ఖమ్మం: పాలేరు నియెఓజకవర్గంలో కాంగ్రెస్ పక్షాన పోటీచేసిన కందాళ ఉపేందర్ రెడ్డి తొలిసారి గెలిచారు. ఆయన తన సమీప బీఆర్‌ఎస్ ప్రత్యర్ది, మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావుపై సంచలన విజయం సాదించారు. అంతకు ముందు ఉప ఎన్నికలో ఇక్కడ తుమ్మల భారీ ఆధిక్యంతో గెలుపొందగా, జనరల్ ఎన్నికలో ఓడిపోయారు.
ఉపేందర్ రెడ్డికి 7669 ఓట్ల ఆధిక్యత వచ్చింది. ఉపేందర్ రెడ్డికి 89407 ఓట్లు రాగా, తుమ్మల నాగేశ్వరరావుకు 81738 ఓట్లు వచ్చాయి. ఇక్కడ సిపిఎం అభ్యర్ధిగా పోటీచేసిన బత్తుల హైమవతికి సుమారు 5800 ఓట్లు వచ్చాయి. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ఎన్నికలను ప్రభావితం చేసే ప్రధాన అంశం అభివృద్ధి.
ప్రస్తుత ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి గెలిచిన మూడు నెలలలోనే నియోజకవర్గ అభివృద్ధి పేరుతో అధికార బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అయినప్పటికీ ఇంతవరకు నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయలేకపోవడంతో పాటు కాంగ్రెస్ గుర్తుపై గెలిచి బీఆర్‌ఎస్ పార్టీలో చేరి తనకు ఓట్లేసిన కాంగ్రెస్ కార్యకర్తలపైనే కేసులు పెట్టించాడు. దాంతో ఆయనకు కాంగ్రెస్‌లో పార్టీలో వర్గపోరు మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment