మాజీ ఎమ్మెల్యే ఆమరణ దీక్ష భగ్నం | Former MLA's fast unto death ruined | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే ఆమరణ దీక్ష భగ్నం

Published Wed, Feb 24 2016 11:03 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM

Former MLA's fast unto death  ruined

ఖమ్మం జిల్లా మణుగూరులో రెండు రోజులుగా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆమరణ దీక్షను పోలీసులు బుధవారం తెల్లవారుజామున భగ్నం చేశారు. మణుగూరు ఓపెన్ కాస్ట్‌కు సంబంధించి భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తామన్న హామీని నెరవేర్చాలని కోరుతూ రేగా కాంతారావు సోమవారం నుంచి దీక్ష చేస్తున్నారు.

ఈ క్రమంలో పోలీసులు తెల్లవారుజామున రంగ ప్రవేశం చేసి దీక్షను భగ్నం చేశారు. ఆయన్ను వైద్య పరీక్షల నిమిత్తం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, పోలీసుల చర్యకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ బుధవారం పట్టణ బంద్‌కు పిలుపునిచ్చింది. నాయకులు, కార్యకర్తలు విద్యా సంస్థలను, దుకాణాలను బంద్ చేయించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement