీ కో ఆర్డినేటర్‌గా ఉన్నారు. జిల్లాలో రాజకీయంగా చక్రం తిప్పిన దివంగత మాజీమంత్రి పంతం పద్మనాభం పెద్దాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆయన అన్న కుమారుడు పంతం గాంధీమోహన్ ఇదే నియోజకవర్గానికి తాజామాజీ ఎమ్మెల్యే. ప్రత్తిపాడు నియోజకవర్గంలో సైతం కుటుంబపాలనకే ఓటర్లు పెద్దపీట వేశారు. ముద్రగడ కుటుంబం నుంచి దివంగత ముద్రగడ వీరరాఘవులు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించగా ఆయన కుమారుడు పద్మనాభం అక్కడే ఎమ్మెల్యేగా గెలవడంతోపాటు రాష్ట్రమంత్రిగాను, కాకినాడ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఇదే నియోజకవర్గం నుంచి పర్వత కుటుంబానికి చెందిన పర్వత గుర్రాజు సోదరుడు పర్వత సుబ్బారావు, ఆయన భార్య పర్వత బాపనమ్మలు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. సుబ్బారావుకు తాజా మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు సోదరుని కుమారుడు కావడం గమనార్హం. అన్నదమ్ముల పిల్లలైన వరుపుల జోగిరాజు, వరుపుల సుబ్బారావులు సైతం ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా చేశారు. తోట కుటుంబీకులకు పంతం కుటుంబీకులు మేనమామ బిడ్డలవుతారు. వీరికి కాకినాడ నుంచి పార్లమెంట్ సభ్యులుగా, కేంద్రమంత్రులుగా పనిచేస్తున్న మల్లిపూడి శ్రీరామ సంజీవరావు కుటుంబానికి బంధుత్వాలున్నాయి. మొత్తం మీద మెట్ట రాజకీయాల్లో చక్రం తిప్పే తోట, వరుపుల, పంతం, జ్యోతుల, మల్లిపూడి కుటుంబాల మధ్య బంధుత్వాలు ఉండడం గమనార్హం. తుని అసెంబ్లీ నియోజకవర్గంలో సైతం కుటుంబపాలన జరిగింది. ఈ నియోజకవర్గం తాజామాజీ ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబు కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. అశోక్‌బాబు తాత ఎస్.ఆర్.వి.వి.కృష్ణంరాజు (బులిబాబు) మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవగా, ఆయన కుమార్తె, అశోక్‌బాబు మేనత్త ఎం.ఎన్.విజయలక్ష్మీదేవి సైతం ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక కోనసీమలో కుటుంబపాలన అనగానే గుర్తుకు వచ్చేది కుడుపూడి కుటుంబీకులు. ఈ కుటుంబానికి చెందిన కుడుపూడి సూర్యనారాయణ, ఆయన కుమారుడు కుడుపూడి ప్రభాకరరావులు ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ప్రభాకరరావుకు చిట్టబ్బాయి వరుసకు సోదరుడే. మెట్ట నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన తోట నర్శింహానికి అమలాపురానికి చెందిన మాజీమంత్రి మెట్ల సత్యనారాయణరావు సొంత మామగారు. మెట్లకు రాజోలు మాజీ ఎమ్మెల్యే దివంగత మంగెన గంగయ్య వియ్యంకుడు కావడం గమనార్హం.