
మధిర: రాష్ట్రంలో ప్రజల ప్రభుత్వం ఏర్పాటు కావాలని, ప్రజాస్వామ్యయుత సామాజిక నిర్మాణం జరగాలనే ఆకాంక్షతో ఓటర్లు కాంగ్రెస్‌కు ఓటు వేశారని సీఎల్పీ నేత, మధిర కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మధిరలో ఓటు హక్కు వినియోగించుకోవడంతోపాటు నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర సంపద ప్రజలకు పంచాలని.. సక్రమంగా అన్ని వర్గాలకు అందాలని బలంగా కోరుకుంటున్నానని చెప్పారు. పదేళ్ల కాలంలో వనరులు, సంపద రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు భిన్నంగా దోపిడీకి గురైందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రజలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు బాటలు వేశారని భట్టి వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలతోపాటు మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్నీ తూ.చ. తప్పక అమలు చేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment