ఆ రోజు కన్నీళ్లు కార్చాను.. మంత్రి పొంగులేటి ఎమోషనల్‌ | Minister Ponguleti Srinivasa Reddy Is Emotional In Khammam, Details Inside - Sakshi
Sakshi News home page

ఆ రోజు కన్నీళ్లు కార్చాను.. మంత్రి పొంగులేటి ఎమోషనల్‌

Published Wed, Jan 10 2024 11:59 AM | Last Updated on Wed, Jan 10 2024 1:54 PM

Minister Ponguleti Srinivasa Reddy Is Emotional In Khammam - Sakshi

సాక్షి, ఖమ్మం జిల్లా: గత ప్రభుత్వంలో నిరుద్యోగ యువత వివక్షతకు గురయ్యారని,  నిరుద్యోగులు అందరూ కలసి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారంటూ వ్యాఖ్యానించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. ఖమ్మం నగరంలోని భక్త రామదాస్  కళాక్షేత్రంలో రైట్ ఛాయిస్ ఆధ్వర్యంలో ఏర్పాటు ఆత్మీయ సత్కారంలో మంత్రి పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో  ఆ కుటుంబం చెప్పిందే వేదం.. గత ప్రభుత్వం 6 లక్షల కోట్ల అప్పులు చేసింది. మా ప్రభుత్వంలో ఈ ఏడాది రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాం. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు మొదటి అడుగు పడిందని మంత్రి పేర్కొన్నారు.

మంత్రి ఎమోషనల్‌..
నన్ను ఒంటరిగా చేసినప్పుడు కన్నీళ్లు కార్చానని.. ఆ రోజు అభిమానులు బాధపడతారని వారి ఎదుట ఎమోషనల్ కాలేదని.. మంత్రి  పొంగులేటి భావోద్వేగానికి గురయ్యారు.

ఇదీ చదవండి: ఆసక్తికరంగా ఖమ్మం పాలిటిక్స్‌.. ఎంపీ రేసులో మంత్రి సతీమణి?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement