What is KCR Strategy on Daughter Kavitha? - Sakshi
Sakshi News home page

Kavitha : కూతురు కవిత విషయంలో కేసీఆర్ వ్యూహమేంటీ?

Published Mon, Aug 21 2023 4:14 PM | Last Updated on Thu, Aug 24 2023 4:12 PM

What is KCR strategy on daughter Kavitha? - Sakshi

దెబ్బ తిన్న చోటే పోరాడి గెలిచి చూపించాలన్నది సీఎం కెసిఆర్ వ్యూహాంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ సీటు స్థానానికి పోటీ చేసిన కవిత అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు. 

కవిత రాజకీయ భవితవ్యంపై అప్పట్లో ఓ రకంగా సంధిగ్దత నెలకొంది. ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చినా.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మండలిలో అడుగు పెట్టారు కవిత. 

జగిత్యాల ? నిజామాబాద్ .??

గత రెండేళ్లుగా కవిత ప్రధానంగా రెండు నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. ఒకటి నిజామాబాద్‌ అర్బన్‌ కాగా, మరొకటి జగిత్యాల.  బతుకమ్మ వేడుకల నుంచి ప్రతీ చిన్న కార్యక్రమానికి ఈ రెండు చోట్ల కవిత హాజరు కావడంతో ఈ రెండింటిలో ఏదో ఒక చోట కవిత పోటీ చేస్తారని ప్రచారం జరిగింది.

జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్‌ సంజయ్‌ కూడా తనకు టికెట్‌ దక్కుతుందో లేదో అన్న అనుమానాల్ని నిన్నటి వరకు కూడా వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో జగిత్యాల నుంచి కవితకు టికెట్‌ ఖాయం అన్న ప్రచారం జరిగింది. అయితే సీఎం కెసిఆర్‌ మాత్రం ఈ విషయంలో ఎలాంటి ముందడుగు వేయలేదు. తాజా జాబితాలో కవితకు చోటివ్వలేదు. 

మళ్లీ ఢిల్లీకే.!

ఓడిన చోటే కవిత ఘనవిజయం సాధించాలన్నది కెసిఆర్‌ పట్టుదలగా కనిపిస్తోంది. నిజామాబాద్‌లో కవితపై బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ గెలవడం కెసిఆర్‌ పొలిటికల్‌ కెరియర్‌లో ఇబ్బంది పడ్డ క్షణం. ఓ రకంగా రాజకీయంగా ఉద్ధండుడైన కెసిఆర్‌.. తన బిడ్డను గెలిపించుకోలేకపోయాడన్న ప్రచారం జరిగింది.

టార్గెట్‌ పార్లమెంట్‌

2024 ఎండాకాలంలో జరిగే లోక్‌సభ ఎన్నికల కోసం కవితను సీఎం కెసిఆర్‌ సిద్ధం చేస్తున్నట్టు తాజా టికెట్ల ప్రకటనతో తేలింది. నిజామాబాద్‌ నుంచే కవితను బరిలో దించి ఘనవిజయం సాధించేలా అడుగులు కదపాలన్నది కెసిఆర్‌ వ్యూహాంగా కనిపిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement