రేగా కాంతారావు రాజీనామా, తిరస్కరించిన పొన్నాల
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కని ఎమ్మెల్యే రేగా కాంతారావు తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. అసంతృప్తితో ఉన్న కాంతారావుకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కట్టబెట్టేందుకు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య చేసిన ప్రయత్నాలు కొలిక్కిరాలేదు. ఖమ్మం డీసీసీ పదవి లంబాడాలకు ఇవ్వడమే న్యాయమంటూ పొన్నాలకు ఎంపీ రేణుకాచౌదరి సూచించారు.
అయితే తనకు డీసీసీ అధ్యక్ష పదవి వద్దంటూ రాజీనామా లేఖ ఇవ్వబోయిన కాంతారావును పొన్నాల, కేంద్రమంత్రి బలరాం నాయక్ లు వారించారు. కాంతారావును మీడియాతో మాట్లాడనివ్వకుండా బలవంతంగా పొన్నాల వద్దకు బలరాంనాయక్ తీసుకెళ్లారు. తనకు టికెట్ కేటాయించకపోవడంపై రేగా కాంతారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.