గెలుపు వీరులు...రికార్డుల రారాజులు | Record Majority MLA's In West Godavari District | Sakshi
Sakshi News home page

గెలుపు వీరులు...రికార్డుల రారాజులు

Published Sat, Mar 16 2019 10:39 AM | Last Updated on Sat, Mar 16 2019 10:40 AM

Record Majority MLA's In West Godavari District - Sakshi

సాక్షి,  ఏలూరు : పార్టీలతో సంబంధం లేకుండా జిల్లా రాజకీయాలను శాసించిన వీరులు ఎందరో ఉన్నారు. వ్యక్తిగత ప్రతిష్టతో అత్యధికసార్లు నెగ్గి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పి భళా అనిపించుకున్నారు. వీరిలో ఆరుసార్లు గెలుపుబావుటా ఎగురేశారు సీహెచ్‌వీపీ మూర్తిరాజు. కనుమూరి బాపిరాజు, కోటగిరి విద్యాధరరావు, కలిదిండి రామచంద్రరాజు, కొత్తపల్లి సుబ్బారాయుడు ఐదుసార్లు ఓటర్ల మనసు గెలిచారు. అల్లు వెంకట సత్యనారాయణ, పెన్మెత్స వెంకటనరసింహరాజు, గారపాటి సాంబశివరావు, పెండ్యాల వెంకట కృష్ణారావు,  చేగొండి హరిరామజోగయ్య నాలుగుసార్లు ప్రజామోదం పొందారు. దండు శివరామరాజు, ముళ్లపూడి వెంకట కృష్ణారావు, వంకా సత్యనారాయణ, కారుపాటి వివేకానంద, కలిదిండి విజయ నరసింహరాజు,  పరకాల శేషావతారం, ఎం.రామ్మోహనరావు, టి.వీరరాఘవులు, పితాని సత్యనారాయణ, తెల్లంబాలరాజు మూడుసార్లు విజయకేతనం ఎగురవేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement