
సాక్షి, ఖమ్మం: అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఏక కాలంలో పొంగులేటి ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
వివరాల ప్రకారం.. కాంగ్రెస్ నేత పొంగులేటికి ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. గురువారం తెల్లవారుజామునే ఎనిమిది వాహనాల్లో ఐటీ అధికారులు వాహనాల్లో పొంగులేటి ఇంటికి చేరుకున్నారు. ఖమ్మంలోని ఆయన ఇంట్లో, పాలేరులోని క్యాంపు ఆఫీసులు దాడులు తనిఖీలు జరుపుతున్నారు. ఇక, త్వరలోనే తనపై ఈడీ, ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని పొంగులేటి బుధవారం మీడియాలో మాట్లాడుతూ చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు, నేడు పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి నేడు నామినేషన్ వేసేందుకు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment