భద్రాద్రి: పినపాక నియోజక వర్గంలో ఎన్నికలను ప్రభావితం చేసేది డబ్బు, కమ్మ కులం, రెడ్డి కులం. నియోజకవర్గంలో అన్ని వనరులు పుష్కలంగా ఉన్నపటికీ నిరుద్యోగ యువతకు ఐటీసీ, సింగరేణి, హెవీ వాటర్ ప్లాంట్ ఉన్నా స్థానిక నిరుద్యోగ యువతకు ఎటువంటి అవకాశాలు కల్పించలేదని, ఈ నియోజకవర్గం దాదాపుగా 80 శాతం గోదావరి పరివాహక ప్రాంతం కావటం ప్రతి సంవత్సరం సుమారు 60 గ్రామాల వరకు నీట మునిగి పోతాయి.
ఇండ్లు, పంట పొలాలు, రోడ్లు, పూర్తిగా జలమయమై పోతాయి. ఎన్నో సంత్సరాల నుంచి ఎంతో మంది అధికారులకు, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులకు మొరపెట్టిన వారిని మైదాన ప్రాంతాలకు తరలించి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని వేడుకున్న వాళ్ల మొర ఆలకించే నాథుడే కరువయ్యాడు. వెరసి యువత, గోదావరీ పరివాహక ప్రాంత ప్రజలు స్థానిక ఎమ్మెల్యే రేగ కాంతారావుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
ప్రజలతో..
రేగ కాంతారావు ఈ నియోజవర్గానికి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పుటికి ప్రజలతో నేరుగా సంబంధాలు లేకపోవటం, ఇసుక ర్యాంపులలో కమిషన్లు, అధికార పార్టీ నేతలు భూ కబ్జాలు, ఇక ప్రతిపక్ష నాయకుడు మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినారు. గతంలో సీపీఐ పార్టీలో పనిచేయడం గ్రామ స్థాయి నుంచి ప్రతి కార్యకర్తతో నేరుగా సంబంధాలు ఉండటం.. అయన ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో పెత్తనం మొత్తం అయన భార్యదే.
ఎమ్మెల్యే నామ్కే వాస్తు అనే అప నింద నేటి వరకు అయన మోయటం, సీపీఐ పార్టీ నుంచి వైఎస్సార్సీపీ పార్టీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చేరటం, పొంగులేటికి చెప్పకుండా ఏ పని చేయడు అని ప్రజలో బలంగా వినిపిస్తున్న మాట. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య పది మంది వరకు ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినప్పటికీ అవి పెద్దగా ప్రభావం చూపకపోవటం, గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ కేడర్ బలంగా ఉండటం, కాంగ్రెస్ పార్టీలో ఎన్ని గ్రూపులు ఉన్నపటికీ ఇక్కడ సుమారు 50 వేల వరకు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ చెక్కు చెదరకుండా ఉందని చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment