పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి పెళ్లి ఒక చోట.. సంసారం మరోచోట అన్న చందంగా ఉందని ఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా 420లేనని భట్టి అన్నారు. ప్రజాపరిరక్షణ యాత్ర సందర్భంగా పినపాక నియోజకవర్గం మార్కోడులో ఆయన భద్రాచలం ఎమ్మెల్యే పొడెం వీరయ్యతో కలిసి మీడియాతో మాట్లాడారు.