Upendar Reddy
-
పాలేరు నియోజకవర్గం గొప్ప రాజకీయ చరిత్ర
పాలేరు నియెఓజకవర్గం పాలేరు నియెఓజకవర్గంలో కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసిన కందాళ ఉపేందర్ రెడ్డి తొలిసారి గెలిచారు. ఆయన తన సమీప టిఆర్ఎస్ ప్రత్యర్ది, మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావుపై సంచలన విజయం సాదించారు. అంతకు ముందు ఉప ఎన్నికలో ఇక్కడ తుమ్మల భారీ ఆదిక్యతతో గెలుపొందగా, జనరల్ ఎన్నికలో ఓడిపోయారు. ఉపేందర్ రెడ్డికి 7669 ఓట్ల ఆదిక్యత వచ్చింది. ఉపేందర్ రెడ్డికి 89407 ఓట్లు రాగా, తుమ్మల నాగేశ్వరరావుకు 81738 ఓట్లు వచ్చాయి. ఇక్కడ సిపిఎం అభ్యర్ధిగా పోటీచేసిన బత్తుల హైమవతికి సుమారు 5800 ఓట్లు వచ్చాయి. ఉపేందర్ రెడ్డి సామాజికవర్గం పరంగా రెడ్డి వర్గానికి చెందినవారు. ఎన్నికల తర్వాత ఉపేందర్ రెడ్డి టిఆర్ఎస్లో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డి పాలేరు నియోజకవర్గం నుంచి 2014లో ఐదోసారి విజయం సాధించారు. ఆయన తన సమీప టిడిపి ప్రత్యర్ధి స్వర్ణకుమారిని 21863 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు. సిపిఎం అభ్యర్ధిగా పోటీచేసిన పోతినేని సుదర్శరావుకు 44245 ఓట్లు రాగా, టిఆర్ఎస్ అభ్యర్ధి ఆర్.రవీంద్రకు 4041 ఓట్లు వచ్చాయి. గతంలో వెంకటరెడ్డి సుజాతనగర్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు గెలిచారు. పునర్విభజనలో ఆ నియోజకవర్గం రద్దవడంతో వెంకటరెడ్డి పాలేరుకు మారి రెండుసార్లు గెలిచారు. వై.ఎస్. రాజశేఖరరరెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డిల మంత్రివర్గాలలో సభ్యుడిగా రామిరెడ్డి పనిచేశారు. 2014లో గెలిచిన తర్వాత వెంకటరెడ్డి అనారోగ్యానికి గురై కన్నుమూశారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికలో అప్పటికే కెసిఆర్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు పోటీచేసి దివంగత వెంకటరెడ్డి సతీమణి సుచరిత రెడ్డిపై 21,863 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2018 ఎన్నికలలో తుమ్మల పాలేరులో మరోసారి పోటీచేసి ఓటమి చెందారు. తుమ్మల సత్తుపల్లి నుంచి మూడుసార్లు, ఖమ్మం నుంచి ఒకసారి గెలిచారు. మొత్తం ఐదుసార్లు ఆయన గెలిచారు. టిడిపి నుంచి టిఆర్ఎస్లోకి మారి ఎమ్మెల్సీ అయి మంత్రి అయ్యారు. కాని 2018లో ఓటమి చెందడంతో మంత్రి పదవి కోల్పోయారు. రామిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రామిరెడ్డి దామోదరరెడ్డి నల్లగొండ జిల్లాలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిపనిచేశారు. 2014, 2018 ఎన్నికలలో సూర్యాపేట నుంచి ఓడిపోయారు. పాలేరులో కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐలు పదకుండుసార్లు, సిపిఎం రెండుసార్లు సిపిఐ ఒకసారి, టిఆర్ఎస్ ఒకసారి గెలిచాయి. 2009లో పునర్విభజన తర్వాత పాలేరు జనరల్ సీటుగా మారింది. 2004 వరకు రిజర్వుడుగా ఉంది ఇక్కడి నుంచి అత్యధిక సార్లు సంభాని చంద్రశేఖర్ నాలుగుసార్లు గెలిచారు. చంద్రశేఖర్ గతంలో కోట్ల, వై.ఎస్.క్యాబినెట్లోకూడా వున్నారు. 1994లో సిపిఎం పక్షాన గెలిచిన సండ్ర వెంకటవీరయ్య ఆ తర్వాత టిడిపిలో చేరారు. 2009లో తిరిగి 2014, 2018లలో సత్తుపల్లిలో టిడిపి అభ్యర్ధిగా పోటీచేసి గెలుపొందారు. పాలేరు జనరల్‌గా మారిన తర్వాత మూడుసార్లు రెడ్డి సామాజికవర్గ నేతలు, ఒకసారి కమ్మ నేత గెలిచారు. పాలేరు నియెఓజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
ఉద్యోగం రావడం లేదని.. బీటెక్ విద్యార్థి తీవ్ర నిర్ణయం..
సంగారెడ్డి: ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం దొరకడం లేదు.. తోటి స్నేహితులు ఉద్యోగం చేస్తున్నారని మనస్తాపం చెందిన యువకుడు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈసంఘటన మండల పరిధిలోని విఠలాపూర్‌లో మంగళవారం రాత్రి జరిగింది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎడ్ల వెంకటలక్ష్మి, లక్ష్మారెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరు వ్యవసాయం చేస్తూ కుమారులను ఉన్నత చదువులు చదివించారు. పెద్ద కుమారుడు ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా, చిన్నకుమారుడు ఉపేందర్‌రెడ్డి (25) బీటెక్ పూర్తి చేశాడు. ఏడాదిగా ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నాడు. ఉద్యోగం రాకపోవడం.. తోటి స్నేహితులు ఉద్యోగం చేస్తున్నారని సన్నిహితులతో చెబుతూ ఉండేవాడు. ఈ క్రమంలో అదే గ్రామంలో ఉంటున్న తన మేనమామ తిరుపతిరెడ్డి వ్యవసాయ బావి వద్ద మోటారు మరమ్మతుల కోసం ఆయనతో కలిసి వెళ్లాడు. పని ముగించుకొని తిరుపతిరెడ్డి ఇంటికి రాగా.. ఉపేందర్‌రెడ్డి రాత్రి వరకు ఇంటికి రాలేదు. దీంతో రాత్రి తన మామ వాళ్ల ఇంట్లోనే ఉన్నాడని కుటుంబీకులు భావించారు. బుధవారం ఉదయం తిరుపతిరెడ్డి వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా గట్టుపైన ఉపేందర్ సెల్‌ఫోన్, డ్రెస్ ఉండడంతో కుటుంబీకులకు సమాచారం అందించాడు. బావిలో వెతకగా మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న ఎస్ఐ సుభాశ్‌గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. కొడుకు మృతితో తల్లిదండ్రుల రోధనలు మిన్నంటాయి. -
సీఎల్పీ విలీనం లక్ష్యంగా!
సాక్షి, హైదరాబాద్: ‘కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ’లక్ష్యంగా టీఆర్ఎస్ రాజకీయ వ్యూహాల జోరు పెంచింది. తెలంగాణ చట్టసభలలో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం లేకుండా వేగంగా చర్చలు మొదలుపెట్టింది. మార్చి ఆఖరుతో శాసనమండలిలో కాంగ్రెస్‌కు ప్రాతనిధ్యం లేకుండా పోతుంది. ఆరోజు వరకు అసెంబ్లీలోనూ మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అధికార పార్టీలో చేర్చుకుని.. సీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేసేలా ప్రయత్నాలు చేస్తోంది. ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరడం ఖాయమైంది. ఉపేందర్‌రెడ్డి గురువారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఆయ న టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరులో టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్రావుపై ఉపేందర్‌రెడ్డి విజయం సాధించారు. గెలిచినప్పటి నుంచే టీఆర్ఎస్ అధిష్టానంతో ఆయన సంప్రదింపులు మొదలుపెట్టారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఉపేందర్‌రెడ్డి చేరికతో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి మారుతున్న ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరుకుంది. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 18న వెలువడనుంది. ఆలోపు కాంగ్రెస్ నుంచి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు అధికార పార్టీ ముఖ్యనేతలు తెలిపారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ కూడా.. ఒకట్రెండు రోజుల్లో టీఆర్ఎస్లో చేరుతారని తెలిసింది. ఖమ్మంపై గులాబీ రెపరెపలు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏకపక్షంగా విజయం నమోదు చేసుకున్న టీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ప్రతికూల ఫలితాలను నమోదు చేసుకుంది. 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క ఖమ్మం సెగ్మెంట్లోనే గెలిచింది. ఎన్నికలు కాగానే.. ఎమ్మెల్యేలు లావుడ్య రాములునాయక్, రేగా కాంతారావు, సండ్ర వెంకటవీరయ్య, బానోతు హరిప్రియనాయక్, కందాల ఉపేందర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరడం ఖాయమైంది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఈ జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. సీఎల్పీ విలీనం దిశగా.. శాసనమండలిలో అనుసరించిన ‘కాంగ్రెస్ సభాపక్షం విలీనం’ వ్యూహాన్నే శాసనసభలో నూ అమలు చేయాలని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. శాసనమండలిలో కాంగ్రెస్‌కు ఐదుగురు సభ్యులు ఉంటే ముగ్గురు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్లో విలీనమవుతున్నట్లు శాసనమండలి చైర్మన్‌కు లేఖ ఇచ్చారు. దీంతో శానసమండలి కాంగ్రెస్ పక్షం టీఆర్ఎస్లో విలీనమైంది. కేవలం ఇద్దరు ఎమ్మెల్సీలతో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. ఇప్పుడు శాసనసభలోనూ ఇదే వ్యూహానికి రంగం సిద్దమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 19 సీట్లు కైవసం చేసుకుంది. వీరిలో 13మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరితే కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనమైనట్లుగా గుర్తిస్తారు. ఇదే జరిగితే కాంగ్రెస్‌కు శాసనసభలోనూ ప్రధాన ప్రతిపక్ష హోదా గల్లంతవుతుంది. లోక్‌సభ ఎన్నికలలోపు ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని టీఆర్ఎస్ వ్యూహాలు కదుపుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సబితారెడ్డి, ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియనాయక్, ఉపేందర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరడం ఖాయమే. మరో ఏడుగురు ఇదేబాటలో నడిస్తే.. టీఆర్ఎస్ అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. ఖమ్మం పచ్చబడుతుందనే: ఉపేందర్‌రెడ్డి కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు వీలైనంత సేవ చేయాలని నిర్ణయించుకున్నట్లు పాలేరు ఎమ్మెల్యే కందా ఉపేందర్‌రెడ్డి తెలి పారు. కేసీఆర్ నాయకత్వంలోనే ప్రాజెక్టులన్నీ పూర్తయితే.. ఖమ్మం జిల్లా పచ్చబడుతుందనే పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. అవసరమైతే కాంగ్రెస్ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి ప్రజా తీర్పు కోరడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను కలిసిన అనంతరం ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి పత్రికలకు ప్రకటన జారీ చేశారు. ‘ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచారు. టీఆర్ఎస్ను అఖండ మెజారిటీతో గెలిపించారు. కేసీఆర్ అన్ని వర్గా ల ప్రజల సంక్షేమం, అన్ని ప్రాంతాల అభి వృద్ధి కోసం ప్రణాళికబద్ధంగా అవిరళ కృషి చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మొత్తం వ్యవసాయ భూమికి సాగునీరందించే లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గానికి సాగునీరు అందించేందుకు భక్తరామదాసు ప్రాజెక్టును శరవేగంగా నిర్మించారు. కరువు పీడిత పాలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తున్నారు. ఇదే స్ఫూర్తితో సీతారామ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తున్నారు. కేసీఆర్ నాయకత్వంలో ఖమ్మం జిల్లా లో ప్రాజెక్టులన్నీ పూర్తయి, జిల్లా అంతా పచ్చబడుతుందనే పూర్తి నమ్మకం నాకు కలిగింది. ప్రజల బాగు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిశలు కష్టపడుతున్న కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని నిర్ణయించుకున్నాను. టీఆర్ఎస్లో చేరి కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు వీలైనంత సేవ చేయాలని నిర్ణయించుకున్నాను’ అని పేర్కొన్నారు. -
మెదక్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయం
సాక్షి, మెదక్: మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమైందని, మెజార్టీయే తేలాల్సి ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఉపేందర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తన గెలుపునకు దోహదపడుతుందని ఆయన చెప్పారు. మెదక్ నియోజకవర్గంలోని 261 గ్రామాల్లో నిశ్శబ్ధ విప్లవం కనిపిస్తోందని, కాంగ్రెస్ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ టికెట్ దక్కడం తనకు వరంలాంటిదని, ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని తెలి పారు. ఎన్నికల నేపథ్యంలో ఉపేందర్‌రెడ్డి బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు. సాక్షి: అనూహ్యంగా టికెట్ దక్కించుకున్న మీరు పార్టీ నేతల మద్దతు ఎలా కూడగట్టారు? ఉపేందర్‌రెడ్డి: కాంగ్రెస్ టికెట్ నాకు ప్రకటించినప్పటి నుంచి పార్టీలోని ఎమ్మెల్యే ఆశావహులందరినీ కలిసి వారి మద్దతు కూడగట్టాను. నా గెలుపుకోసం వారంతా చిత్తశుద్ధితో పని చేస్తున్నారు. నా సోదరుడు, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి నా గెలుపు కోసం కష్టపడుతున్నారు. కాంగ్రెస్, టీజేఎస్, టీడీపీ, సీపీఐ నాయకులు, కార్యకర్తలు సహకరిస్తున్నారు. సాక్షి: మీకే ఎందుకు ఓటు వెయ్యాలి? ఉపేందర్‌రెడ్డి: కాంగ్రెస్ పార్టీ పట్ల మెదక్ నియోజకవర్గ ప్రజలు సానుకూలంగా ఉన్నారు. నియోజకవర్గంలోని అన్ని గామాల్లో ప్రచారం చేశా. ఓటర్లను డైరెక్ట్‌గా కలిసి వారి మద్దతు కోరా. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. టీఆర్ఎస్ పాలనలో మెదక్ అన్ని రంగాల్లో వెనుకబడింది. నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమ కార్యక్రమాలు మెరుగ్గా అమలు కావాలన్నా ప్రజలు నాకు ఓటు వేయాలని కోరుతున్నా. సాక్షి: మీకు పోటీ ఎవరనుకుంటున్నారు? ఉపేందర్‌రెడ్డి: టీఆర్ఎస్ పార్టీయే మాకు ప్రత్యర్థి. టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు మధ్య పోటీ ఉంటుంది. పోటీలో కాంగ్రెస్ గెలవడం ఖాయం. సాక్షి: కాంగ్రెస్ గెలుస్తుందని ఎలా చెప్పగలుగుతున్నారు? ఉపేందర్‌రెడ్డి: టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ముఖ్యంగా రైతు రుణమాఫీ, సాగునీరు విషయంలో రైతులను ఇబ్బంది పెట్టారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదు. దీంతో టీఆర్ఎస్ పట్ల ప్రజలు విముఖంగా ఉన్నారు. టీఆర్ఎస్పై ఉన్న వ్యతిరేకత నా విజయానికి దోహదం చేస్తుంది. 40 వేల మెజార్టీతో నేను గెలవడం ఖాయం. సాక్షి: కాంగ్రెస్ ఎలాంటి హామీలు ఇస్తోంది? ఉపేందర్‌రెడ్డి: కాంగ్రెస్ మేనిఫెస్టో అద్భుతంగా ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. 2 లక్షల పంట రుణమాఫీతోపాటు సాగునీటి రంగానికి కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తోంది. తెల్ల రేషన్‌కార్డు లబ్ధిదారులకు ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేయబోతోంది. రూ.50 వేల డ్వాక్రా రుణాల మాఫీతోపాటు లక్ష రూపాయల గ్రాంటు ఇవ్వనున్నాం. ఇంటి స్థలం ఉంటే ఒక్కో లబ్ధిదారుడికి ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షలు ఉచితంగా ఇవ్వనున్నాం. సాక్షి: నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలను గుర్తించారు? ఉపేందర్‌రెడ్డి: మెదక్ నియోజకవర్గంలో అనేక సమస్యలున్నాయి. ముఖ్యంగా సాగు, తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. గ్రామాలకు సరైన రోడ్లు లేవు. ఘనపురం ప్రాజెక్టు ఉన్నా రైతులకు సాగునీరు అందడం లేదు. ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పిన టీఆర్ఎస్ చేతులు ఎత్తేసింది. ఉపాధి సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. సాక్షి: ఎమ్మెల్యేగా ఎన్నికైతే ప్రజలకు ఏం చేస్తారు? ఉపేందర్‌రెడ్డి: నియోజకవర్గం అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తా. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తా. సింగూరు జలాలు కేవలం మెదక్ నియోజకవర్గం రైతులకు దక్కేలా చూస్తా. ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీ తెరిపించి చెరుకు రైతులు, కార్మికులకు న్యాయం చేస్తా. రామాయంపేటను డివిజన్ కేంద్రంగా మారుస్తా. ఉపాధి కల్పనపై ప్రధానంగా దృష్టి పెడతా, నిమ్జ్‌లాంటి పరిశ్రమ తీసుకువచ్చేందుకు కృషి చేస్తా. -
కుక్క కోసం కొట్టుకున్నారు...
హైదరాబాద్ : ఆస్తి కోసం కొట్టుకోవడం చూశాం....అమ్మాయి కోసం కొట్టుకుంటారని విన్నాం...కానీ ఇదేం విచిత్రమో కుక్క కోసం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కుక్కే కదా అని తీసిపారేయకండి. చివరకు ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. కుక్క నాదంటే... నాదంటూ నడిరోడ్డుపై కొట్లాటకు దిగిన ఈ సంఘటన హైదరాబాద్ ఎల్బీనగర్లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఎల్బీనగర్కు చెందిన సురేందర్ రెడ్డి కొన్ని రోజుల క్రితం స్నేహితుడి వద్ద నుంచి ఓ కుక్కను తెచ్చుకుని పెంచుకుంటున్నాడు. సరూర్‌నగర్‌కు చెందిన ఉపేందర్‌రెడ్డి పెంచుకుంటున్న కుక్క అయిదు నెలల క్రితం తప్పిపోయింది. దీంతో పోలీస్‌స్టేషన్‌లో కంప్లైట్ ఇచ్చాడు. సోమవారం రాత్రి సురేందర్ రెడ్డి తన కుక్కను తీసుకుని రోడ్డు మీదకి వచ్చాడు. అదే సమయంలో ఉప్పల్ వెళ్తున్న ఉపేందర్ సిరినగర్ కాలనీ వద్ద తన కారు ఆపాడు. సురేందర్‌రెడ్డి అనే వ్యక్తి దగ్గర కుక్క కనిపించింది. అంతేకాదు ఉపేందర్‌ను గుర్తుపెట్టి కారు కూడా ఎక్కిందట. దీంతో ఆ కుక్క తనదే అంటున్నాడు ఉపేందర్. సురేందర్‌రెడ్డి మాత్రం ఓ కుటుంబం అమెరికా వెళ్తూ ఆ కుక్కను తనకు అప్పగించి వెళ్లారని చెప్తున్నారు. కుక్కను తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉపేందర్... సురేందర్ మధ్య గొడవ మొదలైంది. ఇద్దరూ ఒకరినొకరు కొట్టేసుకున్నారు. స్థానికులు గమనించి ఎల్బీనగర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఈ వివాదం పోలీస్ స్టేషన్‌కు చేరింది. -
అక్రమాల పుట్ట పగులుతోంది!
బషీరాబాద్: నిజాం కాలంలో నిర్మించిన ఇళ్లకు కొత్త ఇళ్లంటూ బిల్లులు చెల్లించారని సీబీసీఐడీ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి ఇందిరమ్మ ఇళ్లు కట్టుకున్నారా లేదా అనే విషయమై తనిఖీ చేశారు. బషీరాబాద్‌లో ఏ ఇంటికి వెళ్లిన 50 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇళ్లకే హౌసింగ్ అధికారులు ఇందిరమ్మ బిల్లులు చెల్లించారని విచారణలో వెల్లడైంది. ఇందిరమ్మ ఇళ్లుగా చెప్పుకుంటున్న ప్రతి ఇంటికి వెళ్లి విచారణ జరిపిన అధికారులు బిల్లుల స్వాహాలో లబ్ధిదారులు, అధికారులు, స్థానిక నాయకుల చేతివాటం ఉన్నట్లు నిర్ధారించారు. బషీరాబాద్ ఉప సర్పంచ్ రజాక్ ఇంటికి అధికారులు వెళ్లగా ఉప సర్పంచ్ తల్లి పేరిట పాత ఇంటిని చూపించి ఇల్లు కట్టుకున్నట్లుగా బిల్లు స్వాహ చేశారని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు ఇందిరమ్మ ఇళ్ల పేరిట దుకాణ సముదాయం నిర్మించుకున్నారని గుర్తించారు. జయంతి కాలనీలో మధ్యవర్తులతో కలిసి అధికారులు బిల్లులు స్వాహా చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఎవ్వర్నీ వదలం.. బషీరాబాద్ మండల కేంద్రంలో 479 ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రూ. 98 లక్షల అవినీతి జరిగినట్లు సీబీసీఐడీ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మొదటి విడతలో ఎంపికైన బషీరాబాద్ గ్రామ పంచాయతిలో మొత్తం 1195 ఇళ్లు మంజూరు కాగా అందులో 951 నిర్మాణం పూర్తయినట్లు హౌసింగ్ అధికారులు బిల్లులు చెల్లించారన్నారు. వాస్తవానికి బషీరాబాద్ గ్రామ పంచాయతిలో 80 శాతం వరకు ఇళ్ల బిల్లులలో అక్రమాలు జరిగాయన్నారు. పథకం అమలు నాటి నుంచి కొనసాగిన అధికారులను విచారణ చేస్తామన్నారు. ఇప్పటికే అక్రమాలకు పాల్పడిన పలువురి అధికారులను సంబంధిత శాఖ సస్పెండ్ చేసిందని, క్రిమినల్ యాక్ట్ ప్రకారం ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన అక్రమాలపై అధికారుల పాత్రను గుర్తించి అరెస్టు చేసి జైలుకు పంపుతామన్నారు. ఈనెల 14 లోపు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన అక్రమాలను ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. బషీరాబాద్ ఉప సర్పంచ్ సైతం తల్లి పేరిట ఇల్లు కట్టకుండానే బిల్లు తీసుకోవడం విడ్డూరమన్నారు. ఈ విచారణలో సీబీసీఐడీ అధికారుల బృందం జితేందర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, సంపత్‌రెడ్డి, బషీరాబాద్ ఎస్ఐ లకా్ష్మరెడ్డి, హౌజింగ్ డీఈఈ సీతారామమ్మ, గతంలో పని చేసిన డీఈఈలు, ఏఈలు ఉన్నారు. బషీరాబాద్ పంచాయతీ పరిధిలో విచారణ జరగనుందని తెలిసినా హౌసింగ్ అధికారులు ఇళ్లకు నంబర్లు వేయకపోవడంతో సీఐడీ అధికారుల బృందానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. మధ్యాహ్నం వరకు సీఐడీ అధికారులు కొన్ని ఇళ్ల తనిఖీ చేశారు. అయితే ఇళ్లకు నంబర్లు వేసి పిలుస్తామని చెప్పిన హౌసింగ్ అధికారులు సాయత్రం 4గంటల వరకు కూడా సమాచారం ఇవ్వకపోవడంతో సీఐడీ అధికారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. -
గుప్త నిధుల వేటలో అపశ్రుతి
బిచ్కుంద : శాంతాపూర్ గండిలో బుధవారం రాత్రి గుప్త నిధుల కోసం తవ్వుతుండగా ఓ వ్యక్తిపై పెద్ద రాయి పడింది. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బిచ్కుంద మండలం పెద్దకొడప్గల్, బేగంపూర్, అంజని, జుక్కల్ మండలం ఖండేబల్లూర్, పోచారం తండాకు చెందిన సు మారు 25 మంది, హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తితో కలిసి గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. ఈ క్రమంలో బండరాళ్ల మధ్యలోనుంచి పది అడుగుల లోతు తవ్వారు. బుధవారం రాత్రి తవ్వకాలు కొనసాగిస్తుండగా గుంతలోపల ఉన్న పోచారం గ్రామానికి చెందిన జైత్రాంపై పెద్ద రాయి పడింది. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టినవారు అక్కడినుంచి పరారయ్యారు. ఆ నోట ఈ నోట విషయం బయటికి పొక్కింది. అదే రాత్రి ఎస్సై ఉపేందర్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకున్నామని, నిందితుల కోసం గాలిస్తున్నామని ఎస్సై తెలిపారు. అత్యాశతో.. వరాల కోసం దేవుడిని వేడుకునే మనిషి.. అత్యాశకు పోయి గుప్తనిధుల కోసం ఆ దేవుడి ఆలయాల వద్దే తవ్వకాలు జరుపుతున్నాడు. పాత మందిరాలు, చారిత్రక కట్టడాలను తవ్వేస్తున్నాడు. మందిరాలను కూల్చుతున్నాడు. బిచ్కుందలో, శాంతాపూర్ గండిలో కౌలాస్ ఖిల్లాలో గుప్త నిధులు ఉన్నాయని నమ్ముతున్నవారు తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. కౌలాస్ ఖిల్లాను పరిపాలించిన రాజులు శాంతాపూర్ గండిలో బంగారు నాణాలను పాతిపెట్టారని ప్రచారంలో ఉంది. దీంతో గుప్తనిధుల కోసం ఆ ప్రాంతం లో తరచూ తవ్వకాలు జరుపుతున్నారు. అలా తవ్వకాలు జరుపుతున్న క్రమంలోనే బుధవారం రాత్రి ఘటన చోటు చేసుకుంది. గతంలో.. బిచ్కుంద -తక్కడపల్లి రోడ్డులో ఉన్న 500 ఏళ్ల నాటి ఆలయాన్ని గతంలో గుప్తనిధుల కోసం కూల్చేశారు. బిచ్కుంద కమ్మరి చెరుపుట్ట, శాంతాపూర్, కందర్ప ల్లి, బడారెంజల్ గ్రామాల్లో తవ్వకాలు జరిపారు. నాలుగేళ్ల క్రితం బిచ్కుదలో ఏడేళ్ల బాలుడిని బలి ఇచ్చారని వదంతులు వ్యా పించాయి. అత్యాశతో పలువురు చారిత్రక కట్టడాలను కూల్చేస్తూనే ఉన్నారు.