Paleru Assembly Constituency History in Telugu, Who Will Be The Next MLA? - Sakshi
Sakshi News home page

Paleru Assembly Constituency: పాలేరు నియోజకవర్గం గొప్ప రాజకీయ చరిత్ర

Published Fri, Aug 11 2023 1:16 PM | Last Updated on Thu, Aug 17 2023 12:07 PM

Rich Political History Of Paleru Constituency - Sakshi

పాలేరు నియెఓజకవర్గం

పాలేరు నియెఓజకవర్గంలో కాంగ్రెస్‌ ఐ పక్షాన పోటీచేసిన కందాళ ఉపేందర్‌ రెడ్డి తొలిసారి గెలిచారు. ఆయన తన సమీప టిఆర్‌ఎస్‌ ప్రత్యర్ది, మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావుపై సంచలన విజయం సాదించారు. అంతకు ముందు ఉప ఎన్నికలో ఇక్కడ తుమ్మల భారీ ఆదిక్యతతో గెలుపొందగా, జనరల్‌ ఎన్నికలో ఓడిపోయారు. ఉపేందర్‌ రెడ్డికి 7669 ఓట్ల ఆదిక్యత వచ్చింది. ఉపేందర్‌ రెడ్డికి 89407 ఓట్లు రాగా, తుమ్మల నాగేశ్వరరావుకు 81738 ఓట్లు వచ్చాయి. ఇక్కడ సిపిఎం అభ్యర్ధిగా పోటీచేసిన బత్తుల హైమవతికి సుమారు 5800 ఓట్లు వచ్చాయి.

ఉపేందర్‌ రెడ్డి సామాజికవర్గం పరంగా రెడ్డి వర్గానికి చెందినవారు. ఎన్నికల తర్వాత ఉపేందర్‌ రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డి పాలేరు నియోజకవర్గం నుంచి 2014లో ఐదోసారి విజయం సాధించారు. ఆయన తన సమీప టిడిపి ప్రత్యర్ధి స్వర్ణకుమారిని 21863 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు. సిపిఎం అభ్యర్ధిగా పోటీచేసిన పోతినేని సుదర్శరావుకు 44245 ఓట్లు రాగా, టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి ఆర్‌.రవీంద్రకు 4041 ఓట్లు వచ్చాయి. గతంలో వెంకటరెడ్డి సుజాతనగర్‌ నియోజకవర్గం నుంచి మూడుసార్లు గెలిచారు.

పునర్విభజనలో ఆ నియోజకవర్గం రద్దవడంతో వెంకటరెడ్డి పాలేరుకు మారి రెండుసార్లు గెలిచారు. వై.ఎస్‌. రాజశేఖరరరెడ్డి, రోశయ్య, కిరణ్‌ కుమార్‌రెడ్డిల మంత్రివర్గాలలో సభ్యుడిగా రామిరెడ్డి పనిచేశారు. 2014లో గెలిచిన తర్వాత వెంకటరెడ్డి అనారోగ్యానికి గురై కన్నుమూశారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికలో అప్పటికే కెసిఆర్‌ క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు పోటీచేసి దివంగత వెంకటరెడ్డి సతీమణి సుచరిత రెడ్డిపై 21,863 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2018 ఎన్నికలలో తుమ్మల పాలేరులో మరోసారి పోటీచేసి ఓటమి చెందారు.

తుమ్మల సత్తుపల్లి నుంచి మూడుసార్లు, ఖమ్మం నుంచి ఒకసారి గెలిచారు. మొత్తం ఐదుసార్లు ఆయన గెలిచారు. టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లోకి మారి ఎమ్మెల్సీ అయి మంత్రి అయ్యారు. కాని 2018లో ఓటమి చెందడంతో మంత్రి పదవి కోల్పోయారు. రామిరెడ్డి వెంకటరెడ్డి  సోదరుడు రామిరెడ్డి దామోదరరెడ్డి నల్లగొండ జిల్లాలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిపనిచేశారు. 2014, 2018 ఎన్నికలలో సూర్యాపేట నుంచి ఓడిపోయారు. పాలేరులో కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ఐలు పదకుండుసార్లు, సిపిఎం రెండుసార్లు సిపిఐ ఒకసారి, టిఆర్‌ఎస్‌ ఒకసారి  గెలిచాయి.

2009లో పునర్విభజన తర్వాత పాలేరు జనరల్‌ సీటుగా మారింది. 2004 వరకు రిజర్వుడుగా ఉంది ఇక్కడి నుంచి  అత్యధిక సార్లు సంభాని చంద్రశేఖర్‌ నాలుగుసార్లు గెలిచారు. చంద్రశేఖర్‌  గతంలో  కోట్ల, వై.ఎస్‌.క్యాబినెట్‌లోకూడా వున్నారు. 1994లో సిపిఎం పక్షాన గెలిచిన సండ్ర వెంకటవీరయ్య ఆ తర్వాత టిడిపిలో చేరారు. 2009లో తిరిగి 2014, 2018లలో సత్తుపల్లిలో టిడిపి అభ్యర్ధిగా పోటీచేసి గెలుపొందారు. పాలేరు జనరల్‌గా మారిన తర్వాత మూడుసార్లు రెడ్డి సామాజికవర్గ నేతలు, ఒకసారి కమ్మ నేత  గెలిచారు.

పాలేరు నియెఓజకవర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement