badradhri
-
పినపాక (ఎస్టీ) నియోజకవర్గంలో తదుపరి ఎన్నికల్లో అధికారంలో ఉండేది ఎవరు..?
పినపాక (ఎస్టి) నియోజకవర్గం పినపాక రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఐ పార్టీ తరపున పోటీచేసిన రేగ కాంతరావు రెండోసారి విజయం సాదించారు. ఆయన 2009లో తొలిసారి గెలవగా, 2018లో తన సమీప టిఆర్ఎస్ ప్రత్యర్ది, సిటింగ్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుపై 18567 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ఆ తర్వాత కొంతకాలానికి కాంతారావు టిఆర్ఎస్లో చేరిపోయారు. కాంతారావుకు 72283 ఓట్లు రాగా, పాయం వెంక టేశ్వర్లుకు 52718 ఓట్లు వచ్చాయి. 2009కి ముందు బూర్గంపాడు నియోజకవర్గం ఉండేది. ఇక్కడ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసిన పి.దుర్గకు 5700 ఓట్లు వచ్చాయి. 2014లో తెలంగాణలో కేవలం ఖమ్మం జిల్లాలోనే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తన ఉనికిని నిలబెట్టుకుని ఒక ఎమ్.పి సీటును, మూడు ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. మూడు ఎమ్మెల్యే సీట్లు కూడా గిరిజన సీట్లు కావడం ప్రత్యేకత. పినపాకను పరిగణనలోకి తీసుకుంటే 2009, 2018లలో కాంగ్రెస్ ఐ మళ్లీ గెలిచింది. 2014లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసిన పాయం వెంకటేశ్వర్లు గతంలో సిపిఐ పక్షాన ఒకసారి గెలిచారు. 2009లో కూడా ఆ పార్టీ పక్షాన పోటీచేసి ఓటమి చెందారు. తదుపరి 2014లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తరపున పోటీచేసి తన సమీప ప్రత్యర్ధి టిఆర్ఎస్ నేత శంకర్ నాయక్‌ను 14065 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు. ఆ తర్వాత కాలంలో ఆయన టిఆర్ఎస్లోకి మారిపోయారు. 2014లో బిజెపి-టిడిపి కూటమి అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య పోటీచేసి 28195 ఓట్లు తెచ్చుకుని ఓడిపోయారు. సిపిఐ పక్షాన పోటీచేసిన టి.రమేష్‌కు 19313 ఓట్లు వచ్చాయి. 1985 తర్వాత బూర్గుంపాడులో కాంగ్రెస్ ఐ గెలవలేదు. అయితే బూర్గుంపాడు బదులు పినపాకను పరిగణనలోకి 2009లోనే కాంగ్రెస్ ఐ ఇక్కడ గెలిచింది. గతంలో ఈ నియోజకవర్గం స్థానే బూర్గంపాడు ఉండేది. బూర్గుంపాడుకు ఎన్నికలలో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి నాలుగుసార్లు, టిడిపి ఒకసారి, ఇండిపెండెంటు ఒకసారి గెలిచారు. బూర్గుంపాడులో కొమరం రామయ్య 1967లో గెలిచాక, ఆయన ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పు చెప్పడంతో, మళ్ళీజరిగిన ఉప ఎన్నికలో ఈయనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక్కడ రెండుసార్లు గెలిచిన కుంజా భిక్షం ఆ తర్వాత కాలంలో ఈయన సిపిఐని వదలి టిడిపిలోకి, తర్వాత కాంగ్రెస్‌లోకి వెళ్ళారు. తదుపరి టిఆర్ఎస్ పక్షాన పోటీచేసి ఓడిపోయారు. 1983లో ఇక్కడ గెలిచిన ఊకే అబ్బయ్య 1994లో, 2009లో ఇల్లెందులో గెలుపొందారు. 1985లో కాంగ్రెస్ ఐ అభ్యర్ధిగా గెలిచిన చందాలింగయ్య 2001లో ఖమ్మం జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా పనిచేశారు. పినపాక (ఎస్టి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
ప్రజాధనం లూటీ చేస్తున్నారు
సాక్షి,బూర్గంపాడు,ఖమ్మం: ‘ప్రస్తుతం ప్రజాసేవ పేరుతో ప్రజాధనం లూటీ చేస్తున్నారు. సామాన్యుడు ప్రస్తుతం రాజకీయాలలో పోటీకి దిగే పరిస్థితులు లేవు. డబ్బు లేకపోతే నాయకులను పట్టించుకునే పరిస్థితులు లేవు. ఈ పరిస్థితి పట్ల ఒకింత బాధకలుగుతోంది’ అని బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ చందా లింగయ్యదొర అన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తన అంతరంగాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. సాక్షి: నాటికి, నేటికీ రాజకీయాల్లోలో కనిపిస్తున్న మార్పులేమిటి? చందా: నాడు రాజకీయాలు నిస్వార్థంగా ప్రజాసేవ కోసం మాత్రమే చేసేవారు. నేడు రాజకీయాలు సంపాదన కోసం చేస్తున్నారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చుచేయటం, గెలిచిన తరువాత దోచుకోవటం సర్వసాధారణమైంది. ప్రజాప్రతినిధిగా ఏ విధమైన అభివృద్ధిని చేపట్టారు? చందా: ఎమ్మెల్యేగా, జెడ్పీ చైర్మన్‌గా మారుమూల గ్రామాలలో తాగునీటి వసతులు, రహదారులను అభివృద్ధి చేశాను. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లోని పాఠశాలలను అప్‌గ్రేడ్ చేయించి వాటిలో మౌలికవసతుల కల్పించాను. దీంతో మారుమూల గ్రామాలలో అక్షరాస్యత పెరిగింది. రైతులు పంటలు సాగుచేసుకునేందుకు లిప్ట్ ఇరిగేషన్ స్కీంలు, చెరువులు తవ్వించాను. మీ అభిమాన రాజకీయ నాయకులెవరు? చందా: నాకు అత్యంత అభిమాన నాయకులు జలగం వెంగళరావు, డా వైఎస్ రాజశేఖరరెడ్డి మీరు ప్రజలకు ఇచ్చే సందేశం.. ? చందా: ఓటర్లు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. గుడ్డిగా ఓట్లు వేయవద్దు. తాత్కాలిక ప్రయోజనాలు, లబ్ధికాకుండా భవిష్యత్‌లో జరగాల్సిన అభివృద్ధి, సంక్షేమంపై ఆలోచన చేయాలి. ఏ పార్టీ వల్ల మంచి జరుగుతుందో, ఏ అభ్యర్థి నిస్వార్థంగా సేవలను అందిస్తాడో గమనించాలి. డబ్బు, మద్యానికి ఓట్లు అమ్మవద్దు. మరి మీరు పోటీ చేయకుండా, మీ తనయుడికి అవకాశమిచ్చారు..? చందా: 1985లో కాంగ్రెస్ నుంచి బూర్గంపాడు లో ఎమ్మెల్యేగా గెలిచాను. 2001 నుంచి 2006 వరకు ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేశాను. నా రాజకీయ జీవితం విలువలతో కూడుకున్నది. చిన్నతనం నుంచి నేను చేస్తున్న ప్రజాహిత కార్యక్రమాలను దగ్గర్నుంచి చూసిన నా కుమారుడు డాక్టర్ చందా సంతోష్‌కుమార్ రాజకీయాల పట్ల ఆకర్షితుడయ్యాడు. ప్రజాసేవ పట్ల అతనికి ఉన్న బలమైన కోరికను కాదనలేక ప్రోత్సహిస్తున్నాను. ఉన్నత విద్యను అభ్యసించిన మీరు ఉద్యోగం చేయకుండా.. రాజకీయాలను ఎంచుకోవడానికి కారణం..? చందా: నేను 1970లోనే ఎంఏ, ఎంఫిల్ పూర్తిచేశాను. చదువు కోసం చిరుమళ్ల నుంచి బూర్గంపాడుకు ఎన్నోసార్లు కాలినడకన వెళాలను. కాలినడకన రెండురోజులు పట్టేది. నాటి ఆదివాసీల దుర్భరమైన జీవితాలను మార్చాలనే ఆలోచనతో 1970లో చదువు పూర్తయిన వెంటనే ఆదివాసీ గిరిజన అభ్యుదయసంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాను. రాజకీయాలతోనే ఆదివాసీల అభివృద్ధికి సాధ్యమని 1978లో రాజకీయాల్లోకి వచ్చాను. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను. గిరిజనుడిని కావటంతోనే రాజకీయంగా సరైన గుర్తింపు లభించలేదు. అయినా గిరిజన అభ్యున్నతి కోసం ఇప్పటికీ రాజకీయాల్లోనే ఉన్నాను. -
భద్రాద్రి రామయ్యకు గిరిజనుల నీరాజనం
ఘనంగా శబరి స్మృతియాత్ర విలీన ప్రాంత గిరిజనుల విశేషపూజలు నెల్లిపాక : ఆంధ్రా సరిహద్దుల్లోని భద్రాద్రి సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శబరి స్మృతియాత్రను ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాముడి వనవాస సమయంలో ఆయనకు ఎంగిలి పండ్లు తినిపించిన గిరిజన మహిళ శబరిని జ్ఞప్తి చేసుకుంటూ ఏటా అశ్వయుజ పౌర్ణమినాడు ఈ వేడుకను గిరిజనులు నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా వందలాది గిరిజనులు ఈయాత్రలో పాల్గొని రామయ్యకు విశేష పూజలు నిర్వహించారు. గిరిజనుల కోలాహలం నడుమ భద్రాచల దివ్యక్షేత్రంలో అత్యంత వైభవోపేతంగా శబరిస్మృతి యాత్ర సాగింది. తొలుత గిరిజనులు తమ సంప్రదాయ కొమ్ము, కోయనృత్యాలు, కోలాటాలను స్వామి వారి ముందు ప్రదర్శిస్తూ మూడుసార్లు గిరి ప్రదక్షిణ చేశారు. శబరి నది నుంచి కలశాలతో తీసుకొచ్చిన జలాలతో గిరిజన మహిళలు మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఆలయ ప్రదక్షిణ చేశారు. అనంతరం ధ్వజస్థంభం వద్ద నున్న బలిపీఠానికి గిరిజన మహిళలు పసుపు, కుంకుమలు చల్లి ముగ్గులు వేసి అలంకరించారు. తర్వాత అడవుల్లో దొరికే దుంపలను, పూలను గిరిజనులు ఆలయ ఈవో రమేష్‌బాబుకు అందజేశారు. గిరిజనులు తీసుకొచ్చిన పూలతో వైకుంఠ రాముడికి కన్నుల పండువగా పుష్పార్చన నిర్వహించారు. శబరి నది పరీవాహక ప్రాంతాల్లో ఉండే గిరిజన గ్రామాల ప్రజలు అధికంగా ఈయాత్రలో పాల్గొని పూజలు చేశారు.ఈ వేడుకలో జిల్లా జడ్జి వినయ్‌మోహన్, ఆలయ ప్రదానార్చకుడు పొడిచేటి జగన్నాథాచార్యులు పాల్గొన్నారు.