paleru assembly constituency
-
ఏపీ రాజకీయాలలో మరో వలస పక్షి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మరో వలస పక్షి చేరింది. ఆమె చిలక పలుకులు కూడా పలకడం ఆరంభించారు. ఆమె ఎవరో కాదు. నిన్న,మొన్నటి వరకు వైఎస్ఆర్ టీపీ పేరుతో తెలంగాణలో సొంత పార్టీని స్థాపించి, తదుపరి దానిని నడపలేక చేతులెత్తేసి కాంగ్రెస్ లో విలీనం చేసిన వైఎస్ షర్మిల . ఆమె ఏపీ రాజకీయాలలోకి రావడాన్ని తప్పు పట్టనక్కర్లేదు. ఆమె రాజకీయ ప్రస్తానం గమనిస్తే, ఆమె గతంలో చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకుంటే ఆమె తెలంగాణ రాజకీయాలకే పరిమితం కావాలి. తెలంగాణలోనే పుట్టాను..ఇక్కడే పెరిగాను. ఇక్కడే వివాహం చేసుకున్నాను. తెలంగాణ వారికి కోడలిని ఆమె చెబుతూ ఏపీ రాజకీయాలతో సంబంధం లేదని అప్పట్లో స్పష్టం చేశారు. అంతేకాదు.. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత వివిధ కేసులలో చార్జీషీట్ లలో ఆయన పేరు చేర్చిన కాంగ్రెస్ పై తీవ్రంగా విమర్శలు చేసేవారు. కాంగ్రెస్ పై ఉమ్మేయాలని అనేవారు. రాహుల్ గాంధీ తో తన పార్టీకి ఏమి సంబంధం అని ఆమె ప్రశ్నించేవారు. ✍️అలాంటి వ్యక్తి ,తెలంగాణలో రాజకీయాలు వదలుకుని కాంగ్రెస్ పార్టీ పెద్దల ఒత్తిడి మేరకు ఏపీ రాజకీయాలలోకి వచ్చి పిసిసి అధ్యక్షురాలు అవడం ద్వారా సాధించేదేమిటో తెలియదు. కేవలం వంద రోజుల వలస పక్షిగా మిగిలిపోవడం తప్ప ఏమి చేస్తారన్నది అర్ధం కాదు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తప్ప మిగిలిన పార్టీల నేతలంతా వలస పక్షుల మాదిరి హైదరాబాద్ లోనే నివసిస్తూ, ఏపీ రాజకీయాలు చేస్తుండగా, వారికి ఈమె కూడా తోడు అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ,ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల స్థిర నివాసం హైదరాబాద్ కాగా, కేవలం రాజకీయాల కోసమే ఏపీకి వెళుతుంటారు. అక్కడ వారికి అమరావతి ప్రాంతంలో సొంత ఇళ్లు కూడా లేవు. ఇప్పుడు షర్మిల కూడా అద్దె ఇల్లు వెతుక్కుని కాంగ్రెస్ ను నడపాలి. ✍️వంద రోజులలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ కావాలని ఈమెను ఒత్తిడి చేసి ఏపీ రాజకీయాలకు తీసుకు వచ్చినట్లు అనిపిస్తుంది. తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు తాను ఎట్టి పరిస్థితిలోను ఏపీ రాజకీయాలకు వెళ్లనని చెప్పారు. అప్పుడే తెలంగాణ రాజకీయాలలోకి వెళ్లవద్దని సోదరుడు జగన్ చెప్పినా వినిపించుకోలేదు. చిత్రం ఏమిటంటే తెలంగాణ వ్యక్తిని అని చెప్పుకున్న వ్యక్తిని ఏపీకి కాంగ్రెస్ తీసుకు వచ్చి పార్టీ అధ్యక్షురాలిని చేయడం. ఇదంతా గమనిస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరోక్షంగా సహకరించారు. దానికి ప్రతిఫలంగా తెలుగుదేశంకు ఏపీలో పరోక్షంగా సహకరించడానికి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు షర్మిలను రంగంలో దించినట్లు అనిపిస్తుంది. ఆంద్రజ్యోతి ఎమ్.డి. రాధాకృష్ణ రాజకీయ ట్రాప్ లో షర్మిల, ఆమె భర్త అనిల్ పడ్డారంటేనే తెలుగుదేశం గుప్పిట్లోకి వెళ్లినట్లు లెక్క. ఎందుకంటే రాధాకృష్ణ, చంద్రబాబులు వేర్వేరు అని ఎవరూ అనుకోరు. ✍️ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కెవిపి సొంత మనిషిగా భావించే గిడుగు రుద్రరాజును నియమించినప్పుడే అనుమానం వచ్చింది. రుద్రరాజు రాష్ట్రపార్టీని నడపగలుగుతారా?లేదా?అన్నదానితో నిమిత్తం లేకుండా నియమించి, ఆ తర్వాత ఆయనను తప్పించి షర్మిలకు బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ లో దశాబ్దాల తరబడి నేతలుగా ఉండి పలుమార్లు మంత్రులుగా, ఎమ్.పిలుగా పదవులు అనుభవించిన కెవిపి రామచంద్రరావు, చింతా మోహన్ ,పల్లంరాజు వంటి వారికి ఈ బాధ్యత అప్పగించకుండా షర్మిలను పనికట్టుకుని తీసుకురావడంలోనే కుట్ర కోణం కనిపిస్తుంది. షర్మిల వస్తే జగన్ కు మద్దతు ఇచ్చే కొన్ని వర్గాలలో చీలిక వస్తుందని, తద్వారా చంద్రబాబుకు ప్రయోజనం కలుగుతుందని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించి ఉండాలి. దానికి తగినట్లుగానే చంద్రబాబు కొన్ని రోజుల క్రితం కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డికె శివకుమార్ తో మంతనాలు జరపడం కూడా ఈ విషయాలకు బలం చేకూరింది. ✍️ వంద రోజుల్లో ఎన్నికలు పూర్తి అయిన తర్వాత , షర్మిలకు కాంగ్రెస్ పార్టీ ఏమైనా గుర్తింపు ఇస్తుందా అన్నది అనుమానమే. ఒకవేళ అలాంటి ఆలోచన ఉండి ఉంటే కర్నాటక నుంచి ఆమెను రాజ్యసభకు పంపుతారని అప్పట్లో జరిగిన ప్రచారం ప్రకారం పదవి ఇచ్చి ఉండాలి. కాని అలా ఇవ్వలేదు. అంటే కేవలం ఆమెను మభ్య పెట్టడానికి ఆ ప్రచారం చేసి ఉండవచ్చు. ఎపిలో జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ కు ఈమె వల్ల పెద్దగా కలిసి వచ్చేది ఉండదు. ఆ ఒక్క శాతం ఓట్లే పడతాయి. ఆమె ఎంపీగా పోటీచేస్తారా?లేదా?అన్నది ఇంకా తెలియవలసి ఉంది. అలా చేసినా ఓటమిపాలైతే కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈమెకు విలువ ఇవ్వడం తగ్గిస్తుంది. దాంతో ఈమెకు విరక్తి కలిగి వంద రోజుల తర్వాత తిరిగి తెలంగాణకు వచ్చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈమె మాట మీద నిలబడతారన్న గ్యారంటీ లేదు. పాలేరు నియోజకవర్గంలో పోటీచేస్తానని ప్రమాణం చేసిన ఆమె ఆ మాటకు కట్టుబడి ఉండలేకపోయారు. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల బాగు కోసం వారి శ్రేయస్సు కోసం పనిచేయాలి. మనకు పదవులు ముఖ్యం కాదు. తెలంగాణ ప్రజలు ముఖ్యం. ప్రజల కోసం వైయస్ఆర్ గారు సొంత పార్టీ ముఖ్యమంత్రుల మీద కూడా పోరాటం చేశారు. ఇది అందరు గ్రహించాలి. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామన్న సోయి అన్ని పార్టీలకు ఉండాలి.రాజకీయ… pic.twitter.com/IoiRHYVnoP — YS Sharmila (@realyssharmila) November 6, 2023 ✍️పైగా ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ తనవల్లే ఓటమిపాలయ్యారన్నట్లుగా అతిశయోక్తులతో మాట్లాడుతూ భ్రమలో ఉంటున్నారు. ఈ నేపధ్యంలో పీసీసీ బాధ్యతలు తీసుకుంటూ చేసిన ప్రసంగం కూడా విషయ పరిజ్ఞానం లేకుండా, కొంత అజ్ఞానంతో మాట్లాడినట్లు అనిపిస్తుంది. ఉదాహరణకు పోలవరం ప్రాజెక్టు వైఎస్ మరణం తర్వాత ఒక్క అడుగు ముందుకుపడలేదని అన్నారు. ఆమె పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్లి చూసి మాట్లాడితే మంచిది. జగన్ అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టుకు నలభై ఎనిమిది గేట్లు పెట్టడం జరిగింది. డయాఫ్రం వాల్ సమస్య లేకపోతే ఈపాటికి పూర్తి అయ్యేది. అలాగే తన సోదరుడిని పట్టుకుని క్రైస్తవ వ్యతిరేకి అని అనడం కేవలం ఆ వర్గం ఓటర్ల లో వ్యతిరేక భావం పెంచడానికే అని అర్ధం చేసుకోవడం కష్టం కాదు. తెలుగుదేశం పత్రికలు ఆ పాయింట్ కు అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రచారం చేశాయంటేనే ఆ విషయం తేటతెల్లం అవుతుంది.మణిపూర్ లో జరిగిన హింసాకాండపై పార్లమెంటు ఉభయ సభలలో వైఎస్సార్సీపీ ఎంపీలు తీవ్రంగా ఖండించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 74వ జయంతి సందర్భంగా పాలేరులో పార్టీ కార్యాలయం వద్ద వైయస్ఆర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. మహానేతపై అభిమానంతో మండుటెండను సైతం లెక్క చేయకుండా తరలివచ్చిన అశేష ప్రజానీకానికి ధన్యవాదాలు. నా పై మీరు చూపిస్తున్న అభిమానం, ఆప్యాయత ప్రజలపై వైయస్ఆర్ గారు… pic.twitter.com/gzLG8b7DYk — YS Sharmila (@realyssharmila) July 8, 2023 ✍️అయినా ఆమె మణిపూర్ అంశాన్ని స్వార్ద రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం శోచనీయం. ఏపీలో ఏమీ జరగలేదని అసత్య ప్రచారానికి షర్మిల పరిమితం అయ్యారు. ఏదో మొక్కుబడిగా చంద్రబాబుపై విమర్శలు చేస్తూ, ముఖ్యమంత్రి జగన్ పై మాత్రం ఘాటైన వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆమెలో ఉన్న దురుద్దేశాన్ని బయటపెట్టుకున్నారు. ఇదంతా తెలుగుదేశం లేదా ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా స్క్రిప్ట్ అన్న విషయం తెలిసిపోతుంది. తెలంగాణలో ఏమైనా కొంచెం అయినా సఫలం అయి ఉంటే షర్మిల ఏపీ రాజకీయాలను కొంత ప్రభావితం చేసే అవకాశం ఉండేది. అలాకాకపోవడంతో ఏపీలో అడుగూడిపోయిన కాంగ్రెస్ ను ఈమె ఉద్దరించేది ఏమి ఉండదు. కేవలం పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి మేలు చేయాలన్న కాంగ్రెస్ పార్టీ కుట్రలో ఈమె పావుగా మిగలడం తప్ప సాధించేది ఏమీ ఉండదు. అందుకే వందరోజుల వలస పక్షి అని చెప్పవలసి వస్తుంది. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
ఢిల్లీలో ‘పాలేరు’ సీటు పంచాయితీ
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్, వామపక్షాల పొత్తు వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఆయా పార్టీల మధ్య రాజకీయ అవగాహన కుదిరినా, సీట్లపై ఇంకా అస్పష్టత కొనసాగుతూనే ఉంది. వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాలు ఇప్పటికీ సీట్లపై కసరత్తు చేస్తూనే ఉన్నాయి. పాలేరు సీటు కోసం కాంగ్రెస్, సీపీఎం మధ్య పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రం మధ్య పాలేరు సీటు పంచాయితీ సాగుతోంది. పాలేరు సీటు తమకే కావాలని సీపీఎం నేతలు డిమాండ్ చేస్తుండగా, పాలేరుకు బదులు వైరా స్థానం ఇస్తామని కాంగ్రెస్ నచ్చచెబుతోంది. పాలేరు సీటు కోసం సీపీఎం పట్టుబడుతుంది. సీటు వ్యవహారంపై పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ఢిల్లీకి పిలిపించి చర్చిస్తున్నట్లు సమాచారం. పొంగులేటి, తుమ్మల ఇప్పుడు కాంగ్రెస్‌లో రాష్ట్రస్థాయిలో ప్రముఖులుగా ఉన్నారు. దీంతో పొంగులేటికి పాలేరు, తుమ్మలకు ఖమ్మం స్థానాలు ఇచ్చే యోచనలో కాంగ్రెస్ ఉంది. ఈ నేపథ్యంలో పాలేరు స్థానాన్ని సీపీఎంకు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ స్థానంలో సీపీఎం తరపున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభ్యర్థిగా ఉండాలని భావిస్తున్నారు. ఆ స్థానం ఇవ్వకుంటే పొత్తుకు సీపీఎం అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. విచిత్రమేంటంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీపీఎం కోరే సీట్లన్నీ కీలకమైనవే. గతంలో మధిర స్థానాన్ని కూడా సీపీఎం ప్రతిపాదించింది. ఆ స్థానంలో భట్టి విక్రమార్క అనేకసార్లు విజయం సాధించారు. ఇలా కాంగ్రెస్‌కు పట్టున్న స్థానాలను సీపీఎం కోరుతుండటంతో కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. ఏదిఏమైనా ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కోర్టులో లెఫ్ట్ సీట్ల వ్యవహారం ఉంది. పొత్తు అంశం త్వరగా కొలిక్కి రావాలని కామ్రేడ్లు వేచి చూస్తున్నారు. చదవండి: తెలంగాణలో మరో సర్వే.. ఆ పార్టీకే ఆధిక్యం -
కాంగ్రెస్‌లోకి తుమ్మల.. తెరపైకి కూకట్పల్లి!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, తెలంగాణ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన అనుచరులతో సుదీర్ఘంగా చర్చల అనంతరం కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ముహూర్తం కూడా ఆయన ఖరారు చేసుకున్నట్లు సమాచారం. అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంలోనే ఊహించని ప్రతిపాదన ఒకటి తెరపైకి వచ్చింది. సెప్టెంబర్ 6వ తేదీన తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో.. కుదరకుంటే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే తన అనుచరులతో వరుస సమావేశాలు పెడుతున్న తుమ్మల.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో తుమ్మల పోటీ చేసే నియోజకవర్గంపైనా ఆసక్తికర ప్రచారం ఒకటి వినిపిస్తోంది. ఖమ్మం, పాలేరు ఈ రెండింటిలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాల నడుమ.. అనూహ్యాంగా కూకట్ పల్లి(హైదరాబాద్) పేరు తెర మీదకు వచ్చింది. కమ్మ ఓటర్లకు గాలం వేసేందుకు తుమ్మలను కూకట్పల్లి నుంచి పోటీ చేయించే యోచన చేస్తోంది కాంగ్రెస్. అయితే ఆ ప్రతిపాదనకు తుమ్మల అంత సుముఖంగా లేనట్లు స్పష్టమవుతోంది. తాను పాలేరు(ఖమ్మం) నుంచే పోటీ చేస్తానని చెప్తున్నారట. దీంతో ఆయన పోటీచేయబోయే నియోజకవర్గ విషయంలో కాంగ్రెస్ ఇంకా మంతనాలు కొనసాగిస్తున్నట్లు భోగట్టా. బీఆర్ఎస్ తరపున పాలేరు టికెట్ దక్కకపోవడంతో.. తీవ్ర అసంతృప్తికి లోనైన తుమ్మల నాగేశ్వరరావు భారీ అనుచరుగణంతో బలప్రదర్శన నిర్వహించారు. అనంతరం ప్రజల కోసమైనా పోటీ చేస్తానని.. తలవంచేది లేదంటూ ప్రకటన సైతం చేశారు. అయితే ఆయన పార్టీ మారతారా?.. ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అనే విషయాలపై మాత్రం ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇదిలా ఉండగా.. పాలేరు నుంచే తుమ్మల పోటీ చేయనున్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. దీంతో, కూకట్పల్లి నుంచి తుమ్మల పోటీ నిలిచే అవకాశం లేనట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్కు ఇంకా తుమ్మల రాజీనామా చేయని సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌లో చేరికలపై తుమ్మలతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు,రేఖానాయక్‌లు సైతం పీసీసీతో మంతనాలు చేస్తున్నారు. ఇది చదవండి: సాగర్‌లో కారు లొల్లి -
TS Election 2023: ప్రధాన పార్టీల్లో గ్రూపు రాజకీయాలు..
ఖమ్మం: పాలేరు నియెఓజకవర్గంలో కాంగ్రెస్ పక్షాన పోటీచేసిన కందాళ ఉపేందర్ రెడ్డి తొలిసారి గెలిచారు. ఆయన తన సమీప బీఆర్ఎస్ ప్రత్యర్ది, మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావుపై సంచలన విజయం సాదించారు. అంతకు ముందు ఉప ఎన్నికలో ఇక్కడ తుమ్మల భారీ ఆధిక్యంతో గెలుపొందగా, జనరల్ ఎన్నికలో ఓడిపోయారు. ఉపేందర్ రెడ్డికి 7669 ఓట్ల ఆధిక్యత వచ్చింది. ఉపేందర్ రెడ్డికి 89407 ఓట్లు రాగా, తుమ్మల నాగేశ్వరరావుకు 81738 ఓట్లు వచ్చాయి. ఇక్కడ సిపిఎం అభ్యర్ధిగా పోటీచేసిన బత్తుల హైమవతికి సుమారు 5800 ఓట్లు వచ్చాయి. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ఎన్నికలను ప్రభావితం చేసే ప్రధాన అంశం అభివృద్ధి. ప్రస్తుత ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి గెలిచిన మూడు నెలలలోనే నియోజకవర్గ అభివృద్ధి పేరుతో అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయినప్పటికీ ఇంతవరకు నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయలేకపోవడంతో పాటు కాంగ్రెస్ గుర్తుపై గెలిచి బీఆర్ఎస్ పార్టీలో చేరి తనకు ఓట్లేసిన కాంగ్రెస్ కార్యకర్తలపైనే కేసులు పెట్టించాడు. దాంతో ఆయనకు కాంగ్రెస్‌లో పార్టీలో వర్గపోరు మొదలైంది. -
Thummala: తుమ్మల చేజారిపోకుండా..
సాక్షి, ఖమ్మం: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు రాజకీయ అడుగులు ఎటు అనేదానిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. ప్రస్తుతానికి బీఆర్ఎస్లో ఉన్న ఆయన పాలేరు టికెట్ దక్కకపోవడంతో బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం కాకుండా.. ప్రజల కోసం, తనను నమ్ముకున్న అనుచరుల కోసం ఎన్నికల బరిలోకి దిగుతానంటూ ప్రకటించి మరింత ఆసక్తిని రేకెత్తించారు. ఈ క్రమంలో ఆయన బీఆర్ఎస్లో ఉంటూనే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా? లేదంటే పార్టీ వీడి మరో పార్టీలో చేరి పోటీ చేస్తారా? అనే చర్చ నడుస్తోంది. అయితే.. ఖమ్మంలో బలమైన నేత అయిన తుమ్మలను వదులుకునేందుకు ఇతర పార్టీలు పోటీ పడుతున్నాయి. బీజేపీ ఆహ్వానించినా.. చేరొద్దంటూ ఆయన అనుచరులు ఇప్పటికే ఆయనకు సూచించారు. దీంతో.. కాంగ్రెస్ పార్టీ ఆయన కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తుమ్మల చేజారిపోకుండా ఉండేందుకు ముఖ్య నేతలను రంగంలోకి దించాలని చూస్తోంది. ఆ స్పష్టత వస్తేనే.. పాలేరు కేంద్రంగానే తుమ్మల గత కొంతకాలంగా రాజకీయాలు నడిపిస్తున్నారు. దీంతో అక్కడి నుంచే పోటీ చేయాలని ఆయన ఆశపడుతున్నారు. అయితే పాలేరు లేదంటే ఖమ్మం.. ఈ రెండు నియోజక వర్గాల్లో ఎక్కడి నుంచైనా పోటీ గురించి చేయాలని అనుచరులు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ చేరికతోనే కాదు.. పోటీ విషయంలోనూ అనుచర గణం ఆయన్ని గందరగోళంలోకి నెట్టేస్తోంది. దీంతో డైలమా కొనసాగుతోంది. ఇక.. తుమ్మల గనుక పార్టీలో చేరితే.. తుమ్మలతో పాటు పొంగులేటి సీట్ల విషయంలో సర్దుబాటు ప్రక్రియ గురించి కాంగ్రెస్ సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో స్పష్టత రాగానే.. తుమ్మలో కాంగ్రెస్‌లో చేరవచ్చనే ప్రచారం నడుస్తోందక్కడ. కాంగ్రెస్ వ్యూహాలు తుమ్మల చేరికకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఇక జిల్లా నేతలైన సీఏల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం తుమ్మల చేరికపై అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. దీంతో తుమ్మల కాంగ్రెస్ చేరికకు ఎలాంటి అవాంతరాలు లేవనే చెప్పాలి. అయితే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మూడు జనరల్ స్థానాల్లో బలమైన నేతలను రంగంలోకి దింపేందుకు కాంగ్రెస్ వ్యూహరచన చేస్తుండగా.. పరిస్థితులు అందుకు ఎంత వరకు సహకరిస్తాయో అనేది వేచి చూడాలి. మరో రెండు, మూడు రోజుల్లో తుమ్మల రాజకీయ భవితవ్యంపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
తలవంచేది లేదు.. ఎన్నికల్లో నిలబడతా: తుమ్మల
సాక్షి, ఖమ్మం: గోదావరి జలాలతో మీ పాదాలు కడిగేదాకా రాజకీయాల్లో ఉంటానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన అనుచరుల్ని ఉద్దేశించి భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా ప్రజల కోసం తాను పోటీ చేసి తీరతానని తుమ్మల ప్రకటించారు. శుక్రవారం వెయ్యి కార్లు, రెండు వేల బైకుల భారీ కాన్వాయ్‌తో ఖమ్మంలో అనుచరులు ఆయనకు ఘన స్వాగతం పలకగా.. ఊహాగానాలకు తెర తీస్తూ ఎన్నికల్లో పోటీపై ప్రకటన చేశారు. శ్రీ రాముడి ఆశీస్సులు తో పది నియోజకవర్గం లో అందరు చిరు నవ్వు తో బతకాలని 40 సంవత్సరాలు పాటు అందిరికి సౌకర్యాలు కోసం జీవితాన్ని త్యాగం చేశా. మొన్న ఎన్నికల సమయంలోనే జిల్లాతో రాజకీయ అనుబంధాన్ని తెంచుకోవాలనుకున్నా. రాజకీయాలకు స్వస్తి చెబుతానని సీఎంకు కూడా చెప్పాను. కానీ, మీ ఆందోళన, అభిమానం చూశాక మనసు మార్చకున్నాను. నాగలి దున్నుకునే వాడిని ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిని చేశారు. మూడు ప్రభుత్వాలలో నాకు అవకాశం ఇచ్చారు. నాకు కష్టం వచ్చిన ప్పుడు నన్ను కాపాడారు. గోదావరి జలాలు తో మీ పాదాలు కడిగేంత వరకు ఎంఎల్ఏ గా ఉంటా. నా చేతులు తో పాలేరు , వైరా, బేతుపల్లి లో కానీ ఉమ్మడి జిల్లాలో నింపి మీకు దూరం అవుతా. మీ కోసమే రాజకీయ జీవితం తప్ప.. నాకు పాలిటిక్స్ అవసరం లేదు. నాకు పదవి అధిపత్యం కోసం కాదు. నన్ను తప్పించానని కొందరు శునకానందం పొందుతున్నారు. ఎవరినీ నిందించను. నా శిరస్సు నరుక్కుంటా తప్పా.. నా కోసం ఎవరూ తలవంచొద్దు. ఎక్కడా తలవంచేది లేదు. అందుకే మీ కోసమే ఎన్నికల్లో నిలబడుతున్నా. మీ కీర్తి కోసం ఆత్మాభిమానం కోసం నిలబడుతా. నన్ను మీ గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తారనే మీ ముందుకు వస్తున్నా. అసలైన పనులు పూర్తి చేసి .. మీతో శెభాష్ అనిపించుకుంటా అని అనుచరుల్ని ఉద్దేశించి పేర్కొన్నారాయన. అయితే తన ప్రకటనలో ఎక్కడా బీఆర్ఎస్పైగానీ.. కేసీఆర్‌పైగానీ అసంతృప్తి వ్యక్తం చేయని తుమ్మల.. పార్టీ మార్పుపై నుంచి గానీ, ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే(పాలేరు నుంచేనా) అనే దానిపైనా స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. -
‘పాలేరు నుంచే తుమ్మల పోటీ’
సాక్షి, ఖమ్మం: ప్రజల నిర్ణయం మేరకు పాలేరు నుంచే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తారని ఆయన తనయుడు యుగంధర్ ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నాం ఖమ్మంలో భారీ కాన్వాయ్‌తో తుమ్మలకు ఘన స్వాగతం పలకగా.. యుగంధర్ అక్కడి మీడియాతో మాట్లాడారు. అనుచరులతో మాట్లాడి తుమ్మల భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారు. ప్రజల నిర్ణయం మేరకే పాలేరు నుంచి ఆయన పోటీ చేస్తారు. ఎమ్మెల్యేగా గెలిచి సీతారామా ప్రాజెక్టు పూర్తి చేయాలన్నదే ఆయన అభిమతం అని తనయుడు తుమ్మల యుగంధర్ ప్రకటించారు. బీఆర్ఎస్ తరపున పాలేరు టికెట్ ఆశించి భంగపడ్డ తుమ్మల.. గత మూడు నాలుగు రోజులుగా అనుచరులతో హైదరాబాద్ నుంచే చర్చలు జరుపుతున్నారు. అయితే ఆయన పార్టీ నుంచి జారిపోకుండా అధినేత కేసీఆర్ ప్రయత్నాలు చేయించారు. ఎంపీ నామా నాగేశ్వరరావును దూతగా పంపి.. తుమ్మలను నిలువరించే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే ఆయనకు నామినేటెడ్ పోస్ట్ ఆఫర్ చేసినట్లు ఊహాగానాలు వినిపించాయి. అయితే అందుకు తుమ్మల ఎలా స్పందించారో తెలియదుగానీ.. పాలేరు నుంచే పోటీ చేయాలనే పట్టుదలతో ఆయన ఉన్నట్లు తాజాగా ఆయన తనయుడి ప్రకటన చూస్తే స్పష్టమవుతోంది. మరోవైపు కాంగ్రెస్‌లో ఆయన చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ.. ఒకవేళ అదే జరిగినా ఖమ్మం నుంచే ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వొచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: భావోద్వేగంతో తుమ్మల కన్నీటి పర్యంతం -
ఆ ‘మూడు’పై కాంగ్రెస్ గురి.. లెక్క కుదిరిందా?
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆ మూడు జనరల్ స్థానాలపై కాంగ్రెస్ ఫుల్ ఫోకస్ పెట్టింది. మూడు చోట్ల బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపడానికి యాక్షన్ మొదలు పెట్టింది. ఇప్పటికే ఖమ్మంకు లెక్క కుదిరింది. ఇక వారికి కావాల్సింది కొత్తగూడెం, పాలేరులోనే.. దీంతో బీఆర్ఎస్లో ఉన్న ఆ రెండు నియోజకవర్గాల్లోని కీలక నేతలను హస్తం గూటికి చేర్చుకునేందుకు చర్చలు మొదలు పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. ఇంతకీ ఎవరు ఆ నేతలు.. చర్చలు ఎంత వరకు వచ్చాయి. కాంగ్రెస్ గురిపెట్టిన ఆ మూడు నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న మూడు జనరల్ స్థానాలు టార్గెట్‌గా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు మొదలు పెట్టింది. ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం మూడు నియోజకర్గాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. అయితే ఖమ్మం నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని దింపడం దాదాపు ఖారారు అయినట్లు తెలుస్తోంది. అయితే మిగిలిన రెండు నియోజకవర్గాలైన పాలేరు, కొత్తగూడెంలో ఆ పార్టీకి అభ్యర్థులు ఉన్నా.. ఇంకా బలమైన అభ్యర్థుల కోసం వేచి చూస్తోంది. దీనిలో భాగంగానే పాలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును పార్టీలో చేర్పించేందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు రంగంలోకి దిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీలోకి వస్తే పాలేరు టికెట్ ఇస్తామని హమీ ఇస్తున్నారు. మరోవైపు తుమ్మల సైతం వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పాలేరు నుంచి పోటీ చేయాల్సిందేనని డిసైడ్ అయిపోయారు. అటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పార్టీ కందాలకు టికెట్ ఇస్తే అప్పుడు తుమ్మల పార్టీలో ఉంటారా లేక ఆప్షన్ ఇస్తున్న కాంగ్రెస్‌లో జంప్ అవుతారా అన్నది క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తుమ్మల మాత్రం పార్టీ మారే ఆలోచనలో లేకపోయిన అనుచరుల ఒత్తిడి ఎక్కువైతే మాత్రం ఖచ్చితంగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందన్న టాక్ సైతం లోకల్‌గా వినిపిస్తుంది. మరోవైపు కొత్తగూడెం జనరల్ స్థానంలో సైతం కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు ఎక్కువగానే ఉన్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్‌ను పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నంలో ఉంది. పార్టీలోకి వస్తే కొత్తగూడెం టికెట్ ఇస్తామని కాంగ్రెస్ సీనియర్ నేతలు జలగంతో సంప్రందిపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్‌తో జలగం చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని త్వరలోనే జలగం పార్టీ మార్పుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం నడుస్తోంది. అటు బీఆర్ఎస్ అధిష్టానం సైతం జలగంకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపించడంలేదు. అదే విషయంపై జలగంకు సైతం ఇటివలే ఒక క్లారిటీ వచ్చిందన్న ప్రచారం ఉంది. దీంతో జలగం ఏ సమయంలోనైన హస్తం గూటికి చేరిపోయే అవకాశాలు ఉన్నాయి. చదవండి: సంగారెడ్డి: బీఆర్ఎస్లో అయోమయ పరిస్థితి! కాంగ్రెస్ అధిష్టానం అనుకున్నట్లు జరిగితే ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొత్తగూడెం నుంచి జలగం వెంకట్రావు, పాలేరు నుంచి తుమ్మల నాగేశ్వరరావు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు బరిలో నిలిచే అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనా ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఖమ్మం రాజకీయాలు మాత్రం హట్ హట్‌గా మారుతున్నాయనే చెప్పాలి. -
పాలేరు నియోజకవర్గం గొప్ప రాజకీయ చరిత్ర
పాలేరు నియెఓజకవర్గం పాలేరు నియెఓజకవర్గంలో కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసిన కందాళ ఉపేందర్ రెడ్డి తొలిసారి గెలిచారు. ఆయన తన సమీప టిఆర్ఎస్ ప్రత్యర్ది, మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావుపై సంచలన విజయం సాదించారు. అంతకు ముందు ఉప ఎన్నికలో ఇక్కడ తుమ్మల భారీ ఆదిక్యతతో గెలుపొందగా, జనరల్ ఎన్నికలో ఓడిపోయారు. ఉపేందర్ రెడ్డికి 7669 ఓట్ల ఆదిక్యత వచ్చింది. ఉపేందర్ రెడ్డికి 89407 ఓట్లు రాగా, తుమ్మల నాగేశ్వరరావుకు 81738 ఓట్లు వచ్చాయి. ఇక్కడ సిపిఎం అభ్యర్ధిగా పోటీచేసిన బత్తుల హైమవతికి సుమారు 5800 ఓట్లు వచ్చాయి. ఉపేందర్ రెడ్డి సామాజికవర్గం పరంగా రెడ్డి వర్గానికి చెందినవారు. ఎన్నికల తర్వాత ఉపేందర్ రెడ్డి టిఆర్ఎస్లో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డి పాలేరు నియోజకవర్గం నుంచి 2014లో ఐదోసారి విజయం సాధించారు. ఆయన తన సమీప టిడిపి ప్రత్యర్ధి స్వర్ణకుమారిని 21863 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు. సిపిఎం అభ్యర్ధిగా పోటీచేసిన పోతినేని సుదర్శరావుకు 44245 ఓట్లు రాగా, టిఆర్ఎస్ అభ్యర్ధి ఆర్.రవీంద్రకు 4041 ఓట్లు వచ్చాయి. గతంలో వెంకటరెడ్డి సుజాతనగర్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు గెలిచారు. పునర్విభజనలో ఆ నియోజకవర్గం రద్దవడంతో వెంకటరెడ్డి పాలేరుకు మారి రెండుసార్లు గెలిచారు. వై.ఎస్. రాజశేఖరరరెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డిల మంత్రివర్గాలలో సభ్యుడిగా రామిరెడ్డి పనిచేశారు. 2014లో గెలిచిన తర్వాత వెంకటరెడ్డి అనారోగ్యానికి గురై కన్నుమూశారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికలో అప్పటికే కెసిఆర్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు పోటీచేసి దివంగత వెంకటరెడ్డి సతీమణి సుచరిత రెడ్డిపై 21,863 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2018 ఎన్నికలలో తుమ్మల పాలేరులో మరోసారి పోటీచేసి ఓటమి చెందారు. తుమ్మల సత్తుపల్లి నుంచి మూడుసార్లు, ఖమ్మం నుంచి ఒకసారి గెలిచారు. మొత్తం ఐదుసార్లు ఆయన గెలిచారు. టిడిపి నుంచి టిఆర్ఎస్లోకి మారి ఎమ్మెల్సీ అయి మంత్రి అయ్యారు. కాని 2018లో ఓటమి చెందడంతో మంత్రి పదవి కోల్పోయారు. రామిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రామిరెడ్డి దామోదరరెడ్డి నల్లగొండ జిల్లాలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిపనిచేశారు. 2014, 2018 ఎన్నికలలో సూర్యాపేట నుంచి ఓడిపోయారు. పాలేరులో కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐలు పదకుండుసార్లు, సిపిఎం రెండుసార్లు సిపిఐ ఒకసారి, టిఆర్ఎస్ ఒకసారి గెలిచాయి. 2009లో పునర్విభజన తర్వాత పాలేరు జనరల్ సీటుగా మారింది. 2004 వరకు రిజర్వుడుగా ఉంది ఇక్కడి నుంచి అత్యధిక సార్లు సంభాని చంద్రశేఖర్ నాలుగుసార్లు గెలిచారు. చంద్రశేఖర్ గతంలో కోట్ల, వై.ఎస్.క్యాబినెట్లోకూడా వున్నారు. 1994లో సిపిఎం పక్షాన గెలిచిన సండ్ర వెంకటవీరయ్య ఆ తర్వాత టిడిపిలో చేరారు. 2009లో తిరిగి 2014, 2018లలో సత్తుపల్లిలో టిడిపి అభ్యర్ధిగా పోటీచేసి గెలుపొందారు. పాలేరు జనరల్‌గా మారిన తర్వాత మూడుసార్లు రెడ్డి సామాజికవర్గ నేతలు, ఒకసారి కమ్మ నేత గెలిచారు. పాలేరు నియెఓజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలో చెబుతారా?
ఆ పార్టీ నేతలకు చీఫ్‌విప్ కొప్పుల ప్రశ్న సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు టీఆర్ఎస్కు ఎందుకు ఓట్లేయాలో తాము లక్ష కారణాలు చెబుతామని, కాంగ్రెస్‌కు ఎందుకు ఓట్లేయాలో ఆ పార్టీ నాయకులు ఒక్క కారణమైనా చెప్పగల రా అని ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ ఒక ప్రకటనలో నిలదీశారు. అరవై ఏళ్లు సాగునీరు ఇవ్వకుండా పాలేరు నియోజకవర్గాన్ని ఎండబెట్టిన దుర్మార్గచరిత్ర టీడీపీ, కాంగ్రెస్‌లదేనని విమర్శించారు. తెలంగాణ ద్రోహుల కూటమి పాలేరులో మునగక తప్పదని హెచ్చరించారు. పాలేరులో టీఆర్ఎస్ గెలవక పోతే తన పదవికి రాజీనామా చేస్తానన్న మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్‌ను కాంగ్రెస్ నేతలు స్వీకరించాలని డిమాండ్ చేశారు. నాడు తెలంగాణ రాకుండా అడ్డుపడిన ద్రోహులే రాష్ట్రం వచ్చాక అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ఇప్పటికే నామరూపాల్లేకుండా పోయిన టీడీపీకి పట్టిన గతే రానున్న రోజుల్లో కాంగ్రెస్‌కూ పడుతుందన్నారు.